Donald J Trump
-
ట్రంప్ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 40 ఎళ్ల తరువాత ట్రంప్ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ట్రంప్ జనవరి 20న(సోమవారం) అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ప్రమాణస్వీకార కమిటీ ఏర్పాటు ముమ్మరం చేసింది. అయితే, తీవ్రమైన మంచుతోపాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో ప్రమాణ స్వీకారం అవుట్‌డోర్‌లో కాకుండా యుఎస్ క్యాపిటల్లోనే చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్వీట్ చేశారు.తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ‘ప్రమాణ స్వీకారం రోజైన సోమవారం నాడు వాషింగ్టన్లో విపరీతమైన చలి ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా గరిష్టంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. అందుకే నా ప్రారంభోత్సవ ప్రసంగం, అలాగే ఇతర ప్రసంగాలు అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపల జరుగుతాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఉష్ణోగ్రతలను తీవ్ర రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. వణికించే మంచు తుపానుతో ప్రజలు ఇబ్బది పడటం నాకు ఇష్టం లేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. 1985లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చలి తీవ్రత కారణంగా అమెరికా క్యాపిటల్ భవనం రోటుండా లోపలే చివరిసారిగా ప్రారంభోత్సవం జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు.మాజీ అధ్యక్షులంతా హాజరు సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ.బుష్, బరాక్ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ (ఫేస్బుక్), జెఫ్ బెజోస్ (అమెజాన్) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం.ట్రంప్ హయాంలో అమెరికా టెక్ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే. -
ట్రంప్‌కు పనామా అధ్యక్షుడి కౌంటర్
పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్‌పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా పనామా కెనాల్లో చైనా జోక్యం లేదన్నారు.కెనాల్ రుసుములు పబ్లిక్ అండ్ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ట్రంప్ అన్నారు. -
ట్రంప్ ప్రతిపాదనల్ని తిరస్కరించిన హౌస్
వాషింగ్టన్: వచ్చే ఏడా ది మార్చి 14 వ రకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయంపై ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలురు శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ప్రతినిధుల సభ తిరస్కరించింది. రుణ పరిమితి పెంచుతూ చేసిన ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టగానే ఒక్క పెట్టున నిరసనలు చెలరేగాయి. హఠాత్తుగా తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేది లేదని సభ్యులు ప్రకటించారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.174–235 ఓట్ల తేడాతో వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సాయం, రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూ లురు అంటున్నారు. శుక్రవారంలోగా ఈ విషయంలో స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదముంది. -
బైడెన్ గుడ్ న్యూస్.. ట్రంప్ బ్యాడ్ న్యూస్
-
పెద్ద ప్లానే..! ట్రంప్ సనాతన మంత్రం
-
అమెరికాలో యూనివర్సిటీ విద్యార్థులకు ట్రంప్ ఎఫెక్ట్
-
మహిళల హక్కులను కించపరిచిన ట్రంప్
-
భారతీయులకు దెబ్బ మీద దెబ్బ ట్రంప్ సంచలనం
-
ట్రంప్ 2.0 అమెరికాలో భారతీయ విద్యార్థుల భవిష్యత్ ఏంటి?
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది. ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరిఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి. ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.- సింహబలుడు హనుమంతు -
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ట్రంప్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్ డీసీ : తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిలిపి వేస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా-ఉక్రెయిన్ సైన్యాల మధ్య 800 మైళ్ల బఫర్ జోన్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ ఆదేశాలపై రష్యా మద్దతివ్వగా.. రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా నాటోలో చేరకుండా సుధీర్ఘకాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బదులుగా అమెరికా.. ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధ సంపత్తిని సమకూర్చనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు జోబైన్ ఉక్రెయిన్‌కు పెద్ద ఎత్తున ఆర్ధికంగా,ఆయుధాల్ని అందించడంపై ట్రంప్ పలు మార్లు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే ట్రంప్ ఉక్రెయిన్‌కు ఆయుధ సంపత్తిని సమకూర్చనుండడం ఆసక్తికరంగా మారింది.ట్రంప్‌పై జెలెన్స్కీ ప్రశంసలుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడారు. అనంతరం ‘ మా ఇద్దరి మధ్య సంభాషణ సన్నిహితంగా జరిగింది. అమెరికా-ఉక్రెయిన్ దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగించేందుకు అంగీకరించాం. బలమైన, తిరుగులేని అమెరికా నాయకత్వం ప్రపంచానికి, న్యాయమైన శాంతికి చాలా అవసరం’ అని ఎక్స్ వేదికపై జెలెన్స్కీ ట్వీట్ చేశారు. -
ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్‌నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.ఇలాన్‌మస్క్ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్‌ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్‌ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్‌తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్‌నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్‌హౌజ్‌ను తలిపించేలా సింక్‌తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు. -
డియర్ మస్క్ ఐ లవ్ యూ..!
-
అధ్యక్షుడిగా పనికిరారు.. ట్రంప్‌ను ఓడించండి..
-
ట్రంప్ పుట్టిని ప్యూర్టోరీకో ముంచుతుందా?
విశాలమైన రహదారిపై ప్రయాణం సాఫీగా సాగుతున్న వేళ జరిగే ఓ చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి, జాత్యహంకార వ్యాఖ్యలు వేదికగా మారింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ప్రచార కార్యక్రమం చివరకు లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో అమెరికన్లపై జాత్యహంకార వ్యాఖ్యలతో వివాదాస్పదంగా ముగిసింది.దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుందని కథనాలు వెలువడుతున్నాయి. వివాదం చిలికిచిలికి గాలివానగా వ్యతిరేక ఓట్ల దుమారంగా మారితే ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదముంది. కరేబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో అమెరికా అ«దీనంలో ఉంది. ఇక్కడి ద్వీపవాసులకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేయకపోయినా పెద్దసంఖ్యలో ప్యూర్టోరికో వారసులు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేసే అవకాశముంది.అసలేం జరిగింది?ఆదివారం జరిగిన ఈ సభలో ట్రంప్, భార్య మెలానియా ప్రసంగించారు. వీరితోపాటు ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ సైతం పాల్గొన్నారు. కార్యక్రమానికి ఊపు తెచ్చేందుకు ప్రచారానికి మరింత పాపులారిటీ వచ్చేందుకు స్టాండప్ కమేడియన్ టోనీ హించ్క్లిఫ్తో మాట్లాడించారు. నవ్వించాల్సిన ఆయన పలు వర్గాల ఓటర్లలో ఆగ్రహజ్వాలలు రగిల్చారు. ‘‘సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటుంది. అదేంటో తెలుసా?. అదే ప్యూర్టోరీకో’’ అని హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో అమెరికాలోని ప్యూర్టోరికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.లక్షలాది మంది ప్యూర్టోరీకన్లకు అమెరికా పౌరసత్వం ఉంది. దశాబ్దాలుగా పోలింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నారు. 2022 గణాంకాల ప్రకారం ప్యూర్టోరికో మూలాలున్న అమెరికా ఓటర్లు ఏకంగా 60 లక్షల మంది ఉన్నారని తెలుస్తోంది. 1898లో స్పానిష్–అమెరికా యుద్ధం తర్వాత స్పెయిన్ వలసరాజ్యమైన ఫ్యూర్టోరీకోను అమెరికా తన వశం చేసుకుంది. 1917లో తొలిసారిగా అక్కడి వారికి అమెరికా పౌరసత్వం ఇచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్యూర్టోరికన్లు అమెరికాకు లక్షలాదిగా వలసవచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ మూలాలున్న ఓటర్లలో రెండో అతిపెద్ద వర్గంగా ప్యూర్టోరికన్లు నిలిచారు. సొంత ద్వీపం కంటే అమెరికా గడ్డపై నివసించే వాళ్లే ఎక్కువ. కీలక రాష్ట్రాల్లో వీరి ప్రభావమెంత?ఏ పార్టీ కీ మద్దతు తెలపని తటస్థ ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలనే స్వింగ్ స్టేట్స్ అంటారు. మద్దతు పలికే రాష్ట్రాలను ఆయా పార్టీ లు ఎలాగూ గెల్చుకుంటాయి. కానీ స్వింగ్ రాష్ట్రాల ఓటర్లు ఎవరికి ఓటేస్తారో తెలీదుకాబట్టి వీళ్లను ప్రసన్నం చేసుకోవడమే ట్రంప్, హారిస్‌కు ముఖ్యం. పెన్సిల్వేనియా స్వింగ్ రాష్ట్రంలో 3.7 శాతం రాష్ట్రజనాభాకు సమానమైన 4.86 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రాన్ని గెల్చుకోవడం తప్పనిసరి. ఇక్కడ హారిస్‌పై ట్రంప్ కేవలం 0.2 శాతం ఆధిక్యతతో కొనసాగుతున్నారు. తాజా ఉదంతంలో ఈ ఆధిక్యత మటుమాయమై ట్రంప్ వెనుకంజ వేయడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. జార్జియాలోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. ఇక్కడ కూడా హారిస్‌పై ట్రంప్ ఆధిక్యత స్వల్పంగా ఉంది. వీళ్ల కోపంతో ఆ ఆధిక్యత పోవచ్చని విశ్లేషణలు వస్తున్నాయి. నార్త్ కరోలినా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. స్వింగ్యేతర రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? ఏదో ఒక పార్టీ కే మద్దతు పలికే రాష్ట్రాల్లోనూ ప్యూర్టోరికన్ల ప్రభావం ఉండొచ్చని తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రంలో వీళ్లు ఏకంగా 12 లక్షల మంది ఉన్నారు. కనెక్టికల్ రాష్ట్ర జనాభాలో 8 శాతానికి సమానంగా 3 లక్షల మంది ప్యూర్టోరికన్లు ఉన్నారు. మసాచుసెట్స్లోనూ 3.26 లక్షల మంది వీళ్లే ఉన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో ఏకంగా పది లక్షల మంది వీళ్లే ఉన్నారు. ఇన్నేసి లక్షల మంది ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేస్తే హారిస్ విజయం నల్లేరుపై నడకేనని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో జాత్యహంకార వ్యాఖ్యలుట్రంప్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి. 2018లో ఎల్‌సాల్విడార్, హైతీ, ఆఫ్రికా ఖండ దేశాలను దారుణంగా కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. గత వారం సైతం వలసలపై ప్రసంగంలో ‘‘అమెరికా చెత్తకుప్పనా ఏంటి?. వ్యర్థాలు(వలసలు) అన్నీ అమెరికాకే వస్తున్నాయి’’ అని వ్యాఖ్యానించడం తెల్సిందే. తాను అధికారంలోకి వచ్చాక దేశ చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో అనధికార వలసదారుల బహిష్కరణ కార్యక్రమం చేపడతానని ట్రంప్ అన్నారు. దీనికితోడు ఆదివారం హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ప్యూర్టోరీకో మూలాలున్న ప్రముఖుల్లో ఆగ్రహజ్వాలలను ఎగసేలా చేసింది. జెన్నీఫర్ లోపేజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ ఇలా పలువురు ప్యూర్టోరికో సంగీత దిగ్గజాలూ తమ నిరసన వ్యక్తంచేశారు. ‘‘ ట్రంప్ సంగతి తెల్సిందే. గెలిస్తే తానెంత ప్రమాదకరమో, దేశ ప్రజల మధ్య ఎంతగా విభజన తీసుకురాగలరో మరో సారి నిరూపించుకున్నారు’’ అని కమలా హారిస్ విమర్శించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్‌కి తులసీ..కమలకు మాయ..!
పలుకు ఒక్కటి చాలు పది వేల సైన్యం’ అనుకుంటే తులసీ గబార్డ్ అక్షరాలా ఆ మాటకు సరిపోతుంది. చర్చావేదికలలో తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టడంలో తులసికి ఘన చరిత్ర ఉంది. ఆ ప్రతిభే ఆమెను అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి తీసుకువచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘డిబేట్’ అనేది కీలక ఘట్టం. ఓటర్ల అభిప్రాయాలు, ఆలోచనలను ప్రభావితం చేసే చర్చావేదిక. వచ్చే నెలలో జరగబోయే డోనాల్డ్ ట్రంప్–కమలా హారిస్ డిబేట్ కోసం ట్రంప్‌కు శిక్షణ ఇస్తున్న మహిళగా తులసి వార్తల్లోకి వచ్చింది. కమలా హారిస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న ట్రంప్‌కు తులసికి ఉన్న బహుముఖ ప్రజ్ఞ, ఆమె బృందంలోని ప్రతిభ విలువైన ఆస్తులుగా కనిపిస్తున్నాయి. ఇక కమలా హారిస్‌కు ఎన్నికల్లో బలమైన సలహదారుగా మాయ హారిస్ ఉంది. ఆమె ఎన్నికల ప్రసంగాలు ఫక్తు ఎన్నికల ప్రసంగాలలాగే ఉండనక్కర్లేదు అనేలా మాయా ప్రసంగాలు ఉంటాయి. కమలా హారిస్ చెల్లెలు మాయా హారిస్‌కు తన ప్రసంగాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కుటుంబ బంధాల్లో నుంచి చెప్పొచ్చు. ఆమె ప్రసంగాలలో తన తల్లి ప్రస్తావన ఉంటుంది. ఆమె తన తల్లి గురించి చెప్పే భావోద్వేగపూరిత ప్రసంగాలు ట్రంప్‌పై చేసే రాజకీయ విమర్శల కంటే బలమైన ప్రభావం చూపుతాయి. ఆ అద్భుత నైపుణ్యమే మాయను అక్క కమలా హారిస్‌కు కీ అడ్వైజర్‌ని చేసింది. మరీ ఈ ఇద్దరి నేపథ్యం, వారి వాక్ శక్తి ఏంటో సవివరంగా చూద్దామా..ట్రంప్ సలహాదారుగా తులసీ‘హూ ఈజ్ షీ?’ అని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తులసి గబార్డ్ గురించి ఆరా తీస్తున్నారు. తులసి తండ్రి మైక్ గబార్డ్ సమోవా–అమెరికన్. రాజకీయ నాయకుడు. తల్లి కరోల్ పోర్టర్ ఇండియానా రాష్ట్రంలో పుట్టింది. టీనేజీలో హిందూమతాన్ని స్వీకరించింది. హిందూమతం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తితో కుమార్తెకు ‘తులసి’ అని పేరు పెట్టింది. సెప్టెంబర్ 10న ట్రంప్, కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకరినొకరు సవాలు చేసుకోవడానికి, పైచేయి సాధించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన ప్రిపరేషన్‌కు సంబంధించి తులసి, ఆమె బృందం సహాయం తీసుకున్నాడు డోనాల్డ్ ట్రంప్. తులసి సహాయంతో కమలా హారిస్‌పై పై చేయి సాధించి తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని, ఓటర్లను ప్రభావితం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2020 అధ్యక్ష ఎన్నికల తరువాత డెమొక్రాటిక్ ΄ార్టీని వీడిన తులసి ట్రంప్ మద్దతుదారులలో బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందింది. ‘ఆమె మాటను ట్రంప్ తు.చ. తప్పకుండా పాటిస్తాడు’ అని చెప్పుకుంటారు.‘రాజకీయ చరిత్రలో ఉత్తమ వక్తలలో ఒకరిగా ట్రంప్ గుర్తింపు పొందాడు. ట్రంప్‌కు సంప్రదాయ డిబేట్ ప్రిపరేషన్ అవసరం లేదు. అయితే గతంలో కమలా హారిస్‌ను విజయవంతంగా ఎదుర్కొన్న తులసి గబార్డ్లాంటి గౌరవ సలహాదారుల అవసరం ఎంతో ఉంది’ అంటుంది ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో జాతీయ దృష్టిని ఆకర్షించింది తులసి. దీనికి కారణం ‘డెమోక్రటిక్ డిబేట్స్’లో కమలా హారిస్‌తో పోటీపడి తన సత్తా చాటింది. హవాయి ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసినప్పటి నుంచి రాజకీయాల వరకు తులసి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ‘నేనే సర్వస్వం’ అనుకునే డోనాల్డ్ ట్రంప్‌ను గ్రేట్ డిబేట్ కోసం సన్నద్ధం చేయడం అతి పెద్ద సవాలు. చిన్నప్పటి నుంచి ‘భగవద్గీత’ శ్లోకాల్లో మునిగి తేలిన తులసికి సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం ఉంది. మాటలతో సత్తా చాటే శక్తి ఉంది. కమలకు మాయమద్దతు..చికాగోలో జరిగిన డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ (డిఎన్సీ)లో అక్క కమలా హారిస్‌కు మద్దతుగా మాట్లాడిన మాయా హారిస్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తన ప్రసంగంలో భారతీయురాలైన తన తల్లి డా. శ్యామల గోపాలన్‌ను స్మరించుకుంది. ‘అమ్మ స్వయం నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి. మేము స్వతంత్రంగా ముందడుగు వేయడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ హాల్లో అమ్మ ఉండి ఉంటే అక్కను చూసి ఎంత సంతోషించేది. నాకు తెలుసు... ఆమె దివి నుంచి చిరునవ్వుతో మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.’ అంటుంది మాయ. ‘మీ జీవిత కథకు మీరే రచయిత్రులు’ అని తల్లి చెప్పిన మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది మాయాహారిస్. అక్క ΄ోరాట స్ఫూర్తి ఆమెకు ఎంతో ఇష్టం. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో చదువుకున్న మాయా హారిస్ ‘స్టాన్ఫార్డ్ లా రివ్యూ’ కు ఎడిటర్‌గా కూడా పనిచేసింది. విషయ విశ్లేషణ, ఒక అంశాన్ని అనేక కోణాల్లో చూడడం అనేది అక్కడి నుంచే అలవడింది. సామాజిక ఉద్యమాల్లోనూ చురుగ్గా ΄ాల్గొనేది మాయ. ‘డొమెస్టిక్ వయొలెన్స్ క్లినిక్’కు కో–ఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహించింది. లా స్కూల్లో పట్టా పుచ్చుకున్న తరువాత లా క్లర్క్‌గా పనిచేసింది. ఆ తరువాత ‘జాక్సన్’ లా ఫర్మ్‌లో చేరి సివిల్, క్రిమినల్ కేసులపై పనిచేసింది.కేవలం కమలా సోదరిగానే కాదు..రాజకీయ విషయాలకు వస్తే... డెమొక్రటిక్ ΄పార్టీలో హిల్లరీ క్లింటన్ ప్రచార ప్రతినిధిగా, తన సోదరి కమలా హారిస్ కోసం 2020లో ‘క్యాంపెయిన్ ఫర్ ప్రెసిడెంట్’గా పనిచేసింది. ‘వ్యక్తులను తక్కువ అంచనా వేసే వారికి ఎలా జవాబు చెప్పాలో అక్కకు తెలుసు. అండర్‌డాగ్‌గా ఉండడం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలుసు. ఇప్పటికీ ఎన్నో అడ్డంకులను అధిగమించింది. ఆశావాదంతో ముందుకు వెళుతోంది. ఈ చారిత్రక సందర్భంలో ఆమె నాయకత్వం మనకు అవసరం’ అంటుంది మాయా హారిస్.అయితే అక్కలో ఉన్నాయని చెబుతున్న సుగుణాలన్నీ మాయలో కూడా ఉన్నాయి. ఆమె గుర్తింపు ‘కమలా హారిస్ సోదరి’కి మాత్రమే పరిమితమైనది కాదు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, రచయిత్రిగా, ఉపన్యాసకురాలిగా యూఎస్‌లో తనకంటూ సొంత గుర్తింపు ఉంది. ఎన్నికల ప్రచారం, వ్యూహాల విషయంలో కమలా హారిస్ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. చెల్లి తనకు ఎంతో అండ. ఉత్తేజిత శక్తి. (చదవండి: డౌన్ సిండ్రోమ్‌తో లాయర్‌గా చరిత్ర సృష్టించింది! ఎవరీమె..?) -
గెలిచినా, ఓడినా చరిత్రే!
భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరికాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. తండ్రి వైపు నుంచే కాకుండా, తల్లి పోరాటాల రీత్యా కూడా ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఇప్పుడు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్ తోనూ ఆమె పోరాడుతారు. గెలిచినా ఓడినా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా నిలుస్తారు.‘నేను హిందువునెట్లయిత?’ అని 1996లో నేను రాసిన పుస్తకంలో, బ్రాహ్మణుడు తనను తాను దళితుడిగా మార్చుకున్నప్పుడే భారతదేశం మార్పు చెందుతుందని చెప్పాను. అలాంటిది జరుగుతుందని ఊహించలేమని కొంత మంది భారతీయ చరిత్ర, సంస్కృతి పండితులు విమర్శించారు.సంస్కృతీకరణ ప్రక్రియలో భాగంగా బ్రాహ్మణుల అన్ని జీవన విధా నాలను శూద్రులు, దళితులు అవలంబిస్తారనేది వారి వాదన. మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్ పొందడానికి ‘కున్బీ’ సర్టిఫికెట్ అడగటం గురించి గానీ, చాలామంది శూద్ర ఓబీసీలు రిజర్వేషన్ కోటా కోసం ఆదివాసీ లేదా దళిత హోదా అడగటం గురించి గానీ వారు ఏం చెబుతారో నాకు తెలీదు. ఉత్తర భారత బనియాలు ఓబీసీ సర్టిఫికెట్లను తీసుకుంటూ రిజర్వేషన్ పొందడం గురించి వాళ్లేమంటారు? దీన్నిసంస్కృతీకరణ అనవచ్చా? నా దృష్టిలో అది దళితీకరణే కానీ సంస్కృతీకరణ కాదు. ఈ రోజుల్లో ఏ కులమైనా బ్రాహ్మణ సర్టిఫికెట్ కోసం అడగడం లేదు. భారతదేశంలో ఇలా జరుగుతుండగా, పాశ్చాత్య దేశా లలోని వలస భారతీయుల్లో ఏం జరుగుతోంది? భారతీయ బ్రాహ్మణ మూలాలున్న కమలాదేవి హ్యారిస్‌కు అమెరి కాలో జరిగింది ఒక సామాజిక అద్భుతం అని చెప్పాలి. ఆమె ఆఫ్రికన్–అమెరికన్ హోదాను పొందింది తన నల్లజాతి తండ్రి కారణంగానే కాదు... ఆమె తల్లి శ్యామల గోపాలన్ హ్యారిస్ తమిళ బ్రాహ్మణ వలసదారు. నల్లజాతి స్త్రీలా కనిపించేవారు. పైగా వివాహా నికి ముందు తన జీవితంలో ఎక్కువ భాగం యూసీ బర్కిలీ ప్రాంతంలోని నల్లజాతి పరిసరాల్లో జీవించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూని యర్ సాగించిన పౌర హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. డొనాల్డ్ హ్యారిస్‌తో ఆమె వివాహం జరిగిన తర్వాత కలిగిన ఇద్దరు కుమార్తెలు కమల, మాయ నల్లజాతీయుల పరిసరాల్లోనే పెరిగారు. వారు తమ ప్రారంభ జీవితంలో నల్లజాతి ఆధిపత్య పాఠశాలలో చదువుకున్నారు. ఆమె భర్త డొనాల్డ్ హ్యారిస్ జమైకన్ అమెరికన్ ఆర్థికవేత్త. శ్యామలకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు జమైకాలో నివసిస్తున్న ఆయన కూడా నవ్యభావాలు కలిగిన వ్యక్తి. ఏమైనప్పటికీ, కమల తన తల్లి వైపు పూర్వీకుల బ్రాహ్మణ గోధుమవర్ణ సంప్రదాయ వారసత్వాన్ని ప్రకటించుకోవచ్చు. లేదా తల్లి, తండ్రి మాదిరిగా నల్ల వారి జీవితాలూ విలువైనవే భావనతో కూడిన క్రైస్తవీకరణ ప్రక్రియను అనుసరించవచ్చు. ఆమె నల్లజాతి వారసత్వాన్ని ఎంచుకున్నారు. తన యవ్వనంలోనూ, ఆ తర్వాతా తెల్లజాతి జాత్యహంకార భావాలకు వ్యతిరేకంగా పోరాడారు.ఆ దేశానికి తొలి నల్లజాతి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమల ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇది కొన్ని దశాబ్దాల క్రితం ఊహించ డానికి కూడా వీలు లేని సామాజిక దృగ్విషయం. ఆఫ్రికనీకరణచెందిన నల్ల–గోధుమ బ్రాహ్మణ మహిళ అయిన కమలా హ్యారిస్, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా శ్వేతజాతీయ వాదులతోనూ, మహిళా వ్యతిరేకి అయిన ట్రంప్‌తోనూ పోరాడుతారు. ఎన్నికల్లో గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు, తొలి నల్లజాతి మహిళా అధ్యక్షురాలు అవుతారు. 250 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో అధ్యక్షురాలిగా వైట్‌హౌజ్‌లో ప్రవేశించడానికి శ్వేతజాతి లేదా నల్లజాతి మహిళను అమెరికా ఎప్పుడూ అనుమతించలేదు. వైట్‌హౌజ్‌లో నివసించిన మహిళలందరూ వారి అధ్యక్ష భర్తలకు సహాయక పాత్రను పోషించే ప్రథమ మహిళలు (ఫస్ట్ లేడీస్)గా ఉండేవారు. కమల గెలిస్తే తన భర్తను ప్రథమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా మార్చిన మహిళ అవుతారు. ఇకపై ఆయన భూమిపై ఉన్న తన అత్యంత శక్తిమంతమైన భార్యామణిని జాగ్రత్తగా చూసుకోవాలి.బరాక్ ఒబామా మొట్టమొదటి అమెరికన్ నల్లజాతి పురుష అధ్యక్షుడిగా ఎంపికైనప్పుడు, శ్వేతజాతి ఆధిపత్యవాదులు మినహా అందరూ ఆ విజయాన్ని పండుగలా జరుపుకొన్నారు. పైగా ఆయన ఎనిమిదేళ్లు విజయవంతమైన అధ్యక్షుడిగా నిరూపించుకున్నారు. అయినా అది అమెరికా ప్రాథమిక పితృస్వామ్య స్వభావాన్ని మార్చ లేదు.మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది భార తీయ సంతతికి చెందిన పురుషులు, మహిళలు పాశ్చాత్య దేశాలలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రిషి సునాక్ ఇప్పటికే తనను తాను హిందువునని పదేపదే ప్రకటించుకుంటూ ఏడాదికి పైగా ప్రధానిగా బ్రిటన్ను పాలించారు. అయితే, కమల మత విశ్వాసం రీత్యా క్రైస్తవురాలు. ఆమె క్రిస్టియన్ కాకపోతే ఉపాధ్యక్ష పదవి వచ్చేది కాదు, అధ్యక్ష అభ్యర్థిగా అవకాశం కూడా వచ్చేది కాదు. హిందువుగా ఉంటూ వైట్‌హౌజ్‌లోకి వెళ్లాలనుకునేవారు కొందరు న్నారు. భారతీయ మూలాలకు చెందిన శాకాహార బ్రాహ్మణుడైన వివేక్ రామస్వామి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారుగానీ విఫలమ య్యారు. కమలను ‘పిల్లలు లేని పిల్లి’ అని పిలిచిన రిపబ్లికన్ల ఉపా ధ్యక్ష అభ్యర్థి జేడీ వా¯Œ ్స భార్య ఉషా చిలుకూరి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్రాహ్మణ మూలాలున్న మహిళ. ఆమె తన హిందూ శాకాహార సాంస్కృతిక విలువను బహిరంగంగా ప్రకటించుకున్నారు.విగ్రహాలను పూజించే సునాక్‌ను ప్రధానిగా అనుమతించిన బ్రిటన్‌లా కాకుండా, భారతదేశ ప్రధానిగా మరే విదేశీ వ్యక్తినీ అనుమ తించకూడదనే ఆరెస్సెస్/బీజేపీ నమూనాను అమెరికా కూడా అనుస రించవచ్చు. ఇతర మతవిశ్వాసం గల మరే వ్యక్తినీ అధ్యక్షుడిగా అమె రికా అనుమతించకపోవచ్చు. ఏదేమైనా, కమల వారి ఆధ్యాత్మిక భావాలకు సరిపోతారు.కమల తన ఆఫ్రికన్–అమెరికన్ ముద్రతో దేశాధ్యక్షురాలైతే, నల్లజాతి అమెరికన్లతో అంతగా సంబంధం లేని భారతీయ ప్రవా సులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. సంపన్న భారతీ యులు, ముఖ్యంగా మితవాద హిందూ భారతీయులు... ట్రంప్ దాత లుగా, ట్రంప్ ఓటర్లుగా ఉంటున్నారు. ట్రంప్ 2020లో మోదీ బల పరిచిన అభ్యర్థి. బహుశా ఇప్పటికీ ఆరెస్సెస్/బీజేపీ పంథా అదే కావచ్చు. వారు డెమోక్రటిక్ పార్టీని వామపక్ష ఉదారవాద పార్టీగా చూస్తారు. ఉపాధ్యక్షురాలిగా తన అధికారిక హోదాలో కమల భారత్‌ను సందర్శించలేదు. నలుపు, గోధుమరంగు స్త్రీ–పురుష సంబంధాలను నివారించ డానికీ, తెల్లవారితో కలిసి జీవించడానికీ భారతీయ అమెరికన్లు ప్రయత్నిస్తారు. శ్యామలా గోపాలన్, కమలాదేవిలా కాకుండా, వారు శ్వేతజాతీయుల పరిసరాల్లో లేదా వారి సొంత భారతీయ (దక్షిణా సియా కూడా కాదు) పరిసరాల్లో ఉంటూ, స్వచ్ఛమైన శాకాహార పార్టీలతో జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి పార్టీలలో మగవాళ్లు సూట్లు ధరిస్తారు, మహిళలు భారతీయ నారీమణుల్లాగా చీరలు కట్టు కుంటారు. కమలా హ్యారిస్ మాత్రం అమెరికన్ వ్యక్తిలా చక్కగా డిజైన్ చేసిన ఫుల్ సూట్లో కనిపిస్తారు. ఆమె దుస్తుల కోడ్ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, పురుషునిలాగా ఎలా ఉండాలని అమెరికన్ స్త్రీలు కూడా ఆమె నుండి నేర్చుకునేలా ఉంటుంది. అన్నిటికంటే మించి ఆమె జీవన శైలి సమానత్వంతో కూడుకున్నది.కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులో గెలిచినా, ఓడినా మార్పు దోహద కారులలో ఒకరిగా మారారు. భారతీయ సంతతికి చెందిన మహిళగా ఆమె ఆఫ్రికనీకరణ, మార్పు దోహదకారి పాత్రను నేను ఎంతగానో ఆరాధిస్తున్నాను. ఆమె భవిష్యత్తులోనూ శతాబ్దాల పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది మహిళలకు రోల్ మోడల్‌గా ఉంటారు. ఆమె గెలిచి తన భర్తను వైట్‌హౌజ్‌లో ప్ర«థమ పురుషుడి (ఫస్ట్ మ్యాన్)గా చేస్తారని ఆశిస్తున్నాను.-వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
బిగ్ డిబేట్‌కు ముందు ట్రంప్‌కు ఊరట
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహిస్తున్న బిగ్ డిబేట్‌కు కొద్ది గంటగల ముందు రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఊరట లభించింది. హష్ మనీ కేసులో భాగంగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టు గతంలో ట్రంప్‌పై విధించిన గ్యాగ్(సైలెన్స్) ఆంక్షలను కొద్దిగా సడలించింది.సవరించిన ఆర్డర్ ప్రకారం హష్ మనీ కేసులో సాక్షులపై మాట్లాడడానికి ట్రంప్‌నకు అనుమతి లభించింది. అయితే కేసులో ప్రాసిక్యూటర్లు, ఇతర వ్యక్తులపై కామెంట్ చేయడానికి మాత్రం కోర్టు అనుమతివ్వలేదు. త్వరలో జరగబోయే డిబేట్లో డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత దేశ అధ్యక్షుడు జో బైడెన్ మాటల దాడిని ఎదుర్కొని ధీటుగా సమాధానం చెప్పేందుకు కోర్టు విధించిన ఆంక్షలు అడ్డొస్తున్నాయని ట్రంప్ లాయర్లు వాదించారు. ట్రంప్ లాయర్ల అభ్యర్థనకు ప్రాసిక్యూటర్లు కూడా వ్యతిరేకించకపోవడంతో కోర్టు ఆంక్షలను కొంత మేర సడలించింది.హష్ మనీ కేసులో ట్రంప్ దోషి అని కోర్టు ఈ ఏడాది మే30న తేల్చింది. ఈ కేసులో కోర్టు జ్యూరీ తుది తీర్పు వెలువరించడంతో పాటు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. తనను లైంగికంగా వాడుకొని ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాడని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ ట్రంప్‌పై హష్ మనీ కేసు పెట్టింది. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టంగా చెబుతున్న ట్రంప్, జో బైడెన్ల బిగ్ డిబేట్ గురువారం(జూన్27)న జార్జియాలో జరగనుంది. పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్లో జో బైడెన్, ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. -
బైడెన్ వర్సెస్ ట్రంప్.. ‘బిగ్ డిబేట్’ వైపే అందరి చూపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా వారిద్దరి మధ్య జూన్ 27న తొలి పబ్లిక్ డిబేట్(చర్చ) జరగనుంది. జార్జియాలోని అట్లాంటాలో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ జరగనుంది. డిబేట్లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వారిద్దరు చెప్పనున్నారు. డిబేట్లో బైడెన్,ట్రంప్ ఇద్దరు కఠిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో బైడెన్, ట్రంప్ వయసు కూడా ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ముఖ్యంగా బైడెన్ ఇటీవల తన మతిమరుపును పదే పదే బయటపెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైడెన్ ట్రంప్ దూకుడు తట్టుకోగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు వృద్ధనేతల మధ్య జరగనున్న డిబేట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అన్ని ఒపినీయన్ పోల్ సర్వేలు ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారనే చెబుతున్నాయి. ఈ డిబేట్ తర్వాత ప్రజాభిప్రాయం ఎవరో ఒకరివైపు కొంత మేర షిఫ్ట్ అవ్వొచ్చన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
అమెరికాలో పొలిటికల్ హీట్.. ట్రంప్ జైలుకా, వైట్ హౌస్కా
అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో-అమెరికా మధ్య గోడ, ఏడు దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం. ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా వివర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో...జైలుకా, వైట్ హౌస్కా అన్న చర్చ మొదలైపోయింది. ఈ ఎపిసోడ్‌కి ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే...డోనల్డ్ ట్రంప్ కూడా క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం అన్నది ఇదే తొలిసారి. ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా...ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటు రిపబ్లికన్స్ కూడా అదే స్థాయిలో ట్రంప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. మన్ హట్టన్ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని నవంబర్ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందంటున్నారు ట్రంప్. నవంబర్ 5 ఎలక్షన్ డే. అయితే...అందరి చూపు మాత్రం ఇప్పుడు జులై 11వ తేదీన న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్ వయస్సు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్ అవడం...ఇలా అనేక అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో...జరిమానాతో సరిపెడతారా ? లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. హష్ మనీ కేసులో ట్రంప్ పై మొత్తం 34 అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా...గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక వేళ ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కేవలం అధ్యక్షుడికి మాత్రమే కాదు. మాజీ అధ్యక్షులకు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంది. ట్రంప్‌కి కూడా సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఇప్పుడు హష్ మనీ కేసులో ట్రంప్‌కి జైలు శిక్ష పడితే...ట్రంప్‌కి జైల్లో కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీని కోసం అనేక జైలు నిబంధ నలను సవరించాలి. అలానే...అమెరికా మాజీ అధ్యక్షుడుని జైల్లో ఉంచడం అంటే...భద్రతా పరంగా చాలా రిస్క్. ఈ కోణంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ట్రంప్‌కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే...అమెరికా రాజ్యాం గం అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో వయస్సు, అమెరికా పౌరసత్వం, 14 ఏళ్లుగా అమెరికాలో నివశించడం లాంటి వే ఉన్నాయి. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నాయి. అయితే...ఇప్పటికే ట్రంప్‌కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపి స్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూమ్‌బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్‌లో...ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లి కన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు తెలిపారు. క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు. ట్రంప్‌ని న్యాయస్థానం దోషిగా తేల్చిన మర్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన సర్వేలో ఈ తీర్పు సరైనదే అని, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని...సర్వేలో పాల్గొన్న మెజార్టీ అమెరికన్లు తేల్చేశారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్‌ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిం దంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్‌కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. కానీ...హష్ మనీ కేసు మాత్రం ట్రంప్‌ని తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరుగుతోంది. ఆయనకొచ్చే విరాళాలు పెరుగుతున్నాయి.ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో బైడెన్‌కి అధికారాన్ని బదలాయించకుండా...తన మద్దతుదా రులను ట్రంప్ రెచ్చగొట్టిన తీరు...ఆయన తెంపరితనానికి పరాకాష్ట. వ్యవస్థలపై ట్రంప్ ఎప్పుడూ పెద్దగా గౌరవం చూపించరు. ఈసారి గెలిస్తే...వలసలను కట్టడి చేయడం దగ్గర నుంచి అంతర్జాతీయ సాయానికి కత్తెర వేయడం దాకా చాలా వివాదాస్పద అంశాలనే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రత ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో జులై 11న హష్ మనీ కేసులో ట్రంప్‌కి పడే శిక్ష ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్రిమినల్ కేసులో ట్రంప్ దోషిగా తేలడాన్ని...తన ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవడం పై బైడెన్ ఫోకస్ పెడుతున్నారు. బైడెన్ కుమారుడు ఎపిసోడ్‌ని కూడా ట్రంప్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. 80 ఏళ్లు బైడెన్, 80 వసంతాలకు అతి చేరువలో ఉన్న ట్రంప్. పైగా...వీరిద్దరూ చుట్టూ క్రిమినల్ కేసుల కేంద్రం గా నెగిటివ్ వైబ్రేషన్స్. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే...సమర్థ నాయకత్వాన్ని అమెరికాకు అందించే విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు బలంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
TRUMP: ‘హష్ మనీ’ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్: పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపులు(హష్మనీ) చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్ న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా ట్రంప్ రికార్డులకెక్కారు.అక్రమ సంబంధం గురించి పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ మాట్లాడకుండా ఉండేందుకు ఆమెకు చేసిన చెల్లింపులకుగాను తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన నేరంలో ట్రంప్ దోషిత్వం రుజువయ్యింది. ఈ కేసులో ట్రంప్‌పై మోపిన మొత్తం 34 అభియోగాలు రుజువైనట్లు 14 సభ్యుల కోర్టు జ్యూరీ ప్రకటించింది. అయితే జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో కోర్టు తుది తీర్పు వెలువరించాల్సి ఉంది. జులై 11న తుది తీర్పు వెలువరించడంతో పాటు ట్రంప్‌నకు శిక్ష ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ కేసులో ట్రంప్‌నకు గరిష్టంగా 4 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే తరహా నేరానికి పలువురు దోషులుగా తేలినప్పటికీ స్వల్ప శిక్షలు లేదా జరిమానాలు మాత్రమే విధించారు.2006లో తనను లైంగికంగా వాడుకున్న ట్రంప్ ఆ విషయం బయటికి రాకుండా ఉండేందుకు తనకు అక్రమ చెల్లింపులు చేశారని పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ హుష్‌మనీ కేసు ఫైల్ చేసింది. శిక్ష పడ్డా ప్రచారం షరా మామూలే..ఈ ఏడాది నవంబర్ 5న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. ట్రంప్‌కు హుష్‌మనీ కేసులో ఒకవేళ జైలు శిక్ష పడినా అది ఆయన ఎన్నికల ప్రచారానికి, అధ్యక్ష పదవిని చేపట్టడానికి ఎలాంటి అడ్డంకి కాదని తెలుస్తోంది. ఎలాంటి శిక్ష పడినా ట్రంప్ వెంటనే ఈ కేసులో పైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రంప్‌ను నవంబర్5న జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసే రిపబ్లికన్ పార్టీ సమావేశాలు జులై 15 నుంచే ప్రారంభమవనున్నాయి. దీనికి కొద్ది రోజుల ముందే ట్రంప్‌నకు కోర్టు శిక్ష ఖరారు చేయనుండటం గమనార్హం. నేను చాలా అమాయకుణ్ణి: ట్రంప్ ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చాలా అమాయకుణ్ణి. చివరి వరకు నేను పోరాడుతూనే ఉంటా. గెలుస్తా’అని దోషిగా తేలిన తర్వాత కోర్టు బయటికి వచ్చిన ట్రంప్ మీడియాతో అన్నారు. -
US: ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలేంటి ? ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ
వాషింగ్టన్: ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అవడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. తాజాగా జరిగిన అయోవా స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ తిరుగులేని విజయం నమోదు చేసుకున్నారు. అయోవాలోనే 51 శాతం ఓట్లతో ట్రంప్ విజయభేరి మోగించారంటే మిగిలిన చోట్ల ట్రంప్ గెలుపు సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ట్రంప్ తాజాగా ఓ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. బుధవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఒక డిఫమేషన్ కేసులో కోర్టుకు వచ్చినపుడు అక్కడున్న మద్దతుదారుల వైపు చూస్తూ ట్రంప్ చేయి ఊపారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలున్నాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ చేతిపై ఉన్న రెడ్ స్పాట్స్‌కు నెటిజన్లు తమకు తోచిన విధంగా కారణాలు చెబుతున్నారు. కొందరు ఆ మచ్చలు కెచప్ తిని చేయి శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చాయంటుంటే మరికొందరు అయోవాలో గడ్డకట్టించే చలి వల్ల వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. What happened to Trump’s hand? It wasn’t like this in New Hampshire. pic.twitter.com/B4TlPxEmDV — PatriotTakes 🇺🇸 (@patriottakes) January 17, 2024 ఇదీచదవండి.. రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే -
US: ట్రంప్ కేసులో శృంగార తార స్టార్మీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ఘన విజయం సాధించారు. దీంతో వివేక్ రామస్వామి లాంటి ప్రత్యర్థి ఏకంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ పోటీ నుంచే తప్పుకున్నారు. ఇదిలాఉంటే ట్రంప్‌కు తాజాగా మరో న్యాయపరమైన తలనొప్పి వచ్చి పడింది. శృంగార స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో మార్చిలో మన్‌హట్టన్ కోర్టు ముందు హాజరవుతానని చెప్పింది. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు ట్రంప్ అక్రమ పద్ధతిలో పేమెంట్ ఇచ్చారని, ఇందు కోసం ఆయన తన బిజినెస్ రికార్డులను తారుమారు చేశారని స్టార్మీ ఆరోపిస్తోంది. తనకు ట్రంప్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని గతంలోనే ఆరోపణలు చేసి స్టార్మీ సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కోర్టుకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏం చెబుతుంది దాని పరిణామాలేంటన్నదానిపై ట్రంప్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇదే కేసులో ట్రంప్ తరపున వాదిస్తున్న అగ్రశ్రేణి న్యాయవాది జో టాకోపినా తాను ఇక ఆయన తరపున వాదించనని సోమవారం కోర్టుకు తెలిపారు. ఒక పక్క అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేసుల తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఇదీచదవండి.. బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు -
US Elections: అవి హిట్లర్ వ్యాఖ్యలా?... నాకు తెలియదు: ట్రంప్
వాషింగ్టన్: అక్రమ వలసలపై తాను చేసిన వివాదస్పద వ్యాఖ్యలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. అమెరికాలోకి భారీగా వస్తున్న అక్రమ వలసలపై ‘పాయింజనింగ్ ద బ్లడ్’(విష తుల్యమవుతున్న రక్తం) అని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ఒకప్పటి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన పుస్తకం ‘మెయిన్ కంఫ్’లో వాడిన సంగతి తనకు తెలియదని ట్రంప్ వివరణ ఇచ్చారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యలతో నాజీల భావజాలన్ని తాను ధృవీకరించడం లేదని తెలిపారు. పాయిజనింగ్ ద బ్లడ్ వ్యాఖ్యల వెనుక హిట్లర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు ఒకటేనా అని ఒక రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ప్రశ్నించగా ‘లేదు..అసలు నాకు హిట్లర్ గురించి ఏమీ తెలియదు. హిట్లర్ ఆ పదాలు వాడాడని కూడా తెలియదు. నేను ఆయన రాసిన పుస్తకం చదవలేదు. ఇదంతా కొంత మంది చేస్తున్న తప్పుడు ప్రచారం’అని ట్రంప్ కొట్టిపారేశారు. నేషనల్ పల్స్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా ట్రంప్ పాయిజనింగ్ ద బ్లడ్ అనే వ్యాఖ్యలు చేశారు. గత వీకెండ్లో న్యూ హ్యాంప్‌షైర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్ మళ్లీ ఇవే వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. ఆ తర్వాత ఇవి హిట్లర్ వాడిన పదాలు వివాదస్పదమై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా ట్రంప్ వెనక్కి తగ్గలేదు. అవే వ్యాఖ్యలను రిపీట్ చేస్తూ వస్తున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీకి ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. ఇదీచదవండి..ఇరాన్‌పై అమెరికా సంచలన ఆరోపణలు -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మళ్లీ ఆయనే హాట్ ఫేవరెట్!
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఫేవరెట్‌గా మారుతున్నారు. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ చేసిన సర్వేలో ప్రస్తుత అధ్యకక్షుడు జో బైడెన్‌కంటే 4 శాతం ఎక్కువ అప్రూవల్ రేటుతో ట్రంప్ ముందున్నారు. అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్‌ను 43 శాతం మంది ప్రజలు ఆమోదించగా ట్రంప్‌ను 47 శాతం మంది ఆమోదించడం విశేషం. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి జో బైడెన్ అప్రూవల్ రేటు 43 శాతానికి పడిపోవడం ఇదే తొలిసారి. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ టైమ్ ఉండడంతో డెమొక్రాట్లకు ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. దీంతో డెమొక్రాట్లు రెండోసారి అధ్యక్షపదవికి జోబైడెన్ పోటీలో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. బైడెన్ రెండోసారి పోటీచేయవద్దనేందుకు వాళ్లు మరో కారణం కూడా చూపుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన వయసు 81కి చేరనుందని, ఈ వయసులో మళ్లీ పోటీ ఎందుకని కొందరు డెమొక్రాట్ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి పోటీలో ట్రంప్‌కు తిరుగులేని మద్దతు లభిస్తోంది. పార్టీలో ట్రంప్ పోటీదారులెవరూ ఆయన దరిదాపుల్లో కూడా లేరు. అయితే ట్రంప్ మీదున్న క్రిమినల్ కేసులు, గతంలో క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి వంటి అంశాలు ఆయన అభ్యర్థిత్వానికి ముప్పుగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదీచదవండి..ఈ రెస్టారెంట్లో చెంపదెబ్బలు వడ్డిస్తారు!