ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి! | First In 40 Years Trump Swearing In US Capitol Rotunda, Here's What To Know About Arrangements | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ప్రమాణ స్వీకారం.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి!

Published Sat, Jan 18 2025 9:38 AM | Last Updated on Sat, Jan 18 2025 10:30 AM

first in 40 years Trump swearing in US Capitol rotunda

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు అట్టహాసంగా పలు కార్యక్రమాలు ప్రారంభం కానుండగా 40 ఎళ్ల తరువాత ట్రంప్‌ సంప్రదాయానికి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్రంప్‌ జనవరి 20న(సోమవారం) అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ప్రమాణస్వీకార కమిటీ ఏర్పాటు ముమ్మరం చేసింది. అయితే, తీవ్రమైన మంచుతోపాటు రక్తం గడ్డకట్టే పరిస్థితులు నెలకొనడంతో  ప్రమాణ స్వీకారం అవుట్‌డోర్‌లో కాకుండా యుఎస్ క్యాపిటల్‌లోనే చేస్తున్నట్లు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్వీట్‌ చేశారు.

తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ‘ప్రమాణ స్వీకారం రోజైన సోమవారం నాడు వాషింగ్టన్‌లో విపరీతమైన చలి ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు కనిష్టంగా మైనస్ 12 డిగ్రీల సెల్సియస్ ఉండగా గరిష్టంగా మైనస్ 5 డిగ్రీల సెల్సియస్‌ను తాకే అవకాశం ఉంది. అందుకే నా ప్రారంభోత్సవ ప్రసంగం, అలాగే ఇతర ప్రసంగాలు అమెరికా క్యాపిటల్‌ భవనం రోటుండా లోపల జరుగుతాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గడ్డకట్టే ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఉష్ణోగ్రతలను తీవ్ర రికార్డు స్థాయికి చేరుకోనున్నాయి. వణికించే మంచు తుపానుతో ప్రజలు ఇబ్బది పడటం నాకు ఇష్టం లేదు’అని ట్రంప్‌ పేర్కొన్నారు. 1985లో మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా చలి తీవ్రత కారణంగా అమెరికా క్యాపిటల్‌ భవనం రోటుండా లోపలే చివరిసారిగా ప్రారంభోత్సవం జరిగిందని ట్రంప్ గుర్తు చేశారు.

మాజీ అధ్యక్షులంతా హాజరు 
సోమవారం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, కమలతో పాటు మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్, జార్జి డబ్ల్యూ.బుష్, బరాక్‌ ఒబామా కూడా పాల్గొంటారు. వీరిలో ఒబామా మినహా మిగతా వారంతా సతీసమేతంగా వస్తున్నారు. పలువురు దేశాధినేతలు, వీవీఐపీలు, ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. భారత్‌ తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా తరఫున ఉపాధ్యక్షుడు హాన్‌ జెంగ్‌ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.

అల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తో పాటు ఐటీ, ఇతర దిగ్గజ సంస్థల అధినేతలు కూడా హాజరవుతున్నారు. ఎలాన్‌ మస్క్, మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌), జెఫ్‌ బెజోస్‌ (అమెజాన్‌) రూపంలో ప్రపంచ కుబేరుల్లో ముగ్గురు వేదికపై కనిపించనుండటం విశేషం.ట్రంప్‌ హయాంలో అమెరికా టెక్‌ బిలియనీర్ల అడ్డగా మారనుందని బైడెన్‌ తాజాగా తన వీడ్కోలు సందేశంలో హెచ్చరించడం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement