టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో రెండు సార్లు భూమి కంపించింది. దీంతో ఈ ఘటనలో సుమారు వంద మందికి పైగా మృతి చెందారు. ఈ టర్కీ ఘటనపై ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో.. "టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు చింతిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు ప్రడాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. టర్కీ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుంది. అలాగే టర్కీ ఈ విషాధాన్ని తట్టుకునేలా అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంది అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, టర్కీలోని కొన్నిప్రావిన్స్‌లలో మూడు సార్టు భూమి కంపించినట్లు సమాచారం. అలాగే మరి కొన్నిప్రాంతాల్లో ఎంత ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందనేది తెలియాల్సి ఉంది.
(చదవండి: ప్రధాని మోదీ కోసం వక్కలపేటా, హారం )
Comments
Please login to add a commentAdd a comment