
ప్రొఫెసర్ బిపన్ చంద్ర(ఫైల్)
చరిత్ర కారుడు ప్రొఫెసర్ బిపన్ చంద్ర మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు.
న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్ర కారుడు ప్రొఫెసర్ బిపన్ చంద్ర మరణం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. ఆధునిక భారతదేశంలోని మొదటితరంలో మేధావుల్లో బిపన్ చంద్ర ఒకరని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కీర్తించారు. ఆయన సేవలకు దేశం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిందని గుర్తు చేశారు.
ఎంతో మంది స్నేహితులు, సహచరులు, విద్యార్థులను వదిలి ఆయన వెళ్లిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు సంతాప సందేశాన్ని బిపన్ చంద్ర తనయుడు బికాస్ చంద్రకు రాష్ట్రపతి పంపించారు.