హమాస్ బలగాలను అంతం చేయటమే లక్ష్యంగా.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఓ భారతీయ వ్యక్తి మృతి చెందినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి.
ఆ వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ హాస్పటల్‌కు వెళ్తుతున్న క్రమంలో ఒక్కసారిగా జరిగిన దాడిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుతో ఉన్న మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఇక.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఐక్యరాజ్య సమితికి చెందిన తొలి వ్యక్తి మరణంగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
మరణించిన వ్యక్తి ఐక్యరాజ్య సమితిలోని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగానికి( DSS) చెందిన భారతీయ వ్యక్తిగా తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి భారత దేశానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడని సమాచారం.
Today a @UN vehicle was struck in Gaza, killing one of our colleagues & injuring another.
More than 190 UN staff have been killed in Gaza.
Humanitarian workers must be protected.
I condemn all attacks on UN personnel and reiterate my urgent appeal for an immediate humanitarian…— António Guterres (@antonioguterres) May 13, 2024
‘‘ఐక్యరాజ్య సమితి చెందిన డీఎస్‌ఎస్ విభాగంలోని సభ్యుడు మరణించటం చాలా బాధాకరం. ఈ ఘటనలో మరో సభ్యుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. రఫాలోని యూరోపియన్ ఆస్పత్రికి తమ వాహనంలో వెళ్తున్న క్రమంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది’’ అని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రెస్ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
ఈ దాడి ఘటనను యూఎన్‌ఓ జనరల్ సెక్రటరీ అధికార ప్రతినిధి ఫర్హాన్ హక్ తీవ్రంగా ఖండించారు. యూఎన్‌ఓ సిబ్బందిపై జరిగిన అన్ని దాడులపై దర్యాప్తు చేస్తామని అన్నారు. అదేవిధంగా డిఎస్‌ఎస్ విభాగానికి చెందని సభ్యుడి మరణం పట్ల యూఎన్‌ఓ జనరల్ సెక్రటరీ గుట్రెస్ సంతాపం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment