Condoles
-
నట్వర్ సింగ్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
భారత విదేశాంగశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నట్వర్ సింగ్(93) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నట్వర్ సింగ్ మృతికి పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌లో నట్వర్‌సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన సేవలను మోదీ కొనియాడారు. ప్రపంచ దౌత్యం, విదేశాంగ విధానాల విషయంలో నట్వర్‌సింగ్ సేవలు అమోఘమన్నారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, సానుభూతి తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారత్- యూఎస్ అణు ఒప్పందం విషయంలో ఆయన కీలకపాత్ర పోషించారు. సింగ్ రచనలు పలు అంశాలపై లోతైన అవగాహనను కలిగించాయి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. సీనియర్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్లో ఒక పోస్ట్‌లో సింగ్‌కు నివాళులర్పించారు. ‘విదేశాంగశా్ మాజీ మంత్రి నట్వర్‌సింగ్ మృతి వార్త బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు దీనిని భరించే శక్తిని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. Pained by the passing away of Shri Natwar Singh Ji. He made rich contributions to the world of diplomacy and foreign policy. He was also known for his intellect as well as prolific writing. My thoughts are with his family and admirers in this hour of grief. Om Shanti. pic.twitter.com/7eIR1NHXgJ— Narendra Modi (@narendramodi) August 11, 2024 -
యామినీ కృష్ణమూర్తి మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో యామినీ కృష్ణమూర్తి తనదైన శైలిలో అద్భుత ప్రతిభను చూపారని పేర్కొన్నారు. ‘‘యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలోనూ చెరగని ముద్ర వేశారు. ఆమె మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటన్నారు. యామినీ కృష్ణమూర్తి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.I’m deeply saddened to hear of the demise of Yamini Krishnamurthy garu, the celebrated exponent of Kuchipudi and Bharatanatyam. My thoughts and prayers are with her family in these difficult times. pic.twitter.com/iACVLeZrMk— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2024గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న యామినీ కృష్ణమూర్తి.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు.యామినీని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. -
రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రామోజీరావు మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ‘‘రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రామోజీరావుగారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. రామోజీరావుగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 8, 2024గవర్నర్ సంతాపం..రామోజీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మీడియా, వినోద రంగంలో నిష్ణాతుడని, తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని, జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించినందుకు గాను రామోజీరావును పద్మవిభూషణ్‌తో సత్కరించినట్లు తెలిపారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ గ్రామీణ రూపురేఖలను సమూలంగా మార్చారు. పద్మవిభూషణ్, మెగసెసె అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. స్వామినాథన్ కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసింది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. I am deeply saddened to hear of the demise of Dr MS Swaminathan garu, the father of India’s Green Revolution. His dedication and commitment to feeding the nation transformed agriculture in India. In current times, when the thrust needs to be on increasing production to meet… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2023 -
బీజేపీ ఎంపీ కన్నుమూత.. మోదీ సంతాపం
ముంబై: బీజేపీ సీనియర్ నేత, పుణె ఎంపీ గిరీష్ బాపట్ కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 72 ఏళ్లు. గిరిష్ భగట్ మరణాన్ని పుణె నగర బీజేపీ చీఫ్ జగదీష్ ములిక్ ధృవీకరించారు. ఈ సాయంత్రం వైకుంఠ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మరోవైపు, గిరీష్ బాపట్ మరణం పట్ల మహారాష్ట్ర బీజేపీ సంతాపం తెలిపింది. ఈ విషాదకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొంది. పుణె లోక్‌సభ సభ్యుడు మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గిరీష్ బాపట్ మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఎంపీ కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘గిరీష్ బాపట్ నిరాడంబరమైన వ్యక్తి. కష్టపడి పనిచేసే నాయకుడు, సమాజానికి ఎంతో సేవ చేశారు. మహారాష్ట్ర, ముఖ్యంగా పుణె అభివృద్ధికి విస్తృతంగా కృషి చేశారు. ఆయన మృతి బాధాకరం. కుటుంబ సభ్యులకు సంతాపం. ఓం శాంతి’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Shri Girish Bapat Ji was a humble and hardworking leader who served society diligently. He worked extensively for the development of Maharashtra and was particularly passionate about Pune's growth. His passing away is saddening. Condolences to his family and supporters. Om Shanti pic.twitter.com/17M0XpcwpF — Narendra Modi (@narendramodi) March 29, 2023 కాగా అమరావతి జిల్లాకు చెందిన బాపట్.. తొలుత ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలైన ఆయన.. కస్బాపేట్ నియోజకవర్గం నుంచి అదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో పుణె నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మహారాష్ట్ర పౌర సరఫరాలశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా సేవలందించారు. గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాపట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో బుధవారం తెల్లవారుజామున పుణెలోని దీనానాథ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ నేడు మరణించారు. -
ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రామలక్ష్మి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి, రచయిత్రి కె.రామలక్ష్మి శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో నివాసముంటున్న ఆమె వయోభారంతో కన్నుమూశారు. 1930 డిసెంబర్ 31న తూర్పు గోదావరి జిల్లాలోని కోటనందూరులో ఆమె జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పుచ్చుకున్నారు. 1951 నుంచి రచనలు ప్రారంభించారు. ఆమె కలం నుంచి విడదీసే రైలుబళ్లు, మెరుపు తీగె, అవతలిగట్టు, ఆంధ్రనాయకుడు వంటి ఎన్నో రచనలు జాలువారాయి. చదవండి: దిగ్గజ రచయిత ఆరుద్ర సతీమణి కన్నుమూత -
పాతపాటి సర్రాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సర్రాజు కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందారు. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా సర్రాజు ఉన్నారు. చదవండి: Fact Check: అది రోత రాతల వంటకం -
Turkey Earthquake: మృతులకు ప్రధాని మోదీ సంతాపం
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా మృతి చెందారు. ఈ టర్కీ ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో.. "టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు చింతిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రడాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది. అలాగే టర్కీ ఈ విషాధాన్ని తట్టుకునేలా అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంది అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, టర్కీలోని కొన్నిప్రావిన్స్‌లలో మూడు సార్టు భూమి కంపించినట్లు సమాచారం. అలాగే మరి కొన్నిప్రాంతాల్లో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది. (చదవండి: ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం ) -
కృష్ణంరాజుతో రెండు చిత్రాలు.. ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం: బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజుది చెరగని ముద్ర అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. చదవండి: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే.. కృష్ణంరాజుతో కలిసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని’’ బాలకృష్ణ అన్నారు. -
కృష్ణంరాజు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్ చేశారు. చదవండి: ఆ కోరిక తీరకుండానే మరణించిన కృష్ణంరాజు! కృష్ణం రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు 187 చిత్రాల్లో నటించారు. 1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చివరిసారి రాధేశ్యామ్‌లో నటించారు. ఈ సినిమాలో పరమహంస పాత్రలో నటించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 -
సైరస్ మిస్త్రీ మృతిపై సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అకాల మరణంపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తంచేశారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఒక ఆశాజనక వ్యాపార దిగ్గజమని సీఎం కొనియాడారు. చదవండి: గౌరవం కోసం పోరాటం.. టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కారు ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘార్ జిల్లా చరోటీ నాకా వద్ద మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్య నది వంతెనపై రోడ్డు డివైడర్‌ను, ఆపై రిటెన్షన్ వాల్‌ను ఢీకొట్టింది. దాంతో మిస్త్రీతో పాటు మరొకరు అక్కడికక్కడే చనిపోయారు. -
ఏలూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోదీ సీఎం వైఎస్ జగన్ సంతాపం..
-
చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
సాక్షి, ఢిల్లీ: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనర్ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. రూయాలో 32 మంది, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్ ఎస్పీ తెలిపారు. -
లతా మంగేష్కర్‌కు ఐరాస కార్యదర్శి నివాళి
న్యూయార్క్: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియో గుట్టెరస్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత ఉపఖండ గొంతు లత అని అభివర్ణించారు. లతా మంగేష్కర్ మరణం భారత్‌కు తీర్చలేని నష్టమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం సంగీత కుటుంబానికి కూడా పూడ్చలేని లోటన్నారు. ఆమె ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. ఐరా స ఉన్నతోద్యోగి అనితా భాటియా తదితరులు కూడా లత మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. విదేశాల్లోని భారతీయ సంఘాలు లత మరణంపై విచారం వ్యక్తం చేశాయి. (చదవండి: బోరు కొడుతుందని సెక్యూరిటీ గార్డు చేసిన నిర్వాకం!... ఏకంగా రూ. 7 కోట్లు భారీ నష్టం) -
నటుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: తండ్రి మరణంతో విషాదంలో ఉన్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం పరామర్శించారు. ఫిలింనగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మంత్రి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా శ్రీకాంత్‌ను పరామర్శించారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యంతో రెండ్రోజుల క్రితం హీరో శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పరమేశ్వరరావు మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు. హీరోలు చిరంజీవి, గోపీచంద్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. (శ్రీకాంత్‌కు పితృవియోగం) -
కోదాడతో వేణుమాధవ్‌కు విడదీయలేని బంధం
సాక్షి, కోదాడ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌కు కోదాడతో ప్రత్యేక అనుబంధం ఉంది. కర్ణాటకకు చెందిన వేణుమాధవ్ తండ్రి ప్రభాకర్ (నాయర్) 50 సంవత్సరాల క్రితం కోదాడకు వచ్చి స్థిరపడ్డారు. ఆయన టెలిఫోన్ డిపార్టుమెంట్లో పనిచేసేవారు. తల్లి సావిత్రమ్మ కోదాడలో ఆర్ఎంపీగా పని చేసిది. వేణుమాధవ్‌కు ఇద్దరు అన్నలు, అక్క, చెల్లి ఉన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన ఆయన ఆ తరువాత ఇంటర్, డిగ్రీ బీకాం కోర్సులను కోదాడలోని కేఆర్ఆర్ కళాశాలలో పూర్తి చేశారు. చదువుకునే సమయంలో మిమిక్రీ, వెంట్రిలాక్విజంలో మంచి పట్టు సంపాదించారు. మాధవరెడ్డితో పరిచయం... కోదాడ ఎమ్మెల్యేగా వేనేపల్లి చందర్రావు ఉన్న సమయంలో పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేణుమాధవ్ పాల్గొని వేదికలపై నవ్వించేవాడు. ఈ క్రమంలో నాటి హోంశాఖమంత్రి మాధవరెడ్డి వద్దకు వేణుమాధవ్‌ను ఎమ్మెల్యే చందర్రావు తీసుకెళ్లి పరిచయం చేయడంతో ఆయన కోదాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. కొంత కాలం పాటు టీడీపీ కార్యాలయంలో లైబ్రేరియన్‌గా పని చేశారు. ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న క్రమంలో చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి దృష్టిలో పడడంతో ఆయన తన సినిమా ‘ సంప్రదాయం’లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా 1996 జనవరి 14న విడుదలైంది. అప్పటి నుంచి 2016 వరకు ఆయన దాదాపు 500 సినిమాళ్లో నటించారు. హం గామా, భూకైలాస్, ప్రేమాభిషేకం సినిమాళ్లో ఆయన హీరోగా కూడా నటించారు. ఈ మూడు సినిమాలకు ఆయనే నిర్మాత కూడా. ఆయనకు భార్య వాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వచ్ఛంద కార్యక్రమాల్లో సినీ నటుడిగా ఎంతో బిజీగా ఉండే వేణుమాధవ్ కోదాడలో జరిగే పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. 2009వ సంవత్సరంలో కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో జోలె పట్టి విరా ళాలు సేకరించి నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు అందజేశారు. 2016లో కోదాడలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 2018లో కోదాడలో జరిగిన బొడ్రాయి ప్రతిష్టకు ఆయన వచ్చి రెండు రోజులపాటు కోదాడలో సందడి చేశారు. ఎన్నికల సమయంలో హడావుడి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోదాడ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన కోదాడ వచ్చారు. రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేయడానికి వెళ్లి ఎలాంటి పత్రాలు తీసుకురాలేదు. దీంతో నామినేషన్ తీసుకోవడానికి అధికారులు తిరస్కరించడంతో వెళ్లిన ఆయన మళ్లీ రెండవసారి వచ్చినామినేషన్ వేశారు. నాటకీయ పరిణామాల మధ్య చివరి రోజు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. వేణుమాధవ్ మృతికి సంతాపం పట్టణానికి చెందిన ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ అకాల మృతికి పలువురు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మంచి కళాకారుడిని కోల్పోయిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తెలంగాణ సమాజం అండగా ఉంటుందని అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, ఎన్.పద్మావతి, కోదాడ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వంటిపులి అనితలు వేణుమాధవ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మాకు వెన్నుదన్నుగా ఉండేవాడు కోదాడ బాలుర పాఠశాల నుంచే వేణుమాధవ్ నాకు మంచి మిత్రుడు. ఆ తర్వాత కేఆర్ఆర్ కళాశాలలో చదువుకున్నాం. కోదాడలో మేము ఏర్పాటు చేసిన తెర సాంస్కృతిక కళామండలికి ఆయన చేదోడుగా ఉండేవాడు. కోదాడ వస్తే మా ఇంటికి రాకుండా వెళ్లడు. సంవత్సరం క్రితం భార్యభర్తలు, పిల్లలు వచ్చి వెళ్లారు. ఆయన మరణం తీవ్రమైన బాధ కలిగించింది. – వేముల వెంకటేశ్వర్లు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ వేణుమాధవ్ నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా అన్యోన్యంగా ఉండే వాడు. ప్రతి ఎన్నికల్లో కోదాడకు వచ్చి నాకు ప్రచారం చేసేవాడు. కోదాడకు వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు. ఆయనతో 20 సంవత్సరాల అనుబంధం ఇలా అర్ధంతరంగా ముగియడం బాధగా ఉంది.– పారా సీతయ్య, మాజీ సర్పంచ్ ఎంతో సరదాగా ఉండేవాడు వేణుమాధవ్ ఇంటర్, డిగ్రీలో నా క్లాస్మేట్. గత సంవత్సరం కోదాడలో జరి గిన వినా యక చవితి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి మాతో రెండు రోజులు గడిపాడు. కళాశాల రోజుల్లో సరదాగా ఉండేవాడు. పేదరికం నుంచి కష్టపడి పైకి వచ్చాడు. ఇలా అకాల మరణం చెందడం బాధ కలిగించింది. –పాలూరి సత్యనారాయణ, క్లాస్మేట్ -
హనుమంతరావు మృతిపట్ల సంతాపం తెలిపిన జగన్
-
కలాంకు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ నివాళి
-
చక్రీ మరణం పట్ల ప్రముఖుల సంతాపం
-
స్నేహితులను వదిలి వెళ్లిపోయారు: ప్రణబ్
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్ర కారుడు ప్రొఫెసర్ బిపన్ చంద్ర మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. ఆధునిక భారతదేశంలోని మొదటితరంలో మేధావుల్లో బిపన్ చంద్ర ఒకరని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కీర్తించారు. ఆయన సేవలకు దేశం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిందని గుర్తు చేశారు. ఎంతో మంది స్నేహితులు, సహచరులు, విద్యార్థులను వదిలి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు సంతాప సందేశాన్ని బిపన్ చంద్ర తనయుడు బికాస్ చంద్రకు రాష్ట్రపతి పంపించారు. -
'హిమాచల్' మృతులకు ఏపీ కేబినెట్ సంతాపం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం విశాఖలో జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో చనిపోయిన వీఎన్ఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. బెల్టు షాపుల రద్దు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. రుణమాఫీ సహా 5 సంతకాల అమలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వయోపరిమితి పెంపులో ఎదురయ్యే అభ్యంతరాలపై, సమస్యలపై కేబినెట్ సమావేశం చర్చించింది. గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు.