నా కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేది: సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | Tamil actor Suriya spoke about his initial days of struggle in the industry | Sakshi
Sakshi News home page

Suriya: నాకు దాదాపు ఐదేళ్లు పట్టింది.. జ్యోతిక మాత్రం అప్పటికే: సూర్య

Published Sun, Nov 10 2024 4:18 PM | Last Updated on Sun, Nov 10 2024 4:42 PM

Tamil actor Suriya spoke about his initial days of struggle in the industry

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఓ తెగకు చెందిన గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

అయితే ప్రస్తుతం ముంబయిలో ఉంటున్న సూర్య తన భార్య జ్యోతిక గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాకుండా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితులపై  కూడా మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సూర్య.. తనకంటే జ్యోతికనే పెద్ద స్టార్‌ అని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. నేను ఆమెను కలిసే సమయానికి నాకంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదించేదని వెల్లడించారు. హిందీలో డోలీ సజా కే రఖ్నా మూవీ తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి నటించిందని తెలిపారు. తన రెండో చిత్రం కూడా నాతో చేసిందని.. ఆ తర్వాత మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యామని సూర్య అన్నారు.

సూర్య మాట్లాడుతూ..' నారు తమిళ చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ అప్పటికే జ్యోతిక సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌గా పేరు సంపాదించుకుంది. నేను హీరోగా ఎదిగేందుకు దాదాపు ఐదేళ్లు పట్టింది. అప్పటికే తన జీతం నా కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నానో గ్రహించా. కానీ తను నా జీవితంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంది. మా ప్రేమను తన తల్లిదండ్రులు కూడా అంగీకరించారు" అని అన్నారు.

ముంబైలో జ్యోతిక, సూర్య

కాగా.. జ్యోతిక, సూర్య ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. తమ పిల్లల చదువుల కోసమే షిఫ్ట్ అయినట్లు చాలాసార్లు వెల్లడించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత చెన్నై నుంచి ముంబయికి మారినట్లు సూర్య అన్నారు. ప్రస్తుతం జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని..తన తల్లిదండ్రులకు కూడా సమయం కేటాయించినట్లు ఉంటుందని సూర్య తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement