సాక్షి, గుంటూరు: ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో యామినీ కృష్ణమూర్తి తనదైన శైలిలో అద్భుత ప్రతిభను చూపారని పేర్కొన్నారు. ‘‘యామినీ కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలోనూ చెరగని ముద్ర వేశారు. ఆమె మరణం శాస్త్రీయ నృత్య రంగంలో తీరని లోటన్నారు. యామినీ కృష్ణమూర్తి తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఆమె ఆత్మకు శాంతి కలగాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు.
I’m deeply saddened to hear of the demise of Yamini Krishnamurthy garu, the celebrated exponent of Kuchipudi and Bharatanatyam.
My thoughts and prayers are with her family in these difficult times. pic.twitter.com/iACVLeZrMk— YS Jagan Mohan Reddy (@ysjagan) August 3, 2024
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న యామినీ కృష్ణమూర్తి.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలైన ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించారు.
యామినీని 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలు ఆమెను వరించాయి. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. కూచిపూడి నృత్యానికి దేశవిదేశాలలో పేరు తెచ్చిపెట్టిన యామినీ కృష్ణమూర్తి.. కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుని పాటపాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment