రుణ పరిమితి పెంపు బిల్లు ఆమోదానికి లభించని మూడింట రెండొంతుల మెజారిటీ
174–235 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటన
వాషింగ్టన్: వచ్చే ఏడా ది మార్చి 14 వ రకు ఫెడరల్ ప్రభుత్వ వ్యయంపై ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకూలురు శుక్రవారం ఉదయం ప్రవేశపెట్టిన ప్రతిపాదనలను ప్రతినిధుల సభ తిరస్కరించింది. రుణ పరిమితి పెంచుతూ చేసిన ప్రతిపాదనల్ని సభలో ప్రవేశపెట్టగానే ఒక్క పెట్టున నిరసనలు చెలరేగాయి. హఠాత్తుగా తీసుకొచ్చిన ప్రతిపాదనల్ని ఆమోదించేది లేదని సభ్యులు ప్రకటించారు. బిల్లు ఆమోదానికి కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ లభించలేదు.
174–235 ఓట్ల తేడాతో వీగిపోయింది. అయితే, శుక్రవారం అర్ధరాత్రి తుది ప్రయత్నంగా తమ ప్రతిపాదనలను మరోసారి సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ప్రకృతి విపత్తులకు ఇచ్చే సాయం, రైతులకు ఆర్థిక సాయం కలిపి 110 బిలియన్ డాలర్లను బైడెన్ ప్రభుత్వం వ్యయ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, రుణ పరిమితి పెంచితేనే ఓకే చేస్తామని ట్రంప్ అనుకూ లురు అంటున్నారు. శుక్రవారంలోగా ఈ విషయంలో స్పష్టత రాకుంటే ప్రభుత్వ పాలన స్తంభించే ప్రమాదముంది.
Comments
Please login to add a commentAdd a comment