కంగనా సోదరి రంగోలి బాలీవుడ్ పద్మావత్ దీపికా పదుకొనేపై ట్విటర్ వేదికగా విమర్శలు కురిపించారు. డిప్రెషన్‌ని దీపిక పబ్లిసిటీ కోసం వాడుకుంటుందని రంగోలి ఆరోపించారు. ఇంతకు విషయం ఏంటంటే.. 2015 సంవత్సరంలో తాను విపరీతమైన డిప్రెషన్‌కు గురయ్యానని దీపిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కుటుంబ సభ్యుల ఓదార్పు, వైద్యం తనను మామూలు మనిషిని చేశాయని చెప్పింది. తనలాగే డిప్రెషన్‌తో బాధపడేవారి కోసం లీవ్ లవ్ లాఫ్ అనే సంస్థను స్థాపించి.. డిప్రెషన్ పట్ల అవగాహన కలిగిస్తున్నారు దీపిక.
అయితే ఈ విషయాల గురించి దీపిక తొలిసారి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను ఇప్పటి వరకూ యూట్యూబ్‌లో పది లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా దీపిక, లీవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌తో కలిసి డ్యాన్స్ చేస్తోన్న వీడియోను ఆ సంస్థ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై కంగనా సోదరి రంగోలి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా.. డిప్రెషన్ పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రంగోలి.
Yeh kya ho raha hai? Yeh depression hota hai, yeh woh log hain jinko word Mental se problem thi, magar depression vidoes pe baration ki tarah nach rahe hain, kya ghatiya wahiyat tarika hai depression ke naam pe publicity lene ka .. @TLLLFoundation 🤦🏻♀️ https://t.co/b5BDazQkTk
— Rangoli Chandel (@Rangoli_A) July 5, 2019
Comments
Please login to add a commentAdd a comment