అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది.
అలవాట్లు మనిషిని పట్టిస్తాయి. అంతే కాదు బంధిస్తాయి, బానిసని కూడా చేస్తాయి. అలవాటుకి ప్రయత్నం అవసరం లేదు. అలవాటు రెండవ స్వభావం అని చెప్పవచ్చు. స్వభావం లాగానే అలవాటుని కూడా అధిగమించటం చాలా కష్టం. అది ఎంతగా వంటపట్టిపోతుందంటే దాన్ని విడిగా గుర్తించటం కూడా కుదరదు. నిజానికి అది పుట్టుకతో వచ్చింది కాదు. తరవాత పెంపొందించుకున్నది.
పెరిగిన భౌగోళిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ, పరిస్థితులు, వాతావరణం, మనుషులు, మత విశ్వాసాలు మొదలైన ఎన్నో అంశాలు ఒక అలవాటు ప్రబలటానికి దోహదం చేస్తాయి. అవే పరిస్థితుల్లో ఉన్న మరొక వ్యక్తికి అది కాక మరొక అలవాటు ఉండవచ్చు. దీనికి వ్యక్తి స్వభావం కారణం అవుతుంది. అంటే, వ్యక్తి సహజ స్వభావం, పరిస్థితుల ప్రభావాల సమాహారంగా అలవాట్లు ఏర్పడుతాయి.
ఆ అలవాటు తెచ్చి పెట్టుకున్నది అని గుర్తించటం ఉండదు. అది సహజ లక్షణం అనే భ్రమలో ఆ వ్యక్తి మాత్రమే కాదు, చుట్టుపక్కల వారు కూడా ఉంటారు. అలవాటు ఎట్లా ఏర్పడిందో గుర్తించటం చాలా కష్టం. దానిని మానుకోటం మాత్రం కష్టం. ముందు అది మంచిది కాదు అని గుర్తించాలి, తరవాత మానాలి అనే సంకల్పం ఉండాలి. ఆ పైన ప్రయత్నం చేయాలి. మొదటిదే చాలా కష్టం. ఎందుకంటే మనిషికి తనని తాను సమర్థించుకోటం అన్నది సహజంగా ఉంటుంది. అలవాటై పోయంది అనటం అలవాటుగా మారింది.
ఇంతకీ అలవాటు అంటే? అల+వాటు = అలవాటు. అంటే, సముద్రంలో అల ఎంత సహజంగా పైకి ఎగసి, అంతే వేగంగా ఎటువంటి ప్రయత్నం, శ్రమ లేకుండా పడుతుందో అంత తేలికగా హాయిగా జరిగిపోయేది. దానిని ప్రత్యేకంగా గుర్తించటం కూడా ఉండదు. అలవాటు అన్నది ఎంత బలంగా ఉంటుందంటే దానిని మానటం చాలా కష్టం. బలవంతంగా మానే వాతావరణం కల్పిస్తే గిజగిజ లాడిపోతారు. అందులోనూ దురలవాట్లు అయితే మరీనూ. పిచ్చిగా ప్రవర్తించటం, అవతలి వారికి పిచ్చెక్కేట్టు ప్రవర్తించటం లేదా ఆత్మహత్యలకి ΄పాల్పడటం చూస్తూనే ఉన్నాం.
అదే మంచి అలవాటు అయితే ఇబ్బంది పడతారు కాని, ఉన్న పరిస్థితుల్లోనే సద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాని, గిజగిజలాడరు. ఉదాహరణకి రోజూ ఒక సమయానికి ధ్యానమో, పూజో చేసుకునే అలవాటు ఉన్నవారు ఎప్పటిలాగా వీలుకాకపోతే ఉన్నంతలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా తమ పని పూర్తి చేసుకుంటారు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఎక్కడ ఉన్నా, ఎంత మంది మధ్య ఉన్నా, ఇతరులని ఇబ్బంది పెట్టకుండా పుస్తకం పట్టుకుని కూర్చొంటారు. కొంతమంది త్వరగా దేనినైనా అలవాటు చేసుకుంటారు. వీరి అలవాట్లని మార్చటం అంత కష్టం కాదు. కొత్త అలవాట్లని తేలికగా చేసుకోగలరు కనుక మంచివి అలవాటు చేస్తే సరి! కొంతమందికి ఏది అలవాటు కావటం అన్నదే ఉండదు. వీళ్ళతో ప్రమాదం ఏమంటే మంచివి, పనికి వచ్చే అలవాట్లు కూడా ఉండవు.
మనిషి జీవితం చాలావరకు అలవాటుగా సాగుతుంది. కొంతమందిని ఈ విధంగా ఎట్లా బతుకుతున్నావు? అని అడిగితే అలవాటయి పోయింది అంటారు. చిన్నప్పటినుంచి ఏది అలవాటు చేస్తే అదే అలవడుతుంది. రుచులు కూడా అలవాటు వల్లనే కలుగుతాయట! చిన్నతనం నుండి కారం తినటం అభ్యాసం చేస్తే అదే అలవాటు అవుతుంది. ఎప్పుడు తినని వారికి నోరు మంట పుడుతుంది. ఒక్కొక్కప్రాతం వారు ఒక్కొక్క ఆహారాన్నీ ఇష్టపడటానికి కారణం ఇదే. అభిరుచులు కూడా అంతే! సాధారణంగా చేదు ఇష్టం ఉండదు ఎవరికీ. కాని నెమ్మదిగా అలవాటు చేసుకుని వదల లేని స్థితికి వచ్చింది సమాజం. కాఫీ, టీ, శీతల పానీయాలు ఇత్యాదులు. మొదటిసారి గొంతు దిగవు. ఆ తరువాత వదలవు. ధూమపానం, మద్యపానం సంగతి సరే సరి.
– డా.ఎన్. అనంత లక్ష్మి
(చదవండి: పుట్టలో పాలు పోయటంలో అంతరార్థం? ఆ 12 నాగులనే పూజిస్తారు ఎందుకు?)
Comments
Please login to add a commentAdd a comment