విమర్శలు, వివాదాలు, కేసుల మధ్య మహా చిత్రం ఒక ఘట్టాన్ని దాటింది. నటి హన్సిక నటిస్తున్న తాజా చిత్రం మహా. ఇది ఈ అమ్మడి 50వ చిత్రం అన్న విషయం తెలిసిందే. ఎక్స్‌ట్రా ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై వి. మదియళగన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మహ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదలై ఎలాంటి వివాదాలకు దారితీస్తుందో తెలిసిందే. హన్సిక కాషాయ వాస్త్రాలు ధరించి, నోటీ నిండా పొగతో చేతిలో సిగరెట్‌తో కాశీ పట్టణం తీరంలో సింహాసనంలో దర్జాగా కూర్చున్న దృశ్యంపై తీవ్ర దుమారం రేపింది.
ఇవన్నీ అసలు పట్టనట్లు ఆ చిత్ర నిర్మాత వి.మదియళగన్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేస్తూ, మాగ్నెటింగ్, అలూరింగ్, హిడ్డన్, అగ్రెస్సీవ్ వంటివి మహా చిత్రంలో ఇంకా చాలా ఉంటాయని పేర్కొన్నారు. ఈ చిత్రం మొత్తం తమిళ చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందన్నారు. సాధారణంగా నిర్మాతలు స్టార్ తారాగణాన్ని, ప్రముఖ దర్శకులను, ప్రముఖ సాంకేతిక నిపుణులను తమ చిత్రాల్లో ఉండాలని కోరుకుంటారన్నారు. తనకు మాత్రం ప్రణాళిక ప్రకారం, నిబద్ధతతో పనిచేసే చిత్ర టీమ్ లభించడం ఆనందంగా ఉందన్నారు.
మహా చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ సంతృప్తిగా పూర్తి చేశారని చెప్పారు. అందుకు నటి హన్సిక, దర్శకుడు జలీల్, ఛాయాగ్రాహకుడు లక్ష్మణ్ ఇలా అందరి సహకారం చాలా సంతోషాన్నికలిగిస్తోందని అన్నారు. ఈయన నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న కొలైయుధీర్ కాలం, అరుణ్ విజయ్ హీరోగా బాక్సర్ చిత్రాలను నిర్మిస్తున్నారు. వీటిలో నయనతార నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment