న్యూయార్క్: పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1,20,000 సంవత్సరాల్లో ఈ జులై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిందని.. ఇక మరిగే యుగంలోకి అడుగుపెట్టామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన.
న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ధ్వంసమయ్యే ఉష్ణోగ్రతలు భూమిని వేడెక్కిస్తూ వచ్చాయని.. ఇక నుంచి సలసల మరిగే పరిస్థితులను ఎదుర్కొబోతున్నాం Era of global boiling has arrived అని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ గురించే ఆందోళన చెందుతూ వచ్చాం. ఇక దాని గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే ఇక నుంచి భూమి సలసల మరిగిపోతుంది.
ఉత్తర అర్ధగోళంలో నమోదు అవుతున్న తీవ్రమైన వేడిని.. క్రూరమైన వేసవిగా అభివర్ణించారాయన. ఇది భూగ్రహానికి వచ్చిన విపత్తు. మంచు యుగం నుంచి చూసుకుంటే.. ఈ జులైలో ప్రపంచ స్థాయి ఉష్ణోగ్రతలతో రికార్డులు బద్ధలు అయ్యాయని పేర్కొన్నారాయన. వాతావరణ మార్పు ఊహించని రీతిలో శరవేగంగా జరిగింది. ఇది భయంకరమైన పరిణామం.. ఆరంభం అయ్యిందనే అనుకోవాలి. ఇంక హెచ్చరికలు ఉండవు. త్వరపడి చర్యలు చేపట్టాలంతే అని ప్రపంచ నేతలకు పిలుపు ఇచ్చారాయన.
'The era of global warming has ended. The era of global boiling has arrived'
— Sky News (@SkyNews) July 27, 2023
UN Secretary General António Guterres warns of 'unbreathable' air and 'unbearable' temperatures to come.https://t.co/XO2D0c5uIb
📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/dhJGEC0YoD
Comments
Please login to add a commentAdd a comment