'హిమాచల్' మృతులకు ఏపీ కేబినెట్ సంతాపం!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం విశాఖలో జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో చనిపోయిన వీఎన్ఆర్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. బెల్టు షాపుల రద్దు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది.
రుణమాఫీ సహా 5 సంతకాల అమలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వయోపరిమితి పెంపులో ఎదురయ్యే అభ్యంతరాలపై, సమస్యలపై కేబినెట్ సమావేశం చర్చించింది. గుంటూరు సమీపంలో ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు తొలిసారి కేబినెట్ సమావేశం నిర్వహించారు.