
సాక్షి, అనంతపురం: ఆన్‌లైన్ గేమ్ పబ్‌జీ అంటే యువతతో సహా పిల్లలకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆ గేమ్‌కి బానిసగా మారి ప్రాణలు మీదకు తెచ్చుకుట్టుంటే మరి కొందరు ప్రాణాలే పోగుట్టుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ ఆడుతూ ఓ బాలుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బారాయుడు 8 వతరగతి విద్యార్థి చదువుతున్నాడు.
గత కొంత కాలంగా అతను ఈ ఆటను ఆడటం ప్రారంభించాడు. అయితే మూడు నెలలుగా పబ్ జీ ఆట వ్యసనంగా మారి అదే పనిగా ఆడటంతో బాలుడు తల్లిదండ్రులను గుర్తించ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం బాలుడి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment