welcomes
-
సీఎం జగన్‌కు అభివాదం చేసిన సతీమణి వైఎస్ భారతీ (ఫొటోలు)
-
మరోసారి తండ్రి అయిన నిర్మాత దిల్ రాజు..
Producer Dil Raju Blessed With Baby Boy With Wife Tejaswini: తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఆయన తాజాగా మరోసారి తండ్రి అయ్యారు. దిల్ రాజు సతీమణి తేజస్విని బుధవారం (జూన్ 29) ఉదయం మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. దీంతో దిల్ రాజు ఇంటికి వారసుడొచ్చాడు అంటూ టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 10, 2020న నిజామాబాద్‌లో దిల్ రాజు, తేజస్వినిల వివాహం జరిగింది. దిల్ రాజు, అనితలకు ఒక కుమార్తె హన్షిత ఉంది. కాగా ప్రస్తుతం దిల్ రాజు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌తో 'వారసుడు' సినిమా చేస్తున్నారు. ఈ సమయంలోనే దిల్ రాజు ఇంటికి నిజంగానే వారసుడు వచ్చాడు. చదవండి: తెరపైకి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవిత కథ.. ఒకే ఫ్రేమ్‌లో టాలీవుడ్ ప్రముఖులు.. అమితాబ్ ఆసక్తికర పోస్ట్ తొలిసారిగా అది చూపించబోతున్నాం: మాధవన్ Superhit Producer Dil Raju blessed with a baby boy. Congratulations 🎉 — BA Raju's Team (@baraju_SuperHit) June 29, 2022 -
రాహుల్‌కు అరుదైన స్వాగతం
అమేథీ: ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో కార్యకర్తలు అరుదైన స్వాగతం పలికారు. ‘శివ్భక్త్ రాహుల్ గాంధీ’ పోస్టర్లు అంటించారు. వందలాది మంది కాంగ్రెస్ అభిమానులు కాషాయవస్త్రాల్లో శివభక్తులైన ‘కన్వరీ’ల వేషధారణలో స్మరణలు చేస్తూ రాహుల్‌ను ఆహ్వానించారు. వందలాది కార్యకర్తల నడుమ రాహుల్ నుదుటిపై చందనం, కుంకుమ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
వైఎస్ జగన్ హామీపై మహిళల్లో హర్షాతిరేకాలు
-
మెగా డీల్: నీతి ఆయోగ్ ఓకే..ఆర్ఎస్ఎస్ గుర్రు
సాక్షి, న్యూఢిల్లీ: వాల్‌మార్ట్- ఫ్లిప్‌కార్ట్‌డీల్‌పై నీతి ఆయోగ్ సానుకూలంగా స్పందించింది. 16 బిలియన్ డాలర్ల (రూ 1.05 లక్షల కోట్లు) ఈ ఒప్పందం భారత విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం దేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ఇ-కామర్స్ ఒప్పందం ఇది చాలా సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుందన్నారు. గ్లోబల్ లీడర్ వాల్‌మార్ట్ ఎంట్రీతో చౌక ధరలతో భారతదేశంలో చిన్న వ్యాపారాలకు లబ్ది చేకూరుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కామర్స్ మార్కెట్లో మెగాడీల్‌గా అభివర్ణిస్తున్న ఈ కొనుగోలుపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ ప్రతికూలంగా స్పందించింది. వాల్‌మార్ట్ "బ్యాక్ డోర్ ఎంట్రీ" కోసం ఎఫ్‌డీఐ నియమాలను ఉల్లఘించిందని ఆరోపించారు.జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు సంస్థ కో కన్వీనర్ అశ్వనీ మహాజన్ ప్రధానమంత్రికి ఒక లేఖ రాశారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు దెబ్బతింటాయని, చిన్న దుకాణాలను, ఉద్యోగాల కల్పిన అవకాశాన్ని బాగా దెబ్బతీస్తుందంటూ స్వదేశీ జాగరణ మంచ్ ఆందోళన చేపట్టింది. వాల్‌మార్ట్ గో బ్యాక్ అంటూ ప్రదర్శన నిర్వహించింది. వ్యాపారవేత్తలు ఇప్పటికే తమ ఉనికి కోసం పోరాడుతున్నారు, దేశీయ వ్యాపారంలో వాల్‌మార్ట్ ప్రవేశం వారికి మరింత సమస్యలను సృష్టిస్తుందన్నారు. కాగా ఈ డీల్‌తో భారతదేశానికి చాలా మేలు చేస్తుందని వాల్‌మార్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్ మెక్‌మిల్లన్ పేర్కొన్నారు. -
సుప్రీం స్టే పై స్పందించిన శివశంకరన్
న్యూఢిల్లీ:ఎయిర్‌సెల్-మాక్సిస్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నిర్ణయాన్నిఎయిర్సెల్ అసలు ప్రమోటర్ సి శివశంకర్ స్వాగతించారు. న్యాయవ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందనీ, సుప్రీం పరిశీలనను గౌరవిస్తామంటూ సంతోషం వ్యక్తంచేశారు. మలేషియా మాక్సిస్ గ్రూప్ మాక్సిస్ నుంచి ఎయిర్ సెల్ 2 జి లైసెన్సుల బదిలీ ఒప్పందంపై తాత్కాలిక స్టే విధించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మర్చంట్ బ్యాంకర్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (ఎస్సీబీ)భారతీయ బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్ సెల్స్ యూజర్స్ ను టేక్ ఓవర్ చేసే కొనుగోలుదారుని చూడలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ను శివశంకర్ కోరారు. తద్వారా ఎయిర్ సెల్, శివ గ్రూపు బాకీల చెల్లింపునకు తోడ్పడాలని కోరారు. కాగా కావాలనే తన 2జి స్పెక్ట్రం లైసెన్సు తిరస్కరించారని చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటర్ సి.శివశంకరన్ అప్పట్లో ఆరోపించారు. అలాగే ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే14 రకాల లైసెన్సులకోసం దరఖాస్తు చేసుకోగా వేటినీ పట్టించుకోలేదు. విసిగి పోయిన శివశంకరన్ డిసెంబరు 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్ కి 14 లైసెన్సులూ వచ్చేశాయి. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి సోదరుని కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రు.599.01 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా సీబీఐ నివేదించిన సంగతి తెలిసిందే. -
మోదీకి ఐఎంఎఫ్ మద్దతు
వాషింగ్టన్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపట్టిన నల్లధనంపై యుద్ధానికి మద్దతు ప్రకటించింది. దేశలో పెరుగుతున్న అక్రమ ఆర్థిక లావాదేవీలు, అవినీతి నిరోధానికి రూ.500 రూ.1000 కరెన్సీ చెలామణీ రద్దును ఐఎంఎఫ్ స్వాగతించింది. కానీ ఈ ప్రక్రియలో "తెలివిగా" వ్యవహారించాలని సూచించింది. భారతదేశంలాంటి ఆర్థికవ్యవస్థలో రోజువారీ లావాదేవీల్లో నగదు పాత్ర భారీగా ఉన్నప్పటికీ, ఈ కార్యక్రమాన్ని చాలా తెలివిగా ,ఎలాంటి అంతరాయంలేకుండా ముందు జాగ్రత్తతో నిర్వహించాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ప్రతినిధి గెర్రీ రైస్ మీడియాకు చెప్పారు. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయంపై స్పందన కోరినపుడు ఆయన ఇలా వ్యాఖ్యానించారు.ఇది అసాధారణమైన నిర్ణయం కాదనీ, దేశాల తరచూ ఇలాంటి చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు. కానీ దీన్ని చాలా సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని రైస్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
వ్యాగన్ వర్క్‌షాపును సందర్శించిన రైల్వే జీఎం
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త గురువారం సందర్శించారు. ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు ఎస్వీ సాంబశివరావు, కార్యదర్శి చాంద్‌బాషా కార్మికుల సమస్యలు వివరించారు. వర్క్‌షాపులో ఖాళీగా ఉన్న 450 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రైల్వే ఆస్పత్రిలో మహిళా డాక్టర్‌ను నియమించాలన్నారు. మచిలీపట్నం, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రాయనపాడులో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే కాలనీ శిథిలావస్థకు చేరిన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులు రవీంద్రగుప్తాను సత్కరించారు. కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్షుడు కె.దుర్గాప్రసాద్, డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
'గటరర్స్ని స్వాగతిస్తున్నాం'
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గటరర్స్ ఎంపికవడాన్ని భారత్ స్వాగతించింది. ఈ సందర్భంగా ఆయనకు భారత ఐక్యరాజ్యసమితి రాయభారి సయ్యద్ అక్బరుద్దీన్ అభినందనలు తెలియజేశారు. ట్వీట్ ద్వారా ఆయన ఈ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఈ ఏడాది జూలై గటరస్ ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌తో చేతులు కలిపిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు. గటరర్స్ గతంలో ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగానికి 10 సంవత్సరాలపాటు హై కమిషనర్‌గా పనిచేశారు. కాగా, ఐరాస జనరల్ సెక్రటరీ పదవికి పోటీ పడిన స్లొవేకియా విదేశాంగ మంత్రి మిరోస్లావ్ 9 అనుకూల ఓట్లు, 5 వ్యతిరేక ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. సెర్బియన్ విదేశాంగ మంత్రి వుక్ జెరిమిక్, యునెస్కో డెరైక్టర్ జనరల్ ఇరినా బొకోవా మూడో స్థానంలో నిలిచారు. 70 సంవత్సరాలుగా యూఎన్ సెక్రటరీ జనరల్‌గా పురుషుడే ఎన్నికవుతూ వస్తున్నారు. దీంతో సెక్రటరీ జనరల్ పదవి కోసం ఒక మహిళను ఎన్నుకోవాలని సూచనలు వచ్చాయి. అయితే ఈ సారికూడా పాత పద్ధతే కొనసాగబోతోంది. -
వైట్ హౌస్‌లో 'సైంటిస్ట్ బుడతడు'
వాషింగ్టన్: చిన్నవయసులోనే పెద్దగా ఆలోచన చేసి సొంత తెలివి తేటలతో ఓ అలారం గడియారాన్ని తయారు చేసిన ముస్లిం విద్యార్థి అహ్మద్ మహ్మద్ ఎట్టకేలకు వైట్ హౌస్‌లో కాలుపెట్టాడు. అతడి తెలివితేటలకు అబ్బురపడి వైట్ హౌస్ కు రావాలని పిలిచిన దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు అతడు కొంతమంది తన టీచర్లు సహా విద్యార్థులతో కలిసి వైట్ హౌస్‌లోకి గత రాత్రి వెళ్లాడు. ఈ సందర్భంగా అతడికి మంచి స్వాగతం లభించింది. ఈ ఏడాది గత రెండు నెలల కిందట తన టీచర్లను సంబ్రమాశ్చర్యాలకు గురిచేయాలనే ఉద్దేశంతో ఎనిమిదో తరగతి చదువుతున్న అహ్మద్ మహ్మద్ తన సొంత తెలివితేటలతో ఓ అలారం గడియారాన్నితయారు చేసి దానినిపెట్టెలో పెట్టి తీసుకురాగా దానిని టీచర్లు బాంబుగా భ్రమపడ్డారు. అతడి మాటలు వినకుండానే పోలీసులకు పట్టించారు. ఆ తర్వాత అది హోమ్ మేడ్ అలారం గడియారం అని బయటకు తెలిసింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వేగంగా వ్యాపించింది. దీంతో ఆ బాలుడి తెలివితేటలకు ముగ్గుడైన ఒబామా, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్.. అహ్మద్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. తనలాంటి బాల మేథావి, సైంటిస్టు దేశానికి అవసరం అని కితాబునిస్తూ తమను కలుసుకునేందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అహ్మద్ గతరాత్రి ఒబామా వద్దకు వెళ్లి గౌరవ మర్యాదలు స్వీకరించాడు. అయితే, అహ్మద్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఒబామా గత రాత్రి సందేశమిచ్చారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు యువతను మరింత ప్రోత్సాహించాలని సూచించారు. ఎప్పటికప్పుడు వారిపై పరిశీలన కలిగి ఉండి వారి నైపుణ్యాలను వృద్ధి చేస్తూ నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ చేయాలని అన్నారు.