united
-
UN: ఐరాస భద్రతా మండలిని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఐక్యరాజ్యసమితి దినోత్సవం.. చరిత్ర, విశేషాలు
ప్రతి ఏడాది అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఈ రోజు ప్రాముఖ్యత, ఏవిధంగా ఏర్పాటైంది తదితర విషయాలను స్మృతి పథంలోకి తీసుకురావడమే కాక రాబోయేతరాలకు చాటి చెప్పేలా ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు కలిసి ఘనంగా నిర్వహిస్తాయి. 1945 అక్టోబర్ 24 ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజున ఏడాది ఐక్యరాజ్యసమితి వార్షికోత్సవం (ఐక్యరాజ్యసమితి) దినోత్సవంగా నిర్వహిస్తారు. చరిత్ర: 'యునైటెడ్ నేషన్స్' అనే పేరును యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఉపయోగించారు. యూఎన్‌లో ఆరు కీలక విభాగాలు ఉన్నాయి. అవి ప్రధానంగా జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సెక్రటేరియట్ తదితరాలు న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో ఉండగా, అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్‌లో ఉంది. ఐక్యరాజ్య సమితి(యూఎన్) ఏర్పడిన సమయంలో యూఎన్ 51 సభ్య దేశాలను కలిగి ఉంది. ఇందులో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉన్నాయి. ప్రాముఖ్యత: ఐక్యరాజ్యసమితి అనేది అంతర్జాతీయ శాంతి, భద్రతల దృష్ట్య దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాలన్నింటిని ఏకతాటి పైకి తీసుకొచ్చేలా సమన్వయం చేసే కేంద్రంగా ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. యూఎన్ దినోత్సవ వేడుకలు యూఎన్ దినోత్సవం సాధారణంగా న్యూయార్క్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ హాల్లో ఐక్యతకు గుర్తుగా అన్ని దేశాలు కలిసి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అయితే ఈ ఏడాది యూఎన్ డే ప్రత్యక్ష్యంగా అన్ని దేశాలు వేర్వేరుగా ముందుగా రికార్డు చేసిన ప్రదర్శనలతో ఈ దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించాయి. ఈ మేరకు అక్టోబరు 21న రిపబ్లిక్ ఆఫ్ కొరియా, శాశ్వత మిషన్ స్పాన్సర్ చేసిన “బిల్డింగ్ బ్యాక్ టు గెదర్ ఫర్ పీస్ అండ్ ప్రోస్పెరిటీ” అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ.. ‘76 సంవత్సరాల క్రితం విపత్కర సంఘర్షణల నీడ నుండి బయటపడే ప్రపంచానికి యూఎన్ ఆశావాహ దృక్పథంగా ఆవిష్కరింపబడింది. దేశవ్యాప్తంగా ఈ UNని మహిళలు, పురుషులు ఆ ఆశను చిగురించేలా మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్ అక్టోబర్ 24న వివిధ అధికారిక కార్యక్రమాలతో ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని గౌరవ దినంగా జరుపుకుంటోంది’ అన్నారు. -
సమగ్రంగా...సమైక్యంగా...
-
నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే
-
నల్లధనంపై పోరులో ఇది ఒక అడుగు మాత్రమే...
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో భేటీ అయ్యారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రసంగించిన మోదీ డీమానిటైజేషన్ పై భారీ ఎత్తున తనకు లభించిన ఊహించని మద్దతు పట్ల సంతోషం వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా పెద్దనోట్ల రద్దుకు మద్దతు అందించిన వారిందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పెద్దనోట్ల రద్దును వ్యతిరేకిస్తూ విపక్షపార్టీలు రాద్ధాంతం చేస్తున్నారంటూ ప్రధాని మండిపడ్డారు. అవినీతినికి ప్రతిపక్షాలన్నీ మద్దతు పలకడం ఆశ్చర్యం కలిగించిందని విమర్శించారు. అవినీతి, నల్లధనం నిర్మూలనలో పెద్ద నోట్ల రద్దు ఒక 'ముందడుగు' మాత్రమే అంతే కానీ ఇదే ముగింపు కాదని ప్రధాని కొత్తసంకేతాలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయన్న హెచ్చరికలను అందించారు. సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకించేవారు కూడా డీమానిటైజేషన్ నిర్ణయానికి అండగా నిలిచారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి లభించిన సమైక్య మద్దతు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం విశేషం. నల్లదనం, అవినీతిని అంతం చేసేందుకు అధికార పక్షం పోరాడుతుంటే, విపక్షాలు మాత్రం దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యంకానీ పార్టీ ప్రయోజనాలు కాదని మోదీ ప్రకటించారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం దేశం కన్నా పార్టీ ముఖ్యమని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చట్టాలు చేస్తారుకానీ అమలు చేయరని ఎద్దేవా చేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ నల్లధనం ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు బోఫోర్స్, స్పెక్ట్రమ్ కుంభకోణాలు జరిగినప్పుడు ప్రతిపక్ష ఎన్డీయే ఆందోళన చేసిందని, ఇప్పుడు..అవినీతిపై తాము పోరాడుతుంటే ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసమని వ్యాఖ్యానించారు. 1971లోనే పెద్ద నోట్లు రద్దుచేయాలి వాంచే కమిటీ కోరినా ఇందిరాగాంధీ పట్టించుకోలేదని మోదీ పేర్కొన్నారు. కానీ నల్లధనంపై తమ ప్రభుత్వం పోరాటం చేస్తోంటే అన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థతోనే దేశానికి భవిష్యత్తు అని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా నగదు రహిత లావాదేవీలను చేపట్టాలని ప్రధాని సూచించారు. ఈవిషయంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. -
హిందువుల ఐక్యతే దేశానికి రక్ష
ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అహ్మదాబాద్: హిందువుల ఐక్యతే దేశానికి రక్ష అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. హిందూ సమాజం ప్రమాదంలో పడితే.. దేశమే ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. హిందూ దేశంగా భారత్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలంటే హిందువులంతా ఒక్కటిగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ ముగిసిన మూడు రోజుల ఆరెస్సెస్ కార్యకర్తల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘హిందువులంతా ఏకతాటిపై నిలిచినట్లయితే దేశాభివృద్ధిని ఆపడం ఏ శక్తి తరమూ కాదు. గతంలో ప్రపంచానికి మార్గదర్శనం చేస్తూ భారత్ విశ్వగురువుగా నిలిచింది. అప్పుడు ప్రపంచం శాంతియుతంగా ఉండేది. ఆ వైభవం మళ్లీ తీసుకురావాలంటే హిందువులంతా ఒక్కటి కావాలి’ అని పేర్కొన్నారు. ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు, జాతి నిర్మాణంలో సంఘ్ పరివార్ తన పాత్ర పోషిస్తోందని చెప్పారు. సంఘ్‌ను బయట్నుంచి చూడొద్దని, అది చేసే మంచి కార్యక్రమాలను గమనించి సంఘ్‌లో చేరాలని ప్రజలకు సూచించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కొనియాడుతూ సమాజంలోని అన్ని వర్గాల పట్ల సమదర్శనం కలిగి ఉండాలన్నారు. ‘ఘర్ వాపసీ’పై మౌనం.. ఇతర మతాల్లోకి మారిన వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు తలపెట్టిన వివాదాస్పద ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంపై భాగవత్ మౌనం పాటించారు. పరమత సహనం కలిగి ఉండాలన్న విషయాన్ని హిందూ ధర్మం ఎన్నో ఏళ్లుగా చెబుతూనే ఉందన్నారు. ఇతర మతాల్లోని మంచిని కూడా చూసే గొప్పదనం హిందూ మతానికి ఉందని చెప్పారు. ఇతర మతాలను కూడా సమ్మతించాలన్న విషయాన్ని హిందూ మతం చెబుతోందన్నారు. ‘ఇతర మతాలను అనుసరించేవారు మంచివారు కాదని కొన్ని మతాల వారు చెబుతుంటారు. కానీ వారిపట్ల కూడా సహనం కలిగి ఉండాలని హిందూ మతం చెబుతోంది. ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలని పేర్కొంటోంది. గోమాత, తులసి, గంగా నదిని మనం దేవుళ్లుగా చూస్తాం’ అని చెప్పారు. కిందటి నెల కోల్‌కతాలో మాట్లాడుతూ భాగవత్ ఘర్ వాపసీని గట్టిగా సమర్థించారు. తర్వాత ఘర్ వాపసీ జోరందుకోవడంతో రాజకీయ దుమారం రేగింది. కిందటి వారమే భగవత్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఘర్ వాపసీపై భగవత్ కాస్త మెత్తబడడం గమనార్హం. ‘రేప్‌లకు ప్రభుత్వం బాధ్యత వహించదు’ కాన్పూర్: మహిళలపై అత్యాచారాలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదని, సమాజమే ఇలాంటి ఘటనలకు బాధ్యత వహించాలని ఓ మహిళా మంత్రి అనడం విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌లోని బదాయూ జిల్లాలో ఇటీవల ఓ బాలికపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రి అరుణ కోరి ఆదివారం మాట్లాడుతూ.. ‘ఈ అత్యాచారానికి ప్రభుత్వం బాధ్యత వహించదు.. చిన్నారులను వేధింపులకు గురి చేసే వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తున్నాం’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు, మహిళాసంఘాల నేతలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళలపై జరిగే అకృత్యాలకు అడ్డుకట్ట వేయకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. -
సమైక్య సంఘీభావం
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమానికి రాజకీయ పార్టీల నేతలు కాకుండా విద్యార్థులే నాయకత్వం వహించేందుకు కళాశాలలు వదిలి బయటికి రావాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సామూహిక దీక్షలు జరిగాయి. విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. కృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటే మూడు ప్రాంతాలు బాగుపడతాయని, విడిపోతే తెలంగాణ మాత్రమే బాగు పడుతుందని చెప్పారు. సీమాంధ్ర విద్యార్థులు ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి పేరున్న ఇంజనీరింగ్ లేదా మెడికల్ కళాశాలల్లో చేరాలంటే అన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని తెలిపారు. కోచింగ్‌సెంటర్లు కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు. వృత్తి విద్యకోర్సులు పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలనుకున్నా ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా రాష్ట్ర రాజధానిలోనే ఉన్నాయని తెలిపారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అభివృద్ధి రాజధానిలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిందన్నారు. కానీ, మన రాష్ట్రంలో మాత్రమే అభివృద్ధి అంతా హైదరాబాదులో జరిగిందన్నారు. రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ హైదరాబాదునే అభివృద్ధి చేశారంటే అది తెలుగు ప్రజలందరిదీ అన్న భావనే కారణమన్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోరుతూ ఫిబ్రవరి 9వ తేది హైదరాబాదులో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన బిల్లును ఓడించి పంపాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎమ్మెల్యేలపై ఉందన్నారు. రాజధాని నగరం అభివృద్ధి చెందడానికి సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణలో నక్సల్స్ సమస్యను నిర్మూలించడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారనే విషయాన్ని తెలంగాణ వాదులు విస్మరించరాదని చెప్పారు. రాజకీయ జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభకు వచ్చిన రాష్ట్ర విభజన బిల్లు చర్చార్హం కాదన్నారు. రాజ్యాంగ బద్దంగా లేని తప్పుల తడక బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి పంపాలన్నారు. బిల్లును తిరస్కరించకపోతే సీమాంధ్ర ప్రజాప్రతినిధులను ప్రజలు తిరస్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవర్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, జేఏసీ నాయకులు సీఆర్ఐ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నీలి శ్రీనివాసరావు, , రాజోలి వీరారెడ్డి, ఎన్ఆర్ఐ ట్రస్టు అధ్యక్షుడు తోట కృష్ణ, కందుల విద్యా సంస్థల డెరైక్టర్ ప్రొఫెసర్ కేఎస్ఎన్ రెడ్డి, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు వెంకట్రామిరెడ్డి, బీఎన్ బాబు, చిన్న సుబ్బయ్య, విద్యుత్ జేఏసీ నాయకులు భద్రయ్య, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకుడు జోగిరామిరెడ్డి, మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అందుకే కలిసుండాలనేది!
రెండు రాష్ట్రాలన్నందుకు గీతారెడ్డికి సీఎం కౌంటర్ ‘‘మా కంపెనీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నా సొంతిల్లు లాంటిది. ఇక్కడే చదివా. ఇక్కడే పెరిగా. ఆబిడ్స్ సంతోష్ థియేటర్లో సినిమాలు చూడటం, వైఎంసీఏలో తిరగటం... అంతా గుర్తొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగా. ఈ రాష్ట్రంతో నాకెంతో అనుబంధం ఉంది..’’ ఇది పెప్సికో ఇండియా సీఈవో శివకుమార్ చేసిన వ్యాఖ్య! చిత్తూరు జిల్లా శ్రీసిటీలో పెప్సికో ప్లాంట్ పెడుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ పై వ్యాఖ్యలు చేశారు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మంత్రి గీతారెడ్డి పాల్గొన్నారు. శివకుమార్ మాట్లాడిన తర్వాత గీతారెడ్డి ప్రసంగిస్తూ.. ఇప్పటికే తెలంగాణలో పెప్సికో యూనిట్ ఉందని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ చిత్తూరు జిల్లాలో కావటంతో.. ఒకవేళ రెండు రాష్ట్రాలు ఏర్పడితే రెండుచోట్లా రెండు యూనిట్లు ఉన్నట్లవుతుందని వ్యాఖ్యానించారు. అనంతరం మంత్రి గీతారెడ్డి వ్యాఖ్యలను సున్నితంగానే కౌంటర్ చేస్తూ ముఖ్యమంత్రి తన ప్రసంగం మొదలెట్టారు. ‘‘మేడమ్ చూశారా.. ఎప్పుడో 25 ఏళ్ల కిందట మేనేజ్మెంట్ స్టడీస్ కోసం హైదరాబాద్ వచ్చి, ఇక్కడ ఉన్న పెప్సికో ఇండియా సీఈవో శివకుమార్‌కు హైదరాబాద్ అంటే ఎంత మమకారం ఉందో! మరి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకున్న మాకెంత ఉండాలి? అందుకే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, విడిపోకూడదని మేం కోరుతున్నాం’’ అని సీఎం అనగానే గీతారెడ్డి సహా అంతా ఒక్కసారిగా నవ్వేశారు. యువత రాజకీయాల్లోకి రావాలి: సీఎం యువత రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఉత్తమ పాలన అందుతుందని సీఎం పేర్కొన్నారు. ఇండియా టుడే గ్రూపు సంస్థల స్టే ఆఫ్ ది స్టేట్ - బెస్ట్ గవర్నెన్స్ అవార్డు ఢిల్లీలో అందుకున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర విద్యాసంస్థల విద్యార్థులు క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. -
రాష్ట్రాలు సమైక్యంగా వుంటేనే పురోగతి
-
విభజనకు సైఅన్న సీమాంద్ర కేంద్ర మంత్రులు
-
సీపీఐ ప్రధాన కార్యదర్శితో జగన్ భేటీ
-
మంత్రి, ఎమ్మెల్యేకు సమైక్య సెగ
కదిరి/అనంతపురం రూరల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాలకు సమైక్య సెగ తగిలింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం కదిరిలో కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి సోదరుడు నవీన్‌కుమార్‌రెడ్డి వివాహానికి మంత్రి రఘువీరా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి బయటకు రాగానే జేఏసీ నాయకులు జేవీ రమణ, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు మంత్రిని అడ్డుకుని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. దీంతో తాను కూడా సమైక్యవాదినేనని, అయితే బాధ్యత గల హోదాలో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రానున్న ఎన్నికల్లోపు తెలంగాణపై ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకోకుండా తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కాదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. దీంతో విభజనను అడ్డుకోవడంలో సీమాంధ్ర మంత్రులు విఫలమయ్యారని, వారిలో మీరు కూడా ఒకరని జేఏసీ నాయకులు మండిపడ్డారు. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి మంత్రిని కలిసి సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్‌పై ఒత్తిడి తేవాలని కోరారు. నగరంలో వాగ్వాదం.. అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో ‘రాయల తెలంగాణ’ అంశంపై మీడియా సమావేశం నిర్వహించి బయటకు వస్తున్న డీసీసీ జిల్లా అధ్యక్షుడు, గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తాను ఎస్కేయూ జేఏసీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుని తోపులాట జరిగింది. ఈ క్రమంలో ప్రెస్‌క్లబ్‌లోని స్టాండ్ విరిగిపోయింది. ఈ సందర్భంగా కొట్రికెకు, ఎస్కేయూ సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ సదాశివరెడ్డి, విద్యార్థి జేఏసీ నేతలు పరశురాం నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ సందర్భంలో సహనం కోల్పోయిన కొట్రికె.. మీడియా సమక్షంలోనే పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దలకు ఏ మాత్రం తెలీకుండా కేంద్రం తెలంగాణ ప్రకటన చేసి మోసం చేసిందని కొట్రికె చెప్పగానే.. వర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిందని చెబుతున్న పార్టీలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికే రాజీనామా చేశారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహంతోనే డీసీసీ కార్యాలయంలో కాకుండా ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించానన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ పార్టీ ముందుకొచ్చినా పూర్తి మద్దతిస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయనతో మాట్లాడానని, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న జగన్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని వదలి వస్తే చంద్రబాబుకు కూడా మద్దతిస్తానన్నారు. అనంతరం ఎస్కేయూ జేఏసీ ఆధ్వర్యంలో త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, అందులో అన్ని పార్టీలు సమైక్యాంధ్ర తీర్మాణం చేయాలని సదాశివరెడ్డి చెప్పడంతో అందుకు ఎమ్మెల్యే సరేనన్నారు. కొట్రికెను అడ్డుకున్న వారిలో జేఏసీ నేతలు పులిరాజు,వెంకటేష్, లక్ష్మినారాయణ, సోమేష్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
విభజనతో జలయుద్ధాలే
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలి: ఢిల్లీ ధర్నాలో సీమాంధ్ర లాయర్లు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగానే కొనసాగించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజనవల్ల జల వివాదాలతో యుద్ధాలు వస్తాయని, విద్య, ఉద్యోగాలు, రెవెన్యూ, విద్యుత్, వనరుల పంపిణీలో సమస్యలు తలెత్తుతాయుని జేఏసీ పేర్కొంది. విభజనతో నీటి కొరత ఏర్పడి, సీమాంధ్రలోని డెల్టా ఎడారైపోతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో సీమాంధ్ర లాయర్ల జేఏసీ శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపింది. సీమాంధ్రలోని 13 జిల్లాల లాయర్లు ధర్నాలో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణత్యాగం చేసిన అమరులకు లాయర్లు శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. జేఏసీ నేత సీవీ మోహన్‌రెడ్డి సహా పలువురు లాయర్లు ధర్నాలో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలకు లేదన్నారు. 2014 ఎన్నికల వరకు విభజన ఆగేలా వారు ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమించినంత మాత్రాన సమైక్యాంధ్ర ఉద్యమం వెనక్కిపోదని, విజయం సాధించేవరకు ప్రజాఉద్యమం కొనసాగుతుందని అన్నారు. లాయర్ల జేఏసీ సమ్మె కొనసాగుతుందని, 26న విశాఖపట్నంలో సమావేశమై భవిష్యత్ కార్యచరణ వెల్లడిస్తామని చెప్పారు. ధర్నా అనంతరం కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను, సీపీఐ అగ్రనేత ఏబీ బర్దన్‌ను కలిసి విభజననష్టాన్ని వివరించారు. -
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే
కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని, రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రాజ్‌విహార్ సెంటర్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం 52 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని తలపించేలా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, రాష్ట్ర విభజన ప్రక్రియ వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, నాయకులు నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, సిటీ కన్వీనర్ బాలరాజు, సీనియర్ న్యాయవాది జయరాజు, గిడ్డయ్య, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, మహిళా నాయకురాలు మేరి, మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మునీర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ పులి జాకబ్, నాయకులు బొల్లెద్దుల ప్రసాద్, ఎస్ఏ రహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
అలుపెరుగని ఉద్యమ అల
విరామం ఎరుగని గోదావరికి లాగే ఆ సీమలో పెల్లుబికిన సమైక్య ఉద్యమమూ నిరంతరాయంగా కొనసాగుతోంది. దారి పొడవునా వాగువంకల్ని కలుపుకొని విస్తృతమయ్యే ఆ జీవనదికి లాగే ఉద్యమంలోకీ కొత్తపాయలు వచ్చి చేరుతున్నాయి. వివిధ ప్రభుత్వ శాఖ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళనపథంలో ఉండగా తాజాగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. జిల్లాలో 44వ రోజైన గురువారం వివిధ వర్గాల వారు సమైక్య ఉద్యమాన్ని కొనసాగించారు. సాక్షి, రాజమండ్రి : జిల్లాలో గురువారం సమైక్యవాదుల ఆందోళనలు మరింత జోరుగా కొనసాగాయి. రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు సమైక్యమే తమ ధ్యేయమని గర్జించారు. తాటిపాకలో వర్తక సంఘం ఆధ్వర్యంలో లక్ష గళ ఘోష నిర్వహించారు. రాజోలు, పి.గన్నవరం నియోజక వర్గాల నుంచి విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగు, కార్మిక, రాజకీయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు భారీగా తరలి వచ్చి ప్రదర్శన జరిపి అనంతరం తాటిపాక సెంటర్లో బైఠాయించి ముక్తకంఠంతో సమైక్య నినాదాలు చేశారు. అమలాపురంలో కోనసీమలోని వేలాదిమంది రైతులు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నుంచి ఊరేగింపుగా గడియారస్తంభం సెంటర్ వరకూ ర్యాలీ చేసి సమైక్య గర్జన సభ నిర్వహించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి వస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై దాడులను ఖండిస్తూ రాజమండ్రిలో ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో ఎన్జీవో హోం వద్ద అన్ని విభాగాల జేఏసీల ప్రతినిధులు 24 గంటల మహా దీక్ష చేపట్టారు. రాత్రి 8 గంటల నుంచి ‘పోరునిద్ర’ కొనసాగించారు. తొలుత ఉద్యోగులు ర్యాలీ చేశారు. అల్లు రామలింగయ్య హోమియోపతి కళాశాల విద్యార్థులు ఎన్జీఓలకు మద్దతుగా ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. ఎన్జీఓల పిలుపు మేరకు రాజమండ్రి బంద్ పాటించి విద్యా సంస్థలు మూసివేశారు. మున్సిపల్ ఉద్యోగులు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి పుష్కరఘాట్ వరకూ వంద అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. మోరంపూడి సెంటర్లో మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. గురువారం ఉదయం నుంచి సమ్మె చేపట్టిన విద్యుత్తు ఉద్యోగులు సబ్స్టేషన్ల వద్ద నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలో రామారావుపేట సబ్ స్టేషన్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసి వంటా వార్పూ కార్యక్రమం చేపట్టారు. బొమ్మూరు 220 కేవీ సబ్ స్టేషన్ వద్ద ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో 200 మంది ఉద్యోగులు విధులకు గైర్హాజరు అయ్యారు. కాకినాడ రూరల్ పరిధిలోని ట్రాన్స్‌కో ఉద్యోగులు రాయుడుపాలెం సబ్‌స్టేషన్ ఎదురుగా దీక్షలు ప్రారంభించారు. కళారూపాలతో సమైక్య సందేశాలు కాకినాడ కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న జేఏసీ శిబిరంలో ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. శిబిరం వద్ద గొర్రెల రాము బృందం రాష్ట్ర విభజన తో వాటిల్లే నష్టాలను బుర్రకథ ద్వారా విశదీకరించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్ గేటు వద్ద వంటా వార్పూ చేపట్టారు. సమైక్యరాష్ట్ర పరిరక్షణ నినాదాలతో వేట్లపాలెంకు చెందిన కోలాటం బృందం కళాజాతా నిర్వహించింది. పీఆర్ కళాశాల విద్యార్థులు బాలాజీ చెరువు నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ చేసి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. గృహ నిర్మాణ శాఖ ఉద్యోగులు ఎన్ఎఫ్సీఎల్ రోడ్డు నుంచి నాగమల్లి తోట వరకూ ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడ్డారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. ముమ్మిడివరంలో ఉద్యోగుల భిక్షాటన కోనసీమలోని ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్‌ను. తాళ్లరేవులో రిలయన్స సంస్థను శుక్రవారం ముట్టడించేందుకు సమైక్య వాదులు సిద్ధమవుతున్నారు. కోనసీమ ఏకలవ్య ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ మండల పరిధిలో ర్యాలీ నిర్వహించి గడియారస్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఉప్పలగుప్తంలో రైతులు ర్యాలీ చేశారు. ముమ్మిడివరంలో ఏపీ ఎన్జీఓల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్డుపై భిక్షాటన చేశారు. కొత్తపేటలో జేఏసీ ఆధ్వర్యంలో యువకులు నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంఘీభావం తెలిపారు. డిగ్రీకళాశాల విద్యార్థులు, జేఏసీ ప్రతినిధులు పాతబస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. ఇరిగేషన్ సర్కిల్ హెడ్ వర్క్స్ సిబ్బంది ధవళేశ్వరం నుంచి ఆత్రేయపురం వరకూ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సామర్లకోటలో ప్రజాభిప్రాయ సేకరణ జేఏసీ ఆధ్వర్యంలో సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో రాష్ట్ర విభజనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. మహిళలు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జేఏసీ, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, గ్యాస్ డెలివరీ బాయ్స్ పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జేఏసీ, ఎన్జీఓలు తునిలో కొనసాగిస్తున్న దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, జిల్లా మహిళా విభాగం కన్వీనర్ రొంగల లక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి సంఘీభావం తెలిపారు. జగ్గంపేటలో జర్నలిస్టుల ‘హైవే నిద్ర’ ఏలేశ్వరంలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు క్వారీల్లో రాళ్లు కొడుతూ, టీడీపీ నేతలు హనుమాన్ సెంటర్లో చెప్పులు కుడుతూ నిరసన తెలిపారు. కిర్లంపూడిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పూ చేపట్టారు. జగ్గంపేటలో రాత్రి ఏడు గంటలకు 16వ నంబరు జాతీయ రహదారిపై జర్నలిస్టులు ‘హైవే నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. సీతానగరంలో సహకార సంఘాల కార్యదర్శులు రోడ్డు తుడిచి నిరసన తెలిపారు. బిక్కవోలులో వైద్య సిబ్బంది ర్యాలీ చేశారు. మండపేట కలువప్వు సెంటర్లో ఉపాధ్యాయులు రాస్తారోకో చేశారు. వైఎస్సార్ సీపీ కిసాన్ సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలం అంగరలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వంటా వార్పూ చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రిపాపారాయుడు వారికి గులాబీలు ఇచ్చారు. కె.గంగవరం మండలం పేకేరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కాజులూరులో జేఏసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ జరిపారు. రంపచోడవరం అంబేద్కర్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో ఐటీడీఏ ఇంజనీరింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ పార్టీ మాక్ ప్లీనరీ’ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు సోనియా, రాహుల్ గాంధీలకు భజన చేస్తున్నట్టు ప్రదర్శించారు. రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో కొనసాగుతున్న రిలే దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పార్టీ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన రిలే దీక్షల్లో అప్పనపల్లికి చెందిన డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పార్టీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు, రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మలికిపురం మండలం తూర్పుపాలెంలో వంటా వార్పూ చేపట్టారు. కో ఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ హాజరయ్యారు.