(పాత ఫొటో)
న్యూయార్క్ : ప్రపంచానికి పెద్దన్నలాంటి డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో విడాకుల వ్యవహారం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడి పెద్దకొడుకు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భార్య వనెస్సా.. తక్షణమే విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. జూనియర్ ట్రంప్ అసలు కుటుంబానికి సమయం కేటాయించడంలేదని భార్య ఆరోపించారు. పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల పరిష్కారం కంటే ముందే తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఓ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
12 ఏళ్ల బంధం..5గురు సంతానం : పెద్ద ట్రంప్ మొదటి భార్య ఇవానాకు జన్మించిన తొలి సంతానం డొనాల్డ్ ట్రంప్ జూనియర్. ఇతను కూడా తండ్రి లాగే అమెరికాలో పేరు మోసిన బిజినెస్‌మేన్. టెలివిజన్ రంగంలోనూ రాణించారు. 2005లో వనెస్సాను పెళ్లాడారు. వీరికి ఐదుగురు పిల్లలు. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఆయన వ్యాపార సమ్రాజ్యాన్నిపిల్లలు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ట్రంప్ కుటుంబానికంటే వ్యాపారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సివస్తున్నదని, అందుకే వనెస్సా అసంతృప్తికి లోనైఉంటారని అమెరికన్ మీడియా పేర్కొంది. కాగా, కొడుకు-కోడలి మధ్య తలెత్తిన అంతరాలు, విడాకుల దరఖాస్తుపై ట్రంప్ కుటుంబం ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.
జూనియర్ ట్రంప్ ఫ్యామిలీ ఫొటో
Comments
Please login to add a commentAdd a comment