
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లో యుద్ధం, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అణు వినాశనం వైపుగా నడిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క అపోహ, పొరపాటు అంచనాతో మానవాళి మొత్తాన్ని అణ్వస్త్రాలు కబళించి వేస్తాయని హెచ్చరించారు.
అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) అమలుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటైన సదస్సులో ఆయన మాట్లాడారు. వివిధ దేశాల వద్ద ప్రస్తుతం 13 వేల అణ్వాయుధాలు పోగుపడ్డాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment