ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ రెండోసారి ఎంపికయ్యాడు. గతంలో ట్రంప్ విదేశీ వలసలు, గ్రీన్ కార్డులు, వీసాలపై కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అమెరికా డాలర్‌డ్రీమ్స్ కంటున్న విద్యార్థుల భవిష్యత్ ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక విషయాలను చూద్దాం.
ట్రంప్ 2.0లో ప్రభావితమయ్యే మరో అంశం స్టూడెంట్స్ వీసాలు, ఉద్యోగాలు. ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చు. కానీ ప్రత్యేకించి H1B వీసాలు కఠినతరం కానున్నాయి. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారనున్నాయి. వర్క్ వీసాలు కష్టమయ్యే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మాస్టర్స్ చదివి.. అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారి ఆశలపై నీళ్లు చల్లినట్లే.. అయితే ఎడ్యుకేషన్ వీసాల పట్ల ట్రంప్ సానుకూలంగానే ఉండే అవకాశం ఉంది.
లే ఆఫ్.. ఆర్థిక మాంద్యం.. ఆంక్షలు, నిరుద్యోగం వంటి సమస్యలు అమెరికాలో భారతీయ విద్యార్థులను వెంటాడే సమస్యలు. అమెరికాలో నైపుణ్యం గల యువతలో భారతీయులే అధికం. దీంతో పాటు ఫ్రెషర్స్‌కు భారత్ పోల్చితే అమెరికాలో వేతనాలెక్కువ. డాలర్ ప్రభావం కూడా అధికం. అమెరికాలో 4500కు పైగా యూనివర్సిటీలు, 8 వేలకు పైగా కాలేజీలున్నాయి. విదేశీయులు జాయిన్ అయితేనే అమెరికాలో వర్సిటీలు, కాలేజీల్లో సీట్లు నిండుతాయి. దీంతో స్టూడెంట్ వీసాలకు ఢోకా ఉండదనే చెప్పాలి. ఇక అమెరికాలో చదువుకుంటే చదువు అయిపోగానే గ్రీన్ కార్డు ఇస్తామని ట్రంప్ గతంలో హామీ ఇచ్చాడు ? మరి ఇది అమలవుతుందా? లేదా? కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నది భవిష్యత్తులో తేలనుంది.
ఉద్యోగ అవకాలు పెరుగుతాయా.. ?
ట్రంప్ విధానాల కారణంగా అమెరికా సిటిజన్స్, గ్రీన్ కార్డు హోల్డర్స్ కు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే అధిక నైపుణ్యం గల విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు. అమెరికాలో వర్క్ ఫోర్స్‌కు డిమాండ్ మరింత పెరగనుంది. దీంతో హెచ్1 వీసాలు జారీ చేయాల్సి ఉంటుంది.
అయితే గతంతో పోల్చితే భారతీయ వృత్తి నిపుణుల విషయంలో ఆయన కొంత సానుకూల వైఖరి కనబరుస్తున్నారు. దీంతో H1B,OPT వారికి కూడా జాబ్స్ పరంగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లీగల్ గా వర్క్ చేసే వారికి ట్రంప్ పాలనలో మంచి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో ఇల్లీగల్ గా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి గడ్డు పరిస్థితులే ఎదురుకోవాల్సి ఉంటుంది.
అక్రమ వలసదారులు పట్ల ట్రంప్ వైఖరి
ఇక అమెరికాలోకి అక్రమంగా వచ్చిన వారిని మూకుమ్మడిగా తిప్పి పంపడం.. డిపోర్టేషన్ పై ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నానంటున్నారు ట్రంప్. దీని కోసం ఎంత ఖర్చైనా సరే, తగ్గేది లేదంటున్నారు. మరి అక్రమ వలసదారుల్ని సామూహికంగా తిప్పి పంపిస్తానన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు అంత ఈజీయేనా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరైనా డాక్యూమెంట్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వారిని గుర్తించి, అరెస్ట్ చేసి వారి సొంత దేశానికి పంపించడం క్లిష్టమైన వ్యవహారం అనే చెప్పాలి.
ట్రంప్ విధానాలు వలసవచ్చిన వారికి గతంలో చాలా సమస్యలు సృష్టించాయి. భారత ఉద్యోగులు, టెక్నాలజీ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ట్రంప్ వలసల విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం. అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసు కుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం చేశారు. ఒకవేళ ఇదే విధానం కొనసాగితే, అమెరికాలో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. భారత టెక్ కంపెనీలు సైతం అమెరికా కాకుండా మిగిలిన దేశాలలో పెట్టుబడులు పెడతాయి.
ఇదీ చదవండి : ట్రంప్ 2.0: ఎన్నారైల ఎదురుచూపులు ఫలించేనా? లేక ఎదురు దెబ్బనా?
ట్రంప్ అయినా, ఇంకొకరైనా అమెరికా అధ్యక్షునికి..అమెరికా ప్రయోజనాలే ముఖ్యం. తరువాతే మరో దేశం. ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచాన్ని అమెరికా తమ మార్కెట్‌గా చూస్తుందినటంలో సందేహమే లేదు. మరి కొత్త ప్రభుత్వం ఇమిగ్రేషన్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకు వస్తుందో వేచి చూడాలి.
- సింహబలుడు హనుమంతు
Comments
Please login to add a commentAdd a comment