
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్‌కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి.
(చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం)
Comments
Please login to add a commentAdd a comment