ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ప్రమాణం | Former Portuguese prime minister Antonio Guterres sworn in as UN Secretary-General | Sakshi
Sakshi News home page

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ప్రమాణం

Published Mon, Dec 12 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ప్రమాణం

ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో ప్రమాణం

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి నూతన సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధానమంత్రి ఆంటోనియో గుటెరెస్‌ సోమవారం ప్రమాణం చేశారు. ప్రస్తుత సెక్రటరీ జనరల్ బాన్ కి-మూన్ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో తదుపరి(సమితి 9వ) సెక్రటరీ జనరల్‌గా 67 ఏళ్ల గుటెరెస్ నియామకానికి సంబంధించిన తీర్మానాన్ని మొత్తం 193 దేశాల సర్వసభ్య సభ ఇంతకు ముందే ఆమోదించింది.

గుటెరెస్ 1995 నుండి 2002 వరకూ పోర్చుగల్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2005 జూన్ నుండి 2015 డిసెంబర్ వరకు శరణార్థులకు ఐరాస హైకమిషనర్‌గా ఉన్నారు. ఆయన 2007 జనవరి 1వ తేదీ నుండి సమితి సెక్రటరీ జనరల్‌గా కొత్త బాధ్యతలు చేపడతారు. ఈ పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత సభ్య దేశాలు ఆయన పదవీ కాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement