చెన్నై : ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ప్రముఖ నటి జ్యోతిక చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆలయాల తరహాలోనే ఆసుపత్రులు, పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న జ్యోతిక వ్యాఖ్యలపై పలువురు హిందూవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్యలపై జ్యోతిక క్షమాపణ చెప్పాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జ్యోతిక చేసిన వ్యాఖ్యలను ఆమె భర్త, ప్రముఖ హీరో సూర్య సమర్థించారు. తమ కుటుంబం జ్యోతిక అభిప్రాయానికి మద్దతుగా నిలుస్తుందన్నారు. జ్యోతిక ఆలోచనను చాలా మంది స్వాగతిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి సూర్య సోషల్ మీడియాలో ఓ లేఖను విడుదల చేశారు. ద్వేషాన్ని కాదని.. ప్రేమను పంచాలని ఆయన కోరారు.
‘చెట్లు ప్రశాంతగా ఉన్నప్పటికీ.. గాలి వాటిని అలాగే ఉండనివ్వదు. ఓ అవార్డు ఫంక్షన్‌లో నా భార్య చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే తీవ్ర చర్చకు దారితీసింది. దేవాలయాలకు విరాళాలు ఇచ్చిన మాదిరిగానే.. పాఠశాలలకు, హాస్పిటల్స్‌కు కూడా విరాళాలు ఇవ్వాలనేదే ఆమె అభిప్రాయం. కానీ ఓ వర్గం ప్రజలు దీనిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదు. స్వామి వివేకానంద సహా ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు.. మతం కన్నా మానవత్వం గొప్పదని చెప్పారు. నేను ఇదే విషయాన్ని నా పిల్లలకు కూడా చెబుతాను. ఆధ్యాత్మికవేత్తల భోదన నుంచి పొందిన ప్రేరణతో జ్యోతిక చేసిన వ్యాఖ్యలకు మా కుంటుంబం మద్దతుగా నిలుస్తోంది. ఆమె ప్రసంగంలోని సారాంశాన్ని అర్థం చేసుకున్న చాలా మంది ఈ సమయాల్లో కూడా మద్దతుగా నిలిచారు. వారందరి నా కృతజ్ఞతలు’ అని సూర్య పేర్కొన్నారు.
సినిమాల విషయానికి వస్తే.. సూర్యతో పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న జ్యోతిక.. ఇటీవలి కాలంలో నటనుకు ప్రాధాన్యమున్న పాత్రల్లో, లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లో విడుదల కానుంది.
#அன்பைவிதைப்போம் #SpreadLove pic.twitter.com/qjOlh8tHtV
— Suriya Sivakumar (@Suriya_offl) April 28, 2020
చదవండి : ఓటీటీకే ఓటు
Comments
Please login to add a commentAdd a comment