ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ | I think Donald J Trump will be the best president ever in US: Ram Gopal Varma | Sakshi
Sakshi News home page

ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ

Published Fri, May 6 2016 12:11 PM | Last Updated on Fri, Aug 24 2018 8:39 PM

ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ - Sakshi

ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ

ముంబయి: ప్రైమరీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. డోనాల్డ్ ట్రంపును తమ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అమెరికా కంపుకంపు అవడం ఖాయమని ప్రత్యక్షంగా ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్.. పరోక్షంగా పలువురు అంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ట్రంప్ ఎన్నిరకాల విమర్శలతో నిండిన వ్యాఖ్యలు చేశాడో.. ఎన్ని వివాదాల్లో కూరుకుపోయాడో తెలిసిందే.

అలాంటి వివాదాస్పద అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ఎప్పుడూ వివాదాస్పదంగా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. డోనాల్డ్ ట్రంప్ ఎందుకో అమెరికాలోనే గొప్ప అధ్యక్షుడిగా చరిత్ర లిఖిస్తాడని తనకు అనిపిస్తుందంటూ తన అభిప్రాయం చెప్పాడు. అమెరికా చరిత్రలో గొప్పవారైన జాన్ ఎఫ్ కెన్నడీ, అబ్రహం లింకన్ మాదిరిగా డోనాల్డ్ ట్రంప్ కూడా చరిత్రలో మిగిలిపోతారంటూ ఆయన ట్వీట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement