- అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి క్రిమినల్ కేసులో దోషిగా తేలడం ఇదే తొలిసారి
- నాలుగేళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్
- జులై 11న తుది తీర్పు ఇవ్వనున్న కోర్టు
- జులై 15న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ నామినేషన్
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్‌మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.
అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది.
జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.
2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది.
శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..
ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది.
ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం.
నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్
‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment