Kailash Manasarovar Yatra
-
రాహుల్‌కు అరుదైన స్వాగతం
అమేథీ: ఇటీవల కైలాస మానస సరోవర యాత్ర ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథీలో కార్యకర్తలు అరుదైన స్వాగతం పలికారు. ‘శివ్భక్త్ రాహుల్ గాంధీ’ పోస్టర్లు అంటించారు. వందలాది మంది కాంగ్రెస్ అభిమానులు కాషాయవస్త్రాల్లో శివభక్తులైన ‘కన్వరీ’ల వేషధారణలో స్మరణలు చేస్తూ రాహుల్‌ను ఆహ్వానించారు. వందలాది కార్యకర్తల నడుమ రాహుల్ నుదుటిపై చందనం, కుంకుమ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
రాహుల్ ఫోటోల రహస్యం వీడింది
న్యూఢిల్లీ : పరమశివుడి దయ కోసం కైలాస్ మానస సరోవర్ వెళ్లిన రాహుల్ గాంధీ పంపించిన యాత్ర ఫోటోలు నిజమైనవి కావు అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఈ వివాదంలో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా రాహుల్ గాంధీ పంపిన ఫోటోలు నిజమైనవేనంటూ సదరు మీడియా సంస్థ తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ పంపిన ఫోటోలు దాదాపు మిట్ట మధ్యాహ్నం సమయంలో తీసినవని.. కనుక ఆ సమయంలో మనుషులవైనా, వస్తువులవైనా నీడలు చాలా చిన్నగా వాటి వెనక భాగంలో ఏర్పడతాయని తెలిపింది. అందువల్ల రాహుల్ గాంధీ చేతిలోని కర్ర నీడ ఫోటోలో కనిపించలేదని వివరించింది. ఏమిటీ వివాదం.. ప్రస్తుతం కైలాస్ మానస సరోవర్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ఒక యాత్రికునితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు నిజమైనవి కావంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. ఫోటోలు నిజమైనవే అయితే వీటిల్లో రాహుల్ చేతికర్ర నీడ కన్పించడం లేదు కాబట్టి ఈ ఫోటోలు ఫోటోషాప్ ద్వారా తయారు చేసినంటూ ఆయన తన ట్విటర్లో పోస్ట్ చేశారు. దాంతో నెటిజన్లు కూడా ఈ ఫోటోల పట్ల అనుమానం వ్యక్తం చేశారు. మిస్టరి వీడిందిలా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వదంతులకు చెక్ పెట్టే పనిలో పడింది ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ. అందులో భాగంగా ముందుగా రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫోటోలోని వ్యక్తి వివరాలు సేకరించి అతనితో మాట్లాడింది. ఆ వ్యక్తి పేరు మిహిర్ పటేల్.. అహ్మదాబాద్‌కు చెందిన ఇంజనీర్. ప్రస్తుతం ఇతను మానస సరోవర్ యాత్ర నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సదరు ఆంగ్ల మీడియా మిహిర్‌తో ఫోన్లో మాట్లాడి వాస్తావాలను వెలికీ తీసింది. ఈ ఫోటోల గురించి మిహిర్ మాట్లాడుతూ తాను రాహుల్ గాంధీతో కలిసి దొల్మా లా పాస్ దగ్గర ఈ నెల 6న ఈ ఫోటో దిగినట్లు తెలిపాడు. తనతో పాటు యాత్రకు వచ్చిన తన స్నేహితుడు కెనాన్ పటేల్ ఈ ఫోటోలను తీసినట్లుగా మిహిర్ తెలిపాడు. అప్పుడు సమయం దాదాపు ఉదయం 11. 45 - 12 .00 అవుతున్నట్లు వివరించాడు. అంతేకాక యాత్రలో దిగిన మిగతా ఫోటోలను వీడియోలను కూడా సదరు ఆంగ్ల మీడియా సంస్థకు అందజేశాడు. వీటిని సదరు మీడియా ఇన్విస్టిగేషన్ టీం క్రిష్ణ అనే ఫోటోషాప్ ప్రొఫెషనల్ సాయంతో మిహిర్ చెప్తున్నది నిజమేనని.. ఆ సమయంలో దాదాపు మిట్ట మధ్యాహ్నం కావోస్తుందని అందువల్లే రాహుల్ గాంధీ చేతికర్ర నీడ కనిపించడంలేదని ప్రకటించింది. అంతేకాక కెమరా యాంగిల్ వల్ల కూడా ఇలా జరిగిందని తెలిపింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో సూర్యుడు నిట్ట నిలువునా ఉండటం వల్ల వస్తువులు, మనుషుల నీడలు వారి వెనక ఏర్పడతాయని తెలిపారు. ఫోటోలో గమనిస్తే మిహిర్ చేతిలో పట్టుకున్న బ్యాగ్ నీడ కూడా దాని వెనక మిహిర్ కాళ్ల మీద పడటంతో సరిగా కనిపించడం లేదని వివరించింది. -
కైలాష్ యాత్రపై రాహుల్ ట్వీట్
న్యూఢిల్లీ : శివుడే విశ్వమని అంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తన కైలాష్ మానససరోవర్ యాత్రకు సంబంధించిన వీడియోను శుక్రవారం ట్వీట్ చేశారు. రాహుల్ యాత్ర బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హాట్ టాపిక్‌గా మారిన క్రమంలో కాంగ్రెస్ చీఫ్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆగస్ట్ 31న కైలాష్ మానససరోవర్ యాత్రకు బయలుదేరిన రాహుల్ అక్కడి ఫోటోలు, యాత్ర వివరాలను వెల్లడిస్తూ ఇటీవల ట్వీట్ చేశారు. మానససరోవర్ సరస్సు జలాలు అత్యంత స్వచ్ఛంగా ఉన్నాయని, ఇవి ద్వేషాలకు దూరమని వ్యాఖ్యానించారు. ఎవరికైనా పిలుపు వచ్చినప్పుడే ఈ యాత్రకు వస్తారని, తనకు ఈ అవకాశం రావడం అదృష్టమని చెప్పుకొచ్చారు. మరోవైపు మానససరోవర్ యాత్రకు బయలుదేరేముందు నేపాల్‌లోని ఓ హోటల్లో రాహుల్ మాంసాహారం తీసుకున్నారనే వార్తలపై పెనుదుమారం చెలరేగింది. రాహుల్ చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించగా, ఆయన పూర్తి శాఖాహార వంటకాలే ఆర్డర్ ఇచ్చారని ఆ తర్వాత రెస్టారెంట్ యాజమాన్యం ఓ ప్రకటన చేసింది. ఇక రాహుల్ యాత్రను సమర్ధిస్తూ బీజేపీ ఎంపీ తరుణ్ విజయ్ చేసిన ట్వీట్లను కాంగ్రెస్ స్వాగతించింది. రాహుల్ కైలాష్ యాత్రను సమర్ధిస్తూ నిజాయితీగా ఆయన ట్వీట్ చేశారని, అయితే పార్టీ హైకమాండ్‌కు భయపడి ట్వీట్లను తొలగించారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. -
మానససరోవర యాత్రపై రాహుల్ ట్వీట్..
న్యూఢిల్లీ : వివాదాల నడుమ కైలాశ్ మానససరోవర యాత్ర చేపట్టిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ యాత్ర వివరాలు, అనుభవాలను పంచుకుంటూ ట్వీట్ చేశారు. మానససరోవర సరస్సు జలాలు ఎలాంటి కల్మషం లేకుండా, స్వచ్ఛంగా ఉన్నాయని.. ఈ సరస్సు నీటిని అందరికీ పంచుతూ.. తానేమీ కోల్పోలేదని వ్యాఖ్యానించారు. ఈ నీటిని ఎవరైనా తాగవచ్చని.. ఇక్కడ ఎలాంటి ద్వేష భావం లేదని ట్వీట్ చేశారు. అందుకే భారత్‌లో ఈ నీటిని మనం పూజిస్తామన్నారు. ఇక్కడకు రమ్మని పిలుపు వస్తేనే మనం కైలాశ్‌కు వెళతామని వ్యాఖ్యానించారు. ఈ అవకాశం తనకు లభించినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఈ తీపి ప్రయాణాన్ని మీతో పంచుకుంటున్నానని ట్వీట్లో రాహుల్ పేర్కొన్నారు. ఆగస్ట్ 31న రాహుల్ తన కైలాశ్ యాత్రకు శ్రీకారం చుట్టగా 12 రోజుల పాటు ఆయన యాత్ర సాగనుంది. కాగా యాత్రకు బయలుదేరే ముందు నేపాల్‌లోని ఓ రెస్టారెంట్లో రాహుల్ చికెన్ లాలీపాన్స్ లాగించారనే వార్తలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పూర్తి శాకాహార వంటకాలనే ఆర్డర్ చేశారని ఈ వివాదానికి తెరదించేలా రెస్టారెంట్ వివరణ ఇచ్చింది. -
చైనా తీరుపై యాత్రికుల మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ : కైలాష్ మానససరోవర్ యాత్రకు వెళ్లిన హిందూ భక్తులు చైనా తీరుపై మండిపడ్డారు. తమను పవిత్ర మానససరోవర్ సరస్సులో మునక వేసేందుకు చైనా అధికారులు అనుమతించడం లేదని ఆరోపించారు. చైనా అధికారులతో మాట్లాడిన అనంతరం నాథులా పాస్ మార్గం తెరిచిఉంచినట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మే 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడితేనే దేశాల మధ్య సంబంధాలు పటిష్టమవుతాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖతో తాను స్పష్టం చేశానని, గత ఏడాది యాత్ర సందర్భంగా నాథులా పాస్ మార్గాన్ని మూసివేయడం ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించింది. ప్రస్తుత యాత్రకు ఈ మార్గాన్ని తెరుస్తున్నారని ప్రకటించడం పట్ల తాను సంతోషిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. సుష్మా ప్రకటన అనంతరం తాజాగా హిందూ భక్తులు చైనా అధికారుల తీరును ప్రశ్నిస్తుండటం గమనార్హం. డోక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో చైనా నిలిపివేసిన కైలాష్ మానససరోవర్ యాత్రను అనుమతించేందుకు చైనా అంగీకరించిందని షాంగై సహకార సంస్థ భేటీ సందర్భంగా సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ప్రతి ఏటా ఈ యాత్రను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూన్ సెప్టెంబర్ల మధ్య నిర్వహిస్తుంది. లిపులేక్ పాస్ (ఉత్తరాఖండ్), నాథులా పాస్ (సిక్కిం) రూట్ల ద్వారా ఈ యాత్రను చేపడతారు. ప్రతి బ్యాచ్‌కు 24 రోజుల పాటు ఈ యాత్ర వ్యవధి ఉంటుంది.