న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గటరర్స్ ఎంపికవడాన్ని భారత్ స్వాగతించింది. ఈ సందర్భంగా ఆయనకు భారత ఐక్యరాజ్యసమితి రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూలై గటరస్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్తో చేతులు కలిపిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు.
గటరర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది.
'గటరర్స్ని స్వాగతిస్తున్నాం'
Published Thu, Oct 6 2016 11:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
Advertisement