న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చందేల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజ్ మహల్‌పై రంగోలి చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. తాజ్ మహల్ కేవలం సమాధి మాత్రమేనని.. అది ఎప్పటికీ ‘ప్రేమ చిహ్నం’ కాదంటూ రంగోలి బుధవారం ట్వీట్ చేశారు. ‘తాజ్ మహల్‌ను చాలా మంది సమాధిగానే పరిగణిస్తారు. అయితే దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతేగాక ముంతాజ్ బేగం గురించి కూడా ట్వీట్‌లో ప్రస్తావించారు. ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయని, ఆమెను షాజాహాన్ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (ఫోర్బ్స్‌పై కంగన సోదరి ఫైర్)
Mr @rajcheerfull ji not every Indian is proud of Taj Mahal, a grave can never be a symbol of love, we are forced to accept it as a wonder but it’s creepy as hell especially when we know how she suffered in her lifetime how the artists who made it were tortured it’s creepy ... https://t.co/1V2waXDkbL
— Rangoli Chandel (@Rangoli_A) April 7, 2020
ఇక రంగోలీ ట్వీట్ చూసిన నెటిజన్లు ‘తాజ్ మహల్‌ను ప్రేమకు చిహ్నంగా అంగీకరించాలని మిమల్ని ఎవరూ కోరడం లేదు’ ‘మీ అభిప్రాయం మాకు అవసరం లేదు, ‘ఇది ప్రపంచలోని వింత అని చరిత్రే చెబుతుంది ఇక మీ అభిప్రాయం ఎవరికి కావాలి’ అంటూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తాజ్ మహల్ ప్రపంచంలోనే 7వ వింతగ పరిగణించబడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రేమకు చిహ్నంగా భావిస్తు ప్రేమికులు సైతం తాజ్ మహాల్ బొమ్మలను బహుమతులుగా ఇచ్చుకుంటుంటారు. అంతేగాక దేశ ప్రజలంతా దీనిని చూసి గర్వపడుతుంటారు కూడా. కాగా రంగోలి ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవడం ఇది మొదటిసారి కాదు. తరచూ ఎన్నో విషయాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తూ విమర్శలను ఎదుర్కొంటారు.
Comments
Please login to add a commentAdd a comment