కొన్నిసార్లు ఊహించని విధంగా చిక్కులు ఎదురవుతుంటాయి. అలా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌కి మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకుగానూ ఈ పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరో శింబు.. కమల్ హాసన్ మూవీలో నటించడానికి వీల్లేదంటూ..)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ అనుభవాలతో 'కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్' పేరుతో ఓ పుస్తకం రాసింది. అయితే ఈ బుక్ టైటిల్‌లో 'బైబిల్' పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ లాయర్ క్రిస్టోఫర్ ఆంథోని కోర్టుని ఆశ్రయించారు. జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసు జారీ చేసింది. ఆ పదం వాడటానికి గల కారణమేంటని ప్రశ్నించింది.
కరీనా కపూర్‌పై కేసు కూడా నమోదు చేయాలని క్రిస్టోపర్ పిటిషన్ వేశారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. బుక్ టైటిల్‌లోని 'బైబిల్' పదం వల్ల క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని ఆంథోనీ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం అని, కరీనా కపూర్ తన ప్రెగ్నెన్సీని బైబిల్‌తో పోల్చడం సరికాదు అని ఆయన చెప్పుకొచ్చారు.
(ఇదీ చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. ఇదెక్కడి క్రేజ్ రా మావ)
Comments
Please login to add a commentAdd a comment