వాషింగ్టన్: ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అవడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. తాజాగా జరిగిన అయోవా స్టేట్ ప్రైమరీ బ్యాలెట్‌లో ట్రంప్ తిరుగులేని విజయం నమోదు చేసుకున్నారు.
అయోవాలోనే 51 శాతం ఓట్లతో ట్రంప్ విజయభేరి మోగించారంటే మిగిలిన చోట్ల ట్రంప్ గెలుపు సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ట్రంప్ తాజాగా ఓ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. బుధవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఒక డిఫమేషన్ కేసులో కోర్టుకు వచ్చినపుడు అక్కడున్న మద్దతుదారుల వైపు చూస్తూ ట్రంప్ చేయి ఊపారు.
అయితే ఆ సమయంలో ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలున్నాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ చేతిపై ఉన్న రెడ్ స్పాట్స్‌కు నెటిజన్లు తమకు తోచిన విధంగా కారణాలు చెబుతున్నారు. కొందరు ఆ మచ్చలు కెచప్ తిని చేయి శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చాయంటుంటే మరికొందరు అయోవాలో గడ్డకట్టించే చలి వల్ల వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు.
What happened to Trump’s hand? It wasn’t like this in New Hampshire. pic.twitter.com/B4TlPxEmDV
— PatriotTakes 🇺🇸 (@patriottakes) January 17, 2024
Comments
Please login to add a commentAdd a comment