కర్నూలు(ఓల్డ్‌సిటీ), న్యూస్‌లైన్:
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని, రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక రాజ్‌విహార్ సెంటర్‌లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కేంద్ర హోంమంత్రి షిండే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం 52 రోజులుగా సీమాంధ్రలో ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. బ్రిటీష్ ప్రభుత్వాన్ని తలపించేలా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, రాష్ట్ర విభజన ప్రక్రియ వెంటనే మానుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, నాయకులు నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, సిటీ కన్వీనర్ బాలరాజు, సీనియర్ న్యాయవాది జయరాజు, గిడ్డయ్య, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, మహిళా నాయకురాలు మేరి, మైనార్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మునీర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్ పులి జాకబ్, నాయకులు బొల్లెద్దుల ప్రసాద్, ఎస్‌ఏ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే
Published Sat, Sep 21 2013 2:25 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement