
అమేథీ: ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో కార్యకర్తలు అరుదైన స్వాగతం పలికారు. ‘శివ్‌భక్త్ రాహుల్ గాంధీ’ పోస్టర్లు అంటించారు. వందలాది మంది కాంగ్రెస్ అభిమానులు కాషాయవస్త్రాల్లో శివభక్తులైన ‘కన్వరీ’ల వేషధారణలో స్మరణలు చేస్తూ రాహుల్‌ను ఆహ్వానించారు. వందలాది కార్యకర్తల నడుమ రాహుల్ నుదుటిపై చందనం, కుంకుమ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.