ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ డిప్రెషన్‌కి లోనై, ఆ తర్వాత సరైన చికిత్సతో తిరిగి కోలుకున్న సంగతి తెలిసిందే. తన జీవితంలోని అప్పటి రోజులను దీపికా పదుకోన్ అప్పుడప్పుడూ గుర్తు చేసుకుంటుంటారు. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీపిక తన డిప్రెషన్ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ‘‘నటిగా నా కెరీర్ చాలా బాగుండేది. కానీ నాకెందుకో బాధగా ఉండేది. ఆ బాధకు కారణం తెలిసేది కాదు. కానీ ఏడుపొచ్చేది. దాంతో నిద్రపోవాలనుకునేదాన్ని. ఎందుకంటే బాధ నుంచి తప్పించుకో డానికి నిద్ర ఒక మార్గం అనిపించేది.
ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా నన్ను వేధించాయి. మా అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు నన్ను చూసేందుకు ముంబై వచ్చేవారు. వారు వచ్చినప్పుడల్లా నేను వారి ముందు ఉత్సాహంగా ఉండేదాన్ని. ఓసారి మాత్రం ఉన్నట్లుండి మా అమ్మ దగ్గర బయటపడిపోయాను. ‘వృత్తిపరమైన సమస్యలా?’, ‘బాయ్‌ఫ్రెండ్ విషయంలో ఏవైనా ఇబ్బందులా? అని మా అమ్మ ఆందోళనగా అడిగారు. ఏం చెప్పాలో నాకు తెలియలేదు. ఎందుకంటే అవేవీ నా బాధకు కారణాలు కాదు. నాలో తెలియని శూన్యత ఏర్పడిందని మా అమ్మ అర్థం చేసుకుని, డిప్రెషన్ నుంచి నేను బయటపడేలా చేశారు. ఆ సమయంలో ఆ దేవుడే మా అమ్మను నా వద్దకు పంపాడా అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment