
సాక్షి, అమరావతి: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అకాల మరణంపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తంచేశారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైరస్ మిస్త్రీ ఒక ఆశాజనక వ్యాపార దిగ్గజమని సీఎం కొనియాడారు.
చదవండి: గౌరవం కోసం పోరాటం..
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెజ్ బెంజ్ కారు ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘార్ జిల్లా చరోటీ నాకా వద్ద మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సూర్య నది వంతెనపై రోడ్డు డివైడర్‌ను, ఆపై రిటెన్షన్ వాల్‌ను ఢీకొట్టింది. దాంతో మిస్త్రీతో పాటు మరొకరు అక్కడికక్కడే చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment