చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి | PM Narendra Modi Condoles Loss Of Lives In Bus Accident In Chittoor | Sakshi
Sakshi News home page

చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Published Sun, Mar 27 2022 1:32 PM | Last Updated on Sun, Mar 27 2022 2:59 PM

PM Narendra Modi Condoles Loss Of Lives In Bus Accident In Chittoor - Sakshi

చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సాక్షి, ఢిల్లీ: చిత్తూరు జిల్లా భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

చదవండి: భాకరాపేట బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని చిత్తూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్‌ కమిషనర్‌ ఎం.బసిరెడ్డి తెలిపారు. తిరుపతి సమీపంలోని భాకరాపేట వద్ద ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఆయన స్పందిస్తూ.. ఘాట్ రోడ్‌లో మలుపు గుర్తించకుండా స్ట్రెయిట్‌గా వెళ్లడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. రూయాలో 32 మంది, స్విమ్స్‌లో ఏడుగురు, బర్డ్‌ ఆసుపత్రిలో ఆరుగురికి క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని కలెక్టర్‌  తెలిపారు. బస్సు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని అర్బన్‌ ఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement