సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ కుటుంబం నుంచి ఇప్పుడు మరో హీరో తెరపైకి వస్తున్నారు. ఏఎల్ అళగప్పన్ కుమారులిద్దరూ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే! విజయ్ దర్శకుడిగా, ఉదయ్ నటుడిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన మనవడు(కూతురి కుమారుడు) అమరేష్ 'రంగోలి' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'మా నగరం'లో బాలనటుడిగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ చదువును కొనసాగిస్తున్న అమరేష్ ఇప్పుడు రంగోలి చిత్రం ద్వారా హీరో అవతారం ఎత్తారు. ప్రార్థన కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని గోపురం స్టూడియోస్ పతాకంపై కె.బాబురెడ్డి, జి సతీష్‌కుమార్ నిర్మించారు. వాలి మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరుద నాయకం ఛాయాగ్రహణం, కేఎస్ సుందరమూర్తి సంగీతాన్ని అందించారు.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్‌లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. దర్శకుడు కే భాగ్యరాజ్, ఆర్వీ ఉదయ్‌కుమార్ పాల్గొని ఆడియో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ అలగప్పన్ కుటుంబసభ్యులందరూ పాల్గొనడం విశేషం. పాఠశాల విద్యార్థుల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు వాలి మోహన్‌దాస్ చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారని దర్శకుడు కే.భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్, ఏఎల్ విజయ్ ప్రశంసించారు. చిత్రం మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
చదవండి: Trisha : 40 ఏళ్ల వయసులో పెళ్లిపై దృష్టి పెట్టిన త్రిష..
Comments
Please login to add a commentAdd a comment