సాక్షి, హైదరాబాద్: మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు మరణం తీవ్రంగా కలిచివేసిందని నందమూరి బాలకృష్ణ అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజుది చెరగని ముద్ర అన్నారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు.
చదవండి: కృష్ణంరాజు మృతిపై ఏఐజీ వైద్యులు ఏం చెప్పారంటే..
కృష్ణంరాజుతో కలిసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. ఆయనతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఆయన అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని’’ బాలకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment