గత మూడు వారాలుగా మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ జలుబు- దగ్గు ఆగకుండా వస్తోందా? ఒక వేళ తగ్గినా మళ్ళీ తిరగపెడుతోందా..? భయపడకండి. ఇది కరోనా కాదు. ఇప్పుడు లక్షలాది మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. మరో వారం పది రోజుల్లో సమస్య దానంత అదే పరిష్కారమైపోతుంది. ఎందుకిలా..?
రెండు రకాలు:
►ఎలర్జీలు
►శక్తివంతమయిన బాక్టీరియా వైరస్‌లు.
గమనించారా ? ఒక రోజు విపరీతమయిన చలి. పొగ మంచు. ఉన్నట్టుండి ఇంకో రోజు ఫ్యాన్ వేసుకోకపోతే నిద్రపట్టనంత ఉక్కపోత. వాతావరణంలో విపరీత మార్పులు. పొగ మంచు. దీనికి తోడు వాతావరణ కాలుష్యం. ఫాగ్.. స్మోక్.. రెండూ కలిసి స్మోగ్.
దీనివల్ల చాలా మందిలో ఎలర్జీ లు వస్తున్నాయి. జలుబు అయితే తుమ్ములు నెమ్మదిగా వస్తాయి. అదే ఎలర్జీ అయితే ఒక్కో సారి ఆగకుండా వస్తాయి. ఎలర్జీ కి మందు లేదు. బయట మంచు ఉన్నా బెడ్ రూమ్ లో ఉన్న మీకు పచక్ పచక్ అని తుమ్ములొస్తున్నాయా ? అయితే ఎలర్జీ. జస్ట్ రిలాక్స్. మరో వారం లో వాతావరణం సెట్ అయిపోతుంది. అప్పుడు పోతుంది. కాకపోతే ప్రతి వింటర్ లో మీకు ఈ బాధ తప్పదు. వీలైనంతవరకు మంచు అదే స్మోగ్ లో బయటకు పోవద్దు. ఎండ వచ్చి పొగ మంచు తగ్గాక బయటకు వెళ్ళండి. కర్టైన్స్ తో కిటికీలు మూసి ఉంచండి.
ఇక రెండో ది మొండి వైరస్ బాక్టీరియాలు. నిజానికి అవి మొండి కావు. అవి వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం.. బయట + మీ శరీరం లోపల.. రెండు చోట్లా !
బయటేమో స్మోగ్. లోపల మీ ఇమ్మ్యూనిటి వీక్. రెండేళ్లుగా మాస్క్‌లు వేసుకొని మీ ఇమ్మ్యూనిటీని బజ్జో పెట్టేశారు. తక్కువ మొత్తంలో వైరస్‌లు బాక్టీరియాలు సోకాలి. ఇమ్యూనిటీ కణాలు వాటిని చంపాలి. అదే దానికి బాటింగ్ ప్రాక్టీస్. రెండేళ్లు నెట్ ప్రాక్టీస్ లేకుండా బాట్స్‌మన్ పిచ్‌పైకి దిగితే ? ఇంకేముంది..? బాతే. అదే డక్ అవుట్. ఇప్పుడు అదే జరుగుతోంది. పోనీ లెండి. ఇప్పుడైనా బాటింగ్ ప్రాక్టీస్ అవుతోంది.
ఇలా చేయండి.
►దగ్గుమందు తాగొద్దు. దాని వల్ల నష్టం తప్ప లాభం ఉండదు.
►వేడి నీరు తాగాలి. పురుషులు నాలుగు లీటర్‌లు. స్రీలు మూడు. పిల్లలు వయసు బట్టి ఒకటి నుంచి రేండు లీటర్ లు. వేడి నీటిలో ఉప్పు వేసుకొని నోట్లో పోసుకొని గార్గిల్ చేయాలి.
►అవసరం అయితే అల్లం పసుపు కాషాయం చేసి తాగండి. జస్ట్ టీ కప్పులో కొద్దిగా. రోజుకు ఒక సారి. మూడు నాలుగు రోజులు మాత్రం.
►శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. బాగా నిద్ర పోవాలి. స్ట్రెస్ కి దూరంగా ఉండాలి.
-వాసిరెడ్డి అమర్‌నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు
Comments
Please login to add a commentAdd a comment