ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవాలి!: ఆంటోనియో గుటెరస్‌ | United Nations And Several Countries Called Ukraine War Must Be End | Sakshi
Sakshi News home page

యావత్‌ ప్రజల ప్రయోజనం కోసం ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవాలి!

Published Fri, May 6 2022 1:03 PM | Last Updated on Fri, May 6 2022 1:05 PM

United Nations And Several Countries Called Ukraine War Must Be End - Sakshi

War Must End For the sake of the people: ఉక్రెయిన్‌ పై రష్యా గత రెండు నెలలు పైగా నిరవధిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ పై రష్యా దాడిని ఖండించడమే కాకుండా ఐక్యరాజ్యసమితి వ్యవహార నిబంధనలను, దాని ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిచడమేనని యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితతోపాటు అనేక దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని ముగించాలని పిలుపునిచ్చాయి.

ఐతే ఇరుదేశాల మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలు గురించి మాత్రం ప్రస్తావించ లేదు. ప్రపంచ ప్రజల కోసమైనా ఈ యుద్ధ ముగిసిపోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే గుటెరస్‌ మాస్కో, కీవ్‌లను పర్యటించారు. దెబ్బతిన్న ఓడరేవు నగరం మారియాపోల్‌లోని పౌరుల తరలింపు కోసం తన గళం విప్పారు. చైనా, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, ఫ్రాన్స్, మెక్సికోలతో సహా భద్రతా మండలిలోని మెజారిటీ సభ్యుల మధ్య నెలల తరబడి కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

యూఎన్‌లోని చైనా రాయబారి జాంగ్ జున్ ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా చేయడాన్ని విమర్శిస్తూ.. దౌత్యం మాత్రమే ఈ పోరాటాన్ని ముగించగలదని నొక్కిచెప్పారు. ఈ యుద్ధాన్ని ముగించేలా కెన్యా దౌత్యవేత్త మర్టిన్‌ కిమాని, గుటెరస్‌ మధ్యవర్తిత్వం వహించాలని జాంగ్ జున్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వినయోయగించుకోవాలని ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య అన్నారు.

భద్రతామండలిలో నార్వే, మెక్కికోలో శాశ్వత సభ్యులు కానీ సభ్యులు ఆంటోనియో గుటెరస్‌ పిలుపునకు బలమైన మద్దతు ఇచ్చారు. భద్రత మండలిలో ఐక్యత ప్రతిపాదన పై రష్యా ఉక్రెయిన్‌ పై దాడికి దిగినప్పటి నుంచి అనిశ్చితంగా ఉంది. మాస్కో భద్రత మండిలి ప్రతిపాదనకు మద్దతు తెలపడానికి రష్యాకు ఇంకాస్తా సమయం పడుతుందని రష్యాన్‌ డిప్యూటీ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ చెప్పడం గమనార్హం.

(చదవండి: జో బైడెన్‌ సంచలన నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement