
న్యూయార్క్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి వదంతులు వస్తున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) స్పందించింది. కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ గతకొంత కాలంగా వార్తలు వస్తున్నాయని దీనిపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని యూఎన్ తెలిపింది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వస్తున్న వార్తల ద్వారానే తమకు ఈ సమాచారం అందిందని ఆ దేశ ప్రతినిధుల నుంచి తమకు వర్తమానం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎన్‌ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గురువారం రాత్రి ఓ ప్రకటన చేశారు. కిమ్ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలను తెలుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. (కిమ్ ఎక్కడున్నారో తెలుసు)
కాగా ఏప్రిల్ 15 నుంచి కిమ్ బయట ప్రపంచానికి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ఆర్యోగం బాగలేదని పలు పత్రికలు సైతం ప్రచురించాయి. ఈ వార్తలును అమెరికాతో పాటు దక్షిణ కొరియా సైతం తీవ్రంగా ఖండిచాయి. తాజాగా మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏప్రిల్ 15 నాటి కార్యక్రమానికి హాజరుకాకపోయి ఉండవచ్చని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. (‘కిమ్’ గురించి మాకు తెలియదు)
Comments
Please login to add a commentAdd a comment