అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ట్రంప్‌నకు మద్దతుగా టెస్లా సీఈఓ ఇలాన్‌మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో పోస్ట్ చేసిన వీడియోను ఎడిట్ చేసి తిరిగి తాజాగా అమెరికా అధ్యక్ష ఫలితాల నేపథ్యంలో ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
ఇలాన్‌మస్క్ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి కార్యాలయంలో ప్రవేశించే సమయంలో వినూత్నంగా సింక్‌ను చేతిలో పట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను అప్పటి ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్(దాన్ని మునిగిపోనివ్వండి)’ అంటూ కామెంట్‌ను జోడించారు. అప్పటివరకు ప్రత్యర్థుల యాజమాన్యంలోని సంస్థను మస్క్ కొనుగోలు చేసిన నేపథ్యంలో తాను అలా కామెంట్ చేస్తూ సింక్‌తో ట్విటర్ కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
అమెరికా ఎన్నికలు పూర్తయి ట్రంప్ విజయం ఖారారైంది. ట్రంప్‌నకు మద్దతుగా నిలిచి దాదాపు 118 మిలియన్ డాలర్లు(రూ.984 కోట్లు) రిపబ్లికన్ పార్టీకి విరాళంగా ఇచ్చారు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడి పీఠంపై కూర్చోబోతుండడంతో ఇప్పటివరకు పాలించిన ప్రత్యర్థులను ఉద్దేశించి తిరిగి మస్క్ వైట్‌హౌజ్‌ను తలిపించేలా సింక్‌తో ప్రవేశించిన ఫోటోను షేర్ చేస్తూ ‘లెట్ దట్ సింక్ ఇన్’ అని కామెంట్ రాశారు. మస్క్ 2022లో ట్విటర్(ప్రస్తుతం ఎక్స్)ను 44 బిలియన్ డాలర్ల(రూ.3.67 లక్షల కోట్లు)కు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment