ఇరాన్ మిసైల్స్‌తో ఇజ్రాయెల్‌పై భీకర దాడి చేసింది. సుమారు 400లకుపైగా బాలిస్టిక్ మిసైల్స్‌ను మంగళవారం ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. మరోవైపు.. తాము వెంటనే అప్రమత్తమై ఇరాన్ మిసైల్స్‌ను తిప్పికొట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక.. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే.. మంగళవారం ఇరాన్ ఇజ్రాయెల్‌పై మిసైల్స్ దాడులు చేసిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బంకర్‌లో తలదాచుకోవడానికి పరిగెత్తినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో ముఖ్యంగా ఇరాన్ అనుకూల సోషల్‌మీడియా ఖాతాల్లో వైరల్‌గా మారటం గమనార్హం.
La carrera de Netanyahu hacia el búnker tras el lanzamiento de misiles iraníes. Lástima que no le cayera uno en toda la cabeza y lo pulverizara, a él y a toda su estirpe de hdp. pic.twitter.com/DGkRywBNbj
— Jaime 🏳️🌈 (@Elpieizquierdo) October 2, 2024
ఇరాన్ మంగళవారం చేసిన దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరుగులు పెట్టారని సదరు వీడియోకు కామెంట్లు చేస్తున్నారు ఇరాన్ అనుకూల నెటిజన్లు. అయితే ఆ వీడియో.. ప్రస్తుత వీడియో కాదని.. 2021 నాటికి సంబంధించిన వీడియో అని నిపుణులు తేల్చారు. నెస్సెట్ సెషన్ (చట్టసభకు) హాజరయ్యే క్రమంలో ప్రధాని నెతన్యాహు అలా పరుగులు తీశారని.. అప్పడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోందని వివరణ ఇచ్చారు.
చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ వార్.. చిన్నపిల్లల కొట్లాటలా ఉంది: ట్రంప్
Comments
Please login to add a commentAdd a comment