'టెక్'కు బానిసలుగా టీనేజర్లు
టీనేజ్ పిల్లలు చెడు తిరుగుళ్లుతో పాటు, మద్యానికి ఎక్కడ బానిసలవుతున్నారో అని తల్లిదండ్రులు తెగ బాధపడేవారు. అయితే ఇప్పుడు 60శాతానికి పైగా టీనేజర్లు ... స్మార్ట్ ఫోన్లకు, మొబైల్ డివైజ్ లకు ఎక్కువగా అతుకుపోతున్నారట. టెక్ బానిసలుగా మారుతున్న తమ పిల్లలను తీరుపై తల్లిదండ్రులు బాధపడినట్టు ఓ సర్వేలో తేలింది. యుక్త వయస్కులైన తమ పిల్లలు టెక్ కు ఫుల్ గా బానిసలవుతున్నారని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేసినట్టు ఆ సర్వే తెలిపింది. పిల్లలు టెక్నాలజీని ఎలా వాడుతున్నారో తెలుసుకోవడం కోసం 1,200 మంది టీనేజర్లు, తల్లిదండ్రులపై కామన్ సెన్స్ మీడియా సర్వే చేపట్టింది.
సర్వేలో తేలిన కీలక అంశాలు...
- 59 శాతం మంది తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు మొబైల్ ఫోన్లకు, టాబ్లెట్స్ కు ఎక్కువగా బానిసలవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తంచేశారు.
- 50 శాతం మంది టీనేజీ పిల్లలు మొబైల్ ఫోన్లపై ఎక్కువ సమయాన్ని గడుపుతున్నట్టు చెప్పారు.
- 27 శాతం మంది తల్లిదండ్రులు వారే ఎక్కువగా మొబైల్ డివైజ్ లకు బానిసలైన్నట్టు ఒప్పుకున్నారు.
- 28 శాతం మంది టీనేజీ పిల్లలు వారి తల్లిదండ్రులు మొబైల్ ఎక్కువగా వాడుతారని పేర్కొన్నారు.
- 66 శాతం తల్లిదండ్రులు వారి టీనేజి పిల్లలు చాలా ఎక్కువ సమయాన్ని మొబైల్ డివైజ్ లపైనే గడుపుతున్నారని బాధపడ్డారు.
- 66 శాతం మంది తల్లిదండ్రులు డిన్నర్ సమయంలో మొబైల్ డివైజ్ లను అనుమతిచడం లేదని చెప్పారు.
- 56 శాతం మంది తల్లిదండ్రులు ,51 శాతం టీనేజీలు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ డివైజ్ ను చూస్తున్నట్టు ఒప్పుకున్నారు.
- 85 శాతం మంది తల్లిదండ్రులు మొబైల్ డివైజ్ ల వల్ల తమ పిల్లలతో ఉన్న అనుబంధాలకు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు.
-
89 శాతం మంది టీనేజీ పిల్లలు కూడా ఇదే భావనను వ్యక్తంచేశారు.