ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు.
చరిత్ర:
- 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్ ఉపయోగించారు.
- యూఎన్‌లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది.
- ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి.
ప్రాముఖ్యత:
- ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ.
- అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
యూఎన్ దినోత్సవ వేడుకలు
యూఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్‌లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యూఎన్ డే ప్రత్యక్ష్యంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబరు 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన “బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ” అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ‘76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుండి బయటపడే ప్రపంచానికి యూఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా ఈ UNని మహిళలు, పురుషులు ఆ ఆశను చిగురించేలా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్స్‌పో 2020 దుబాయ్ అక్టోబర్ 24న వివిధ అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని గౌరవ దినంగా జరుపుకుంటోంది’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment