throwing
-
ముగ్గు ఇలా కూడా పెట్టొచ్చా..! జస్ట్ కలర్స్‌తో..
సంక్రాంతి వచ్చిదంటే గుమ్మాలన్నీ రంగవల్లుల(Rangoli)తో కళకళలాడిపోతుంటాయి. వివిధ రకాల డిజైన్లతో కలర్ఫుల్గా తీర్చిదిద్దుతారు. ఈ పండుగలో ముగ్గులతో హడవిడి, సంబరమే కనిపిస్తుంది. పడుచులంతా చేరి అద్భుతమైన తన కళా నైపుణ్యాన్ని రంగరించిం మరీ తీర్చిదిద్దే పనిలో పడతారు. ఇంత కష్టపడి పెట్టిన ముగ్గు తొక్కకూడదని మగువలు పడే ప్రయాస అంతా ఇంతా కాదు.అయితే కొందరూ బియ్యపిండి, రాతిపిండితోనూ పెడతారు. చక్కగా ముగ్గుని తీర్చిదిద్దాక కలర్స్ వేసి మళ్లీ పై కోటింగ్‌లా ముగ్గు వేస్తారు. కానీ ఇక్కడొకామె పెట్టిన ముగ్గు చేస్తే నోటి మాట రాదు. అబ్బా చూస్తుండగానే ఎంత ఈజీగా పెట్టేసింది అనుకుంటారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె పెట్టిన ముగ్గు విధానం శతాబ్దల కాలం నాటిది. ఇది వరకు అంతా మట్టి ఇళ్లే ఉండేవి. వాటిని చక్కగా పెడతో అలికి ముగ్గులు పెట్టేవారు. అప్పుడు సున్నంతో ఇంటి చుట్టు గోడలకి అందమైన ముగ్గులను చేతితో భలే జిమ్మే వారు. అవి ఓ మోస్తారు ఆకారంలో సెట్ అయ్యి చూడటానికి భలే అందంగా కనిపించేవి. ఆ విధానంలోనే ఈ మహిళ ముగ్గుపెట్టింది.కాకపోతే దానికి కాస్త ఆధునిక విదానాన్ని జోడించింది. ఆ వీడియోలో మొదట మహిళ ఇంటి గుమ్మ ముందు పెట్టదలచుకున్న కలర్లన్నీ తీసుకుంది. ముందుగా ఓ పెద్ద రౌండ్లో ముగ్గు పొడి పెట్టింది. ఆ తర్వాత లయబద్ధంగా రకరకలా రంగులను ముగ్గు పొడి ఉన్న గుండ్ర భాగానికి నలువైపులా చక్కగా వీటిని సెట్ చేసింది.అంతే నాలుగు భాగాలుగా చేసి ఒక్కోదాన్ని ఒక్కోలా.. ఆకృతిలోకి వాటన్నిటిని నేలపై విరజిమ్మింది అది నెమలీ రెక్కలను విచ్చినట్లుగా చక్కగా రంగులు పరుచుకున్నాయి. అంతే ఆతర్వాత వాటి మధ్యలో ముగ్గుతో కొద్దిపాటి డిజైన్ వేసింది. చూస్తే వాటే ముగ్గు..ఏం పెట్టారబ్బా..అని అనకుండా ఉండలేరు.இந்த பெண்ணின் திறமையை பாருங்க .👌🏻 pic.twitter.com/jCB8vzr1By— Narasimman🇮🇳🕉️🚩 (@Narasim18037507) January 3, 2025 (చదవండి: చలికాలం తప్పక తీసుకోవాల్సిన సూప్ ..!) -
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం.. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
కర్ణాటక: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నుంచి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్స్‌కు గురయ్యారు. డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమానీపై పేపర్లు చించి విసిరిన అనంతరం.. ఎమ్మెల్యేలను సస్పండ్ చేస్తున్నట్లు ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసెంబ్లీలో బుధవారం సెషన్ గందరగోళం నెలకొంది. అయితే.. నేడు స్పీకర్ యూటీ ఖాదర్ లేకపోవడంతో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాని సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించారు. రోజూలాగే బుధవారం సభ ప్రారంభమైంది. 2024 ఎన్నికలకు ముందు 30 మంది ఐఏఎస్ అధికారులను బదీలీ చేయడంపై బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) (జేడీ(ఎస్)) ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అంశంపై సభలో చర్చలు తీవ్ర స్థాయికి చేరాయి. విరామ సమయం కూడా లేకుండానే చర్చలు కొనసాగించాలని డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైనవారు లంచ్‌కు వెళ్లి మళ్లీ చర్చకు రావాలని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. లంచ్ బ్రేక్ తీసివేయడంపై ఎమ్మెల్యేలు ఫైరయ్యారు. పేపర్లను చించి డిప్యూటీ స్పీకర్‌పై విసిరారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా.. బౌన్సర్లు అడ్డుకున్నారు. ఈ పరిణామాల అనంతరం 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పండ్ చేశారు. ఇదీ చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్‌ను కలిసిన ఉద్ధవ్ -
ఖననం.. మానవత్వం హననం
సాక్షి, బళ్లారి: కరోనా వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలు అప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉండగా మరింత క్షోభించేలా అధికార సిబ్బంది వ్యవహరించారు. కరోనా బాధితుల మృతదేహాలను పెద్ద గొయ్యి తీసి అందులో విసిరివేయడం అందరినీ నివ్వెరపరచింది. బళ్లారిలో సోమవారం జరిగిన ఘటన వీడియోలు మంగళవారం వెలుగులోకి రావడంతో జిల్లా యంత్రాంగం నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బళ్లారిలోని విమ్స్ కోవిడ్ విభాగంలో కోవిడ్‌కు చికిత్స పొందుతూ బళ్లారికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, సిరుగుప్పకు చెందిన 31 ఏళ్ల యువకుడు, కొప్పళ జిల్లాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోనికి చెందిన ఇద్దరు (41, 52ఏళ్లు) వ్యక్తులు, చిత్రదుర్గంకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడు, శ్రీరంగాపురం క్యాంప్‌కు చెందిన 43 ఏళ్ల వ్యక్తి, హŸసపేటకు చెందిన ఇద్దరు కన్నుమూశారు. తొమ్మిది మంది మరణాలతో ఆస్పత్రి ప్రాంగణంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. కరోనా మృతుల అంత్యక్రియలను వైద్య సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించాల్సి ఉన్నందున అంబులెన్సుల్లో నల్లరంగు బ్యాగ్‌లలో చుట్టి శ్మశానానికి తీసుకెళ్లారు. విడిగా సమాధి చేయకుండా పొక్లెయినర్‌తో పెద్ద గొయ్యిని తీసి అన్నిటినీ గొయ్యిలో విసిరేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను సస్పెండ్ చేసినట్లు మంత్రి శ్రీరాములు చెప్పారు. -
వృధా పదార్థాలు పడేయడంపై బ్యాన్
పారేసేది వాడెయ్యమన్నది నానుడి.. అంటే మనకు పనికి రానిది మరొకరికి ఉపయోగపడేలా చేయాలని అర్థం. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో ఇది వర్తిస్తుంది. వృధాగా పోయే పదార్థాలను ఆపన్నులకు అందించాలన్న సూత్రం ఈ సందర్భంలో వెల్లడవుతుంది. పేదవారికి ప్రత్యేకంగా సహాయం అందించలేక పోయినా.. ఇటువంటి నియమాలను పాటించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే ఆహార పదార్థాలు వృధా చేయడంపై కొన్ని దేశాల్లో కఠినమైన చట్టాలు అమలవుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలోని అమ్ముడుపోని పదార్థాలను చెత్తబుట్టల్లోకి విసిరేయడంపై నిషేధం విధించారు. ఫ్రాన్స్ లో సూపర్ మార్కెట్లలో అమ్ముడుపోకుండా మిగిలిపోయిన సరుకులను చెత్తబుట్టలకు తరలిస్తుంటారు. ఇటువంటి పోకడలకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టేందుకు కఠిన చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. వస్తువులను వృధాగా పారేసేవారికి పరిమాణాన్ని బట్టి ఫైన్ వేసేందుకు నిర్ణయించింది. అంతేకాదు ఒక్కోసారి అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి జైలు శిక్ష కూడ విధిస్తున్నారు. ముఖ్యంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎక్స్ పైరీ డేటుకు ముందే అనాధ శరణాలయాలకు, ఫుడ్ బ్యాంక్ లకు ఇచ్చేయాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీలో బిల్లు కూడ పాస్ చేశారు. ఫ్రాన్స్ లో ప్రతియేటా 7.1 మిలియన్ టన్నుల ఆహారం వేస్ట్ అవుతుండటం కూడా ఈ బిల్లు అమల్లోకి రావడానికి కారణంగా చెప్పాలి. ముఖ్యంగా ఈ వృధా చేస్తున్న పదార్థాల్లో అమ్మకందార్లు 11 శాతం వృధా చేస్తుంటే... కొని పారేసే వారు 67 శాతం, రెస్టారెంట్ల లో తినకుండా వదిలేసేవారు 15 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అటువంటివారికి భారీ జరిమానా విధించేందుకు ఈ కఠిన చట్టాన్నిఅమలుపరుస్తోంది. ప్రపంచంలో ఎంతోమంది తిండి లేక నానా ఇక్కట్లూ పడుతున్నారు. మరోపక్క అవసరానికి మించి ఆహారం కొనుగోలు చేసి వృధా చేసేవారూ అధికంగానే ఉన్నారు. దీన్ని అరికట్టాలన్నదే ఫ్రాన్స్ ప్రభుత్వ లక్ష్యం. అందుకే అక్కర్లేని పదార్థాలను సేవా సంస్థలు, ఆహార బ్యాంకులకు దానం చేయమని సూచిస్తోంది. పారిస్ కు దగ్గరలోని కౌర్బివాయి కౌన్సిలర్... ఆరాష్ దెరాంబర్ష్ ప్రవేశ పెట్టిన పిటిషన్ ను ఫ్రెంచ్ సెనేట్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 400 స్క్వేర్ మీటర్లు, అంతకు మించి ఉన్న సూపర్ మార్కెట్లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం 3750 యూరోల జరిమానా విధిస్తుంది. ఆహార పదార్థాల వృధాను అరికట్టేందుకు ఇదే చట్టాన్ని ఇప్పుడు యూరప్ లోని అన్ని సూపర్ మార్కెట్లకు వ్యాప్తి చేసేందుకు ఆరాష్ దెరాంబర్ష్ కృషి చేస్తున్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగదని, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాంటీన్లలోని ఆహారం... వృధా కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అంటున్నారు.