సాక్షి, తాడేపల్లి: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ గ్రామీణ రూపురేఖలను సమూలంగా మార్చారు. పద్మవిభూషణ్, మెగసెసె అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. స్వామినాథన్ కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసింది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు.
దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు.
I am deeply saddened to hear of the demise of Dr MS Swaminathan garu, the father of India’s Green Revolution. His dedication and commitment to feeding the nation transformed agriculture in India.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2023
In current times, when the thrust needs to be on increasing production to meet…
Comments
Please login to add a commentAdd a comment