Abraham Lincoln
-
సమానత్వ సాధనను అడ్డుకునేందుకే...
ఏప్రిల్ 13న తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది. భౌతిక దాడులకు దిగి, ఎన్నికల రూపంలో చేయాల్సిన పోరాటాన్ని ఆయుధ పోరాటంగా మార్చిన వ్యక్తులు ఒక అనాగరిక సాంప్రదాయానికి మళ్ళీ తెరతీశారు. కేవలం ఆయనకు వున్న ప్రజాదరణ చూసి, మళ్లీ ముఖ్యమంత్రి కావచ్చునేమో అని ఓర్వలేక వారు అలా దాడి చేశారా? అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఇదే ఏప్రిల్ నెలలో హత్య కావించబడ్డారు. సామాన్య ప్రజలతో కలిసిపోయి వారిలో ఒకడిగా సంభాషణ చేయగల సామర్థ్యం, సాటి మనిషిపై సహానుభూతి ఆయన ప్రధాన లక్షణాలు. శ్వేత జాతీయుడయినప్పటికీ నల్ల జాతీయుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని సమానత్వం ప్రాతిపదికగా పునర్ నిర్మించాలని సంకల్పించారు. బానిసత్వ నిర్మూలన, ఆఫ్రికన్ అమెరికన్లకు భూమి హక్కులు, ఓటు హక్కు కల్పించడం అందులో ముఖ్యమైన అంశాలు. ఆధిపత్య శ్వేత జాతీయ దురహంకార రాష్ట్రాలు అంతర్యుద్ధం తీసుకువచ్చినా వెనకాడలేదు. ‘మనుష్యులందరూ సమానంగా సృష్టించ బడ్డారు’ అని నినాదమిచ్చారు. యూనియన్ విక్టరీ తరువాత శ్వేత జాతీయుల నాయకుడు రాబర్ట్ ఇ. లీ లొంగిపోయిన అయిదు రోజులకు 1865 ఏప్రిల్ 14న సాయంత్రం లింకన్ వాషింగ్టన్ డి.సి.లో నాటకం వీక్షించడానికి సతీ సమేతంగా వెళ్ళారు. జాన్ విల్కిస్ బూత్ అనే నటుడు, శ్వేతజాతి ఆధిక్యతావాది లింకన్‌ను వెనక నుండి అతి దగ్గరగా కాల్చాడు. మనుషులందరూ సమానమే అని లింకన్ చేసిన ప్రకటన, ఆయన చర్యలు, శ్వేతజాతి దురహంకారి అయిన జాన్ విల్కిస్ బూత్‌ను అలజడికి గురి చేశాయి. బానిసలు తమతో సమానంగా, ఆత్మ గౌరవంతో బతకడం అనే ఆలోచన నిద్ర లేకుండా చేసింది. లింకన్‌ను భౌతికంగా నిర్మూలిస్తే తప్ప నల్ల జాతీయులను అణిచి ఉంచలేమని అతనికీ, అతని తరఫు వారికీ అనిపించింది. జాన్ విల్కిస్ బూత్ కాల్చిన తూటా లింకన్ ప్రాణాలను బలి తీసుకొంది. 1865 ఏప్రిల్ 15న లింకన్ కన్నుమూశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ఒక సమాజం విద్యలో సాధించిన పురోగతే ఆ సమాజపు అభివృద్ధిని నిర్ణయిస్తుంది’ అంటారు. జగన్ ఆ సత్యాన్ని పట్టుకున్నారు. అందుకే తన దృష్టిని ప్రధానంగా విద్యపై కేంద్రీకరించారు. మనది ‘పేదవాడు పెత్తందారుపై చేస్తున్న పోరాటం’ అని నినాదం ఇచ్చారు. పేదవాళ్ళు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని సంకల్పించారు. డబ్బున్న వాళ్ళలాగే పేదవాళ్ళు కూడా విదేశాలకు చదువుల కోసం వెళ్లొచ్చని విదేశీ విద్యకు అవకాశం కల్పించారు. గుడ్లు పెట్టడానికంటే ముందే తల్లిపక్షి గూడు కడుతుంది. ఆ జాగ్రత్త స్త్రీ సహజ లక్షణం. అది గ్రహించినవాడు కనుకనే పిల్లలకు చదువు కోసం డబ్బులిచ్చినా, ఇళ్ల స్థలాలిచ్చినా జగన్ ఆ ఇంటి తల్లికి ఇస్తున్నారు. స్త్రీ పేరిట ఇస్తున్నారు. దీనినే స్త్రీవాదం అని మేధావులు పిలుస్తారు. ఏ రోగమో రొష్టో వచ్చినపుడు ఆసాముల దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వ రూపంలో ఆదుకుంటూ డబ్బున్నవాడి పక్క బెడ్డులోనే చికిత్స తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జగన్ చేపడుతున్న ప్రతి కార్యక్రమం, పేదవాడిని పెత్తందారుల సంకెళ్ళనుండి విడిపించేదే! అబ్రహాం లింకన్ సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా పేదలు గుండెల నిండా ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడితే పెత్తందార్లకు కడుపు మంట. ‘ఎవరయినా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా?’ అని హేళనగా మాట్లాడిన చంద్రబాబు లాంటివారికి, పెత్తందార్లకు కాపు కాసే నటులకు, వారికి మద్దతునిస్తూ భౌతిక దాడులకు దిగిన అనుయాయులకు, ప్రధానంగా జగన్ సమానత్వ ఎజెండా మీదే ఆక్రోశం. ఇది కాకతాళీయమే కావొచ్చు... నటుడు జాన్ విల్కిస్ బూత్ ఏప్రిల్ 14న లింకన్ మీద తూటా పేల్చాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో పెత్తందార్లు, నటులు... పేద ప్రజల నాయకుడు జగన్ మీదజుజ ఏప్రిల్ 13న రాయి విసిరారు. జాన్ విల్కిస్ బూత్ తూటా లక్ష్యం కేవలం లింకన్‌ను భౌతికంగా నిర్మూలించడం కాదు, లింకన్ సమానత్వ ఎజెండాను సమాధి చేయడం. అలాగే పేద ప్రజల పక్షపాతి జగన్ మీదకి ఈ పెత్తందార్లు విసిరిన రాయి లక్ష్యం జగన్‌ను కేవలం భౌతికంగా గాయపరచడం కాదు, ప్రగతి పథంలో సాగుతున్న జగన్ ప్రయత్నాన్ని స్తంభింపజేయడం! లింకన్ మరణం ఆఫ్రికన్ అమెరికన్ సమానత్వ ఆకాంక్షలను వంద సంవత్సరాలు ఆపగలిగింది. ఇప్పుడు ఈ పెత్తందారులు జగన్‌పై విసిరిన రాయి, మంచి చదువులు చదువుతూ అభివృద్ధి వైపు పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఏం చేస్తుందో చూడాలి! సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ప్రతికూలమూ అనుకూలమే!
ఎదురుదెబ్బలు తగిలితే మనం బెదిరి పోకూడదు; పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం చెదిరి పోకూడదు. ఏ పరిణామానికీ మనం బెదిరి పోకూడదు; ఏ పర్యవసానానికీ మనం చెదిరి పోకూడదు. బెదిరి పోయి భయపడుతూ ఉండడం జీవనం కాకూడదు; చెదిరి పోయి చతికిలపడి పోవడం జీవితం కాకూడదు. జీవనగతి ప్రగతిని, జీవితస్థితి అభ్యున్నతిని ΄పొందాలి. ‘ఇప్పుడు ఇది అంతం కాదు; ఇది అంతానికి ఆరంభం కూడా కాదు; కానీ ఇది ఆరంభానికి అంతం కావచ్చు’ అని విన్స్ టన్ చర్చిల్ చెప్పిన మాటల్ని ఆలోచనలోకి తీసుకుని ఎదురుదెబ్బలు తగిలినప్పడూ, పరిస్థితులు ప్రతికూలించినప్పుడూ మనం ప్రతిస్పందించాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడూ, ప్రతికూలమైన పరిస్థితులప్పడూ మన గతి అంతమై పోయిందనో, మనం ఇక ఇంతే అనో కాకుండా కొత్త ఆరంభానికి ఇది అంతం అయి ఉండచ్చు అన్న ఆశాభరితమైన ఆలోచనతో మనం భవిష్యత్తును చేపట్టేందుకు ఉద్యుక్తులం అవ్వాలి. ఎదిగినవాళ్లందరూ ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. ప్రయోజకులు అయిన వాళ్లందరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే. ఏ తరుణంలో అయినా మన తీరే మనకు మేలు చేస్తుంది, మనల్ని మేలైనవాళ్లను చేస్తుంది. ‘వర్తమాన క్షణాలలో ఉన్న దాన్ని అంగీకరించు నువ్వే దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా’ అని జర్మన్ తాత్త్వికుడు ఎక్‌హార్ట్ టోల్ సరైన సూచన చేశారు. తగిలిన ఎదురుదెబ్బల్ని , ప్రతికూల పరిస్థితుల్ని మనం అంగీకరించాలి. నిజానికి అవి మనం ఎంపిక చేసుకున్నవి కాక పోయినా జరిగాయి కాబట్టి వాటిని మనం అంగీకరించాలి. అంగీకరించకుండా మనల్ని మనం మభ్యపెట్టుకోవడంవల్ల, వాటి దెబ్బకు కుంగి పోవడం వల్ల మనం వాటిని అధిగమించలేం. వాటిని మనం అధిగమించి తీరాలి. ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించిన జీవితమే విజయవంతమైన జీవితం అవుతుంది. జీవితం అంటూ ఉన్నాక అది విజయవంతం అవ్వాలి. అబ్రహం లింకన్ 1831లో వ్యాపారంలో విఫలం అయ్యాడు. 1832లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయాడు. 1833లో వ్యా΄ారంలో మరోసారి విఫలమయ్యాడు. 1835 లో తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడ్డాడు. 1838 లో స్పీకర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1840లో ఎలక్టర్ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1843, 48లలో కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి పోటీ చేసి ఓడి పోయాడు. 1855 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1856లో ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1858 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. అబ్రహం లింకన్ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు; ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించినందుకు పొందిన విజయంగా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలిగితే ఏం సాధించవచ్చో అబ్రహం లింకన్ జీవితం తెలియజేస్తోంది. ప్రపంచచరిత్రలో ఇటువంటి ఉదంతాలు చాల ఉన్నాయి. ఎదురుదెబ్బలు, ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అవి ఉంటూనే ఉంటాయి. మనకు ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలన్న సంకల్పం, ప్రయత్నం బలంగా ఉండాలి. ఆశ, ఆకాంక్ష, ఆసక్తి ఈ మూడూ మనిషి ప్రగతికి, అభ్యున్నతికి ఎంతో ముఖ్యం. వీటికి తోడుగా లేదా ఊతంగా నమ్మకం అనేది ఉండాలి. ‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి...’ అంటూ సాగుతూ వేదంలో ఒక ప్రార్థన ఉంది. మనకు నమ్మకం కావాలి; మనం నమ్మకాన్ని నమ్ముకోవాలి. మన సంకల్పాన్ని, ప్రయత్నాన్ని నమ్ముకుని ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మనం రాణించాలి, రాజిల్లాలి. – రోచిష్మాన్ -
ప్రజాస్వామిక స్వేచ్ఛకు లింకన్ మార్గం
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వం వైపు పయనిస్తోంది. వివిధ దేశాల్లో అమలులో ఉన్న ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావు. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికే అధిక ప్రాధాన్యత. అయితే ఒక అధ్యయనం ప్రకారం ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు కూడా సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. ‘‘ఈ నేల నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కనుమరుగు కాకూడదు. ఈ జాతి నూతన స్వేచ్ఛకు జన్మనివ్వాలి. అందుకే ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కోసం పనిచేయాలి.’’ నవంబర్ 19, 1863న అమెరికాలోని గెట్టిస్బర్గ్ గడ్డమీది నుంచి చేసిన ప్రకటన ఇది. దాదాపు 157 ఏళ్ళనాడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాప్రభుత్వమంటే ఏమిటనే విషయాన్ని ప్రపంచానికి విడమర్చి చెప్పారు. అబ్రహాం లింకన్ ఈ ప్రకటన యుద్ధభూమి నుంచి చేసిన సింహ గర్జన. అమెరికా అంతర్యుద్ధం సమయంలో ఈ స్వేచ్ఛా నినాదాన్ని చ్చారు. లింకన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బానిస విధా నాన్ని రద్దు చేస్తూ చట్టం చేశారు. ఇది అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అమెరికా కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేసే స్థాయికి చేరింది. దీంతో దక్షిణ, ఉత్తర ప్రాంతాల విభజన జరిగి, అంతర్యుద్ధానికి దారితీసింది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఒక ప్రభుత్వం యుద్ధం చేయడం ఇదే చరిత్రలో మొదటిసారి, బహుశా చివరిసారి కూడా కావచ్చు. నల్లజాతి ప్రజలను బానిసత్వం నుంచి తప్పించ డానికి ఇటువంటి సాహాసోపేతమైన చర్యకు పూనుకున్న లింకన్ చరిత్రలో ఒక మహోన్నత స్థానాన్ని అలంకరించారు. అయితే ఆయన సాహసమే ఆయన హత్యకు కూడా కారణమైంది. ప్రజాస్వామ్యమంటే ఓటింగ్ జరగడం, ప్రతినిధులు ఎన్నిక కావడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమనే సాధారణ ప్రక్రియ కాదనే విషయాన్ని అబ్రహాం లింకన్ తేల్చి చెప్పారు. అందుకే లింక న్కు ముందు ఎందరెందరో సామాజికవేత్తలు, రాజనీతివేత్తలు ప్రజా స్వామ్యం గురించి ఎన్నో సూత్రీకరణలు చేసినప్పటికీ లింకన్ చేసిన వ్యాఖ్య ప్రపంచానికి ప్రామాణికమైంది. అందుకే నవంబర్ 19 ప్రజా స్వామ్య పునరుజ్జీవనానికి ఒక పునాది వేసింది. చరిత్రకారులు చెపుతు న్నట్టుగా, ప్రజాస్వామ్య భావన గ్రీకు తత్వవేత్తలు అరిస్టాటిల్, ప్లేటో లాంటి వాళ్ళ ఆలోచనల నుంచి పుట్టినప్పటికీ లింకన్కే ఆ గౌరవం దక్కింది. నిజానికి అరిస్టాటిల్, ప్లేటోలకు ముందే మన దేశంలో గౌతమబుద్ధుడు ప్రజాస్వామ్య సూత్రాలను ప్రబోధించాడు. అగ్గన్న సుత్త, కలామ సుత్త, వస్సకర సుత్తలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహ రించాలో, ప్రజల పాత్ర ఎట్లా ఉంటుందో, ఎట్లా ఉండాలో బుద్ధుడు సవివరంగా చెప్పాడు. కానీ మన దేశ చరిత్రకారులు, ప్రధానంగా బౌద్ధదమ్మ వ్యతిరేకులు బుద్ధుడిని ఒక మత ప్రభోదకుడిగా, అహింస, సత్యమనే చిన్న చిన్న విషయాలకు పరిమితం చేశారు. లిచ్చవి జన పదం గురించి వస్సకర సుత్తలో మాట్లాడుతూ, వారి పరిపాలనా విధానం ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో బుద్ధుడు వివరిస్తాడు. అయితే ఆధునిక చరిత్రలో వచ్చిన అనేక మార్పుల వల్ల ప్రజాస్వామ్య ఆలోచనలు చాలా ప్రగతిశీలంగా మారాయి. అటువంటి ఫలితమే మనకు లింకన్ మాటల్లో కనిపిస్తుంది. అయితే లింకన్‌కు జన్మనిచ్చిన అమెరికా గడ్డమీదే ప్రభుత్వాలు ఎటువంటి నిరంకుశ, ఆధిపత్య ధోర ణులతో తమ మనుషులు కానివారిని అణచివేస్తున్నామో చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ (ఇంటర్నేషనల్ ఐడియా) సంస్థ ప్రజాస్వామ్య తీరుతెన్ను లపై 2019లో అధ్యయనం జరిపింది. ప్రపంచంలో ఉన్న ఖండాల వారీగా, విడివిడిగా వివిధ దేశాల పనివిధానాలను ఇందులో సమీక్షిం చింది. ‘‘ప్రస్తుతం విభిన్న సంస్కృతులు, పరిస్థితులను కలిగి ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం వివిధ రూపాల్లో అమలు అవుతున్నది. ప్రపం చానికి మార్గదర్శనం చేసే నాయకత్వం లేదు. నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక ప్రధాన లక్ష్యంగా ఉన్నది. దానికోసం ఈ అధ్యయనం ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఆక్స్‌ఫామ్, ఇంటర్నేషనల్ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనయిమే ఈ నివేదికకు ముందుమాటగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పనితీరును అయిదు ప్రధాన అంశా లుగా విభజించారు. మొదటిది, ప్రాథమిక హక్కులు, రెండవది స్త్రీ సమానత్వం, మూడవది సంక్షేమం, నాలుగోది అవినీతి రహితం, ఐదవది మానవాభివృద్ధి సూచికలు. అంటే ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి ఎన్నికలు మాత్రమే పరమావ«ధి కావనేది దీనర్థం. ఇందులో ప్రజల భాగస్వామ్యం ఎట్లా ఉన్నదనే విషయానికి ఈ రిపోర్టు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు అన్ని రకాలుగా మార్గ దర్శకాలుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. అయితే, ఇండియాతో పాటు, అమెరికా, యూరప్‌లాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలుగా మార్కులు సంపాదించలేక పోయాయి. భారతదేశంలో ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆ నివేదిక సారాంశం. ప్రభుత్వం అనుసరి స్తున్న అభివృద్ధి నమూనాలను ప్రశ్నిస్తున్న సంఘాలను, సంస్థలను, వ్యక్తులను ప్రభుత్వం సహించని స్థితి ఉన్నదనీ; అందులో భాగంగానే విదేశీ సహాయ క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో తెచ్చిన మార్పులు, అనేక ప్రజాస్వామిక, స్వచ్ఛంద సంస్థలను పనిచేయలేని స్థితికి తెచ్చాయనీ ఈ నివేదిక అభిప్రాయపడింది. టర్కీ రచయిత, జర్నలిస్ట్ ఈస్ తెమెల్‌కురన్ రాసిన ‘హౌ టు లూజ్ ఎ కంట్రీ–ద సెవెన్ స్టెప్స్ ఫ్రమ్ డెమొక్రసీ టు డిక్టేటర్షిప్’ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంవైపు పయనిస్తున్నదని చెబుతోంది. అందుకు తెమెల్ కురన్ ఏడు అంశాలను ప్రస్తావించారు. అందులో మొదటిది, ప్రజ లకు అనవసరమైన విషయాలపై ఉద్యమ నిర్మాణం జరగడం, అసలు సమస్యలు పక్కదారి పట్టేవిధంగా ప్రజల దృష్టిని మళ్ళించడం; రెండవది, హేతుబద్ధమైన ఆలోచనలు కాకుండా, ప్రజల్లో మూఢ త్వాన్ని పెంచేందుకు శతవిధాలా ప్రయత్నం జరగడం; మూడవది, నిస్సిగ్గుగా వ్యవహరించే తత్వాన్ని ప్రజల మెదళ్ళలో చొప్పించడం, నాల్గవది, పాలనా వ్యవస్థలైన న్యాయ, రాజకీయ యంత్రాంగాలను ధ్వంసం చేయడం; ఐదవది, నాయకుల, సంస్థల అభిప్రాయాల ప్రకారం ప్రజల మనస్సులను తయారుచేయడం. ఆరవది, ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేస్తే అపహాస్యం చేయడం; ఏడవది, అంతిమంగా తాము ఆలోచించిన మూసలో యావద్దేశాన్ని పోత పోయాలనుకోవడం. ఈ ఏడు అంశాలు ఏ దేశంలో ఉన్నా ఆ దేశం తన ప్రజాస్వామ్యాన్ని కోల్పోతుందని తెమెల్‌కురన్ చెబుతున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలోని చాలా దేశాల్లో ఇటువంటి పార్టీలు, ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని తెమెల్‌కురన్ తేల్చి చెప్పారు. ఇది మన దేశానికి వర్తింపజేసి చూసుకుంటే, ఆ ప్రమాదం మనల్ని కూడా వెంటాడుతున్నది. ఇక్కడే వేళ్ళూనుకొని ఉన్న కుల వ్యవస్థ వల్ల సామాజిక ఆధిపత్యం, వివక్ష, విద్వేషం కొనసాగు తున్నాయి. ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని సమర్పిస్తూ, నవంబర్ 25న చేసిన చివరి ప్రసంగంలో ‘‘మన దేశం 1950, జనవరి 26వ తేదీ నుంచి వైరుధ్యంలోకి వెళుతున్నది. రాజకీయంగా సమానత్వం సాధించినప్పటికీ, సామాజిక, ఆర్థిక రంగాల్లో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని పరిష్క రించాలనుకుంటే, మన దేశం, మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడక తప్పదు’’ అని హెచ్చరించారు. అందుకుగానూ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను, ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 38, ఆర్టికల్ 46 ఈ దేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ కులాల, తెగల ప్రజల మధ్య ఉన్న అంతరాలను తొలగించే మార్గదర్శకాలు. కానీ వాటిని మన ప్రభుత్వాలు పట్టిం చుకునే స్థితిలో లేవు. పౌరహక్కుల నాయకుడు కె.జి.కన్నాభిరాన్ స్మారకోపన్యాసం చేస్తూ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మనకు హెచ్చరికగా, మార్గనిర్దేశంగా ఉంటాయి. ‘‘భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు. వాటిని అమలు చేయనంతవరకు మన దేశంలో సమానత్వం సిద్ధించదు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అన్నారాయన. ఆదేశిక సూత్రాల అమలును పర్యవేక్షిం చడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆయన చాలాసార్లు మాట్లాడారు. స్మారకోపన్యాసాన్ని ‘లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్’ అంటూ ముగించడం మనల్ని మేల్కొల్పడానికే ననడంలో అతిశయోక్తి లేదు. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు
న్యూయార్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌కు చెందిన కొన్ని వెంట్రుకలు, రక్తపు మరకల టెలిగ్రామ్ వేలం వేశారు. శనివారం జరిగిన వేలం పాటలో వాటిని 81వేల డాలర్ల( 60 లక్షల రూపాయలు)కు సొంతం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆర్ఆర్ ఆక్షన్ ఆఫ్ బోస్టన్ అనే సంస్థ ఈ వేలం పాటను నిర్వహించింది. జాన్ లిక్స్ బూత్ చేతిలో కాల్చి చంపబడిన తర్వాత లింకన్‌కు పోస్ట్‌మార్టమ్ నిర్వహిస్తున్నపుడు ఐదు సెంటీమీటర్ల పొడవుతో కొన్ని వెంట్రుకలు కత్తిరించి భద్రపరిచారు వైద్యులు. అనంతరం వాటిని 1865, ఏప్రిల్‌లో ఓ టెలిగ్రామ్ ద్వారా లింకన్ సహాయకుడికి పంపారు. ( అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ! ) ఆ తర్వాత వెంట్రుకలు, టెలిగ్రామ్ మాజీ అధ్యక్షుడి కుటుంబసభ్యుల వద్ద భద్రంగా ఉండింది. వీటిని 1999లో మొదటిసారి వేలం వేశారు. ఈ టెలిగ్రామ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. లింకన్‌కు ఆయన సెక్రెటరీ ఎడ్విన్ స్టాన్‌టన్‌కు మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని, ఆ కారణంగానే ఎడ్విన్, లింకన్ చంపించటానికి చూశాడన్న చరిత్ర కారుల వాదనను ఈ టెలిగ్రామ్ తప్పని నిరూపిస్తోంది. -
ఆత్మావలోకనం
నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీలేదు. నువ్వు ఇంటికి వెళ్తున్నావు. కారు యాక్సిడెంటయింది. భార్యనీ ఇద్దరు పిల్లల్నీ వదిలేసి వచ్చేశావు. నిన్ను కాపాడుదామని డాక్టర్లు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నీ శరీరం ముక్కలయింది. నన్ను నమ్ము. నీ ప్రాణం పోయిన మరుక్షణం నన్ను కలిశావు. ‘‘ఏం జరిగింది? నేనెక్కడున్నాను?’’ నేను నిజం చెప్పాను. ‘‘నువ్వు మరణించావు. మళ్లీ మళ్లీ అడగాల్సిన పనిలేదు.’’ ‘‘ఆ ట్రక్కు... ఆ ట్రక్కు... దూసుకువచ్చి.’’ ‘‘అవును.’’ ‘‘నేను చచ్చిపోయానా?’’ ‘‘విచారించకు. పుట్టిన ప్రతిమనిషీ చావక తప్పదు.’’ చుట్టూ చూశాడు మరణించిన మనిషి. అంతా శూన్యం. ‘‘ఈ చోటు ఏమిటి? జీవితం ముగిశాక వచ్చేది ఇక్కడికేనా?’’ ‘‘దాదాపు అంతే!’’ ‘‘నువ్వెవరివి? దేవుడివా?’’ ‘‘అలాగే అనుకో.’’ ‘‘నా పిల్లలు... నా భార్య’’ ‘‘వాళ్లతో పనేమిటి?’’ ‘‘వాళ్లు క్షేమంగా ఉంటారా?’’ ‘‘వాళ్లు క్షేమంగా ఉండాలని నేనూ అనుకుంటున్నా. నువ్వు ఇప్పుడే మరణించావు గనక నీ ఆలోచనలు నీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి.’’ మరణించిన మనిషి తన ఎదురుగ్గా ఉన్న ఆకారం వైపు చూశాడు. అతడు దేవుడిలా కనపడలేదు. ఒక మామూలు మనిషిలా కనిపించాడు. ఒక ఆడమనిషిలా కనిపించాడు. ఒక అస్పష్టమైన రూపంలా కనిపించాడు. దేవుడిలా కాకుండా గ్రామర్ స్కూల్ టీచర్లా కూడా కనిపించాడు. ‘‘పెళ్లాం పిల్లల గురించి బాధపడకు. నీ సంతానం నిన్నొక మంచి మనిషిగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్లది నీ పట్ల కోపంగానీ ద్వేషంగానీ ఉండే వయస్సు కాదు. నీ భార్య పైకి దుఃఖిస్తుందేమో గానీ ఎలాగూ మీ పెళ్లి ‘బ్రేక్’ అవబోతున్నది కనుక ఆమెకు ఇది ఉపశమనమే. మహా అయితే కొంచెం విచారిస్తుందేమో!’’ ‘‘ఇప్పుడేం జరుగుతుంది? నేనెక్కడికి వెళ్తాను? స్వర్గానికా, నరకానికా?’’ ‘‘ఎక్కడికీ వెళ్లవు. మళ్లీ పుడ్తావు.’’ ‘‘ఆ... అంటే... అదే కరెక్టా. హిందువులు చెప్పేదే నిజమా?’’ ‘‘అన్ని మతాలూ వాటి పద్ధతుల్లో కరెక్టే. నాతోరా!’’ మరణించిన మనిషి ఆ ఆకారాన్ని అనుసరించాడు. ‘‘మనం ఎక్కడికి వెళ్తున్నాం?’’ ‘‘ఫలానా చోటనేం లేదు. మాట్లాడుతూ నడుద్దాం, బాగుంటుంది.’’ ‘‘నేను మళ్లీ పుడితే... మళ్లీ అన్నీ మొదట్నించీ అనుభవించాలా?’’ ‘‘అన్ని గత జన్మలలోనూ నువ్వు సంపాదించిన జ్ఞానమూ అనుభవమూ నీ లోపలే ఉంటాయి. కానీ వాటిని నువ్వు గుర్తుచేసుకోలేవు’’ అంటూ మరణించిన మనిషిని ఆ ఆకారం తన భుజం మీద వేసుకుంది. ‘‘నీ ఆత్మ ఎంత గొప్పదో ఎంత అందమైనదో నువ్వు ఊహించలేవు. నువ్వు ఏమిటి అనేది నీ మెదడుకి ఒక బిందుమాత్రంగానే తెల్సి ఉంటుంది. అది నువ్వు గ్లాసు నీళ్లల్లో వేలు పెట్టి అవి వేడిగా ఉన్నాయో చల్లగా ఉన్నాయో చూడటం లాంటిది. గత నలభై ఎనిమిది యేళ్ల నుంచి మనిషిగా ఉన్నావు. అయినా నీ లోపల ఉన్న చైతన్య శక్తి గురించి నీకు తెలీదు. చాలాకాలం పాటు నాతో ఉంటే నీకది తెలుస్తుంది. కానీ జన్మ జన్మకీ మధ్య అంత తీరికా అవకాశమూ దొరకదు నీకు.’’ ‘‘నేను ఎన్నిసార్లు పుట్టి ఉంటాను?’’ ‘‘అనేకసార్లు. వేల సార్లు. అనేక రూపాల్లో. ఈసారి నువ్వు చైనాలో ఓ రైతుకి బిడ్డగా పుడ్తావు అదీ 540 ఎ.డి.లో.’’ ‘‘ఆగాగు. ఏమిటీ? నువ్వు నన్ను కాలంలో వెనక్కి పంపుతావా?’’ ‘‘అవును. సాంకేతికంగా కాలం అనేది మీ ప్రపంచంలోనే ఉంటుంది. నేను ఎక్కడ్నుంచి వచ్చానో అక్కడ అది వేరుగా ఉంటుంది.’’ ‘‘నువ్వు ఎక్కడ్నించి వచ్చావో చెప్తావా?’’ ‘‘తప్పకుండా. నేను ఎక్కడ్నించి వచ్చానో అక్కడ నాలాంటి వాళ్లు ఉన్నారు. అక్కడ ఎలా ఉంటుందో తెల్సుకోవాలని ఉందికదా నీకు. కానీ సూటిగా చెప్పాలంటే అది నీకు అర్థం కాదు.’’ ‘‘కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో నేను మళ్లీ మళ్లీ జన్మించి ఉంటే ఇదివరకు ఎప్పుడో నేను నీతో మాట్లాడి ఉంటానే.’’ ‘‘మాట్లాడే ఉంటావు. కానీ ఏ జన్మలోనూ నీ జీవితకాలంలో ఏం జరుగుతున్నదో నీకు తెలియదు.’’ ‘‘అంటే? జీవితానికి అర్థం ఏమిటి?’’ ‘‘సీరియస్‌గా అడుగుతున్నావా? ఇదొక రొటీన్ ప్రశ్న.’’ ‘‘కాదు. నా ప్రశ్నకు జవాబు కావాలి.’’ ‘‘నేను ఈ సమస్త విశ్వాన్ని ఎందుకు చేశానో, జీవితానికి అర్థం ఏమిటో తెల్సుకోవడానికి మానసిక పరిపక్వత ఉండాలి. నీకది లేదు.’’ ‘‘అంటే? మానవజాతికా? మానవజాతి ఇంకా పరిపక్వత చెందలేదా?’’ ‘‘మానవజాతి కాదు. నువ్వు! ఈ విశ్వాన్నంతటినీ నీ కోసమే చేశాను. నీ కోసం మాత్రమే. ప్రతి కొత్త జన్మలో నువ్వు మానసికంగా పరిపక్వం అవుతూవుంటావు.’’ ‘‘నేను మాత్రమేనా? మరి మిగిలినవాళ్లంతా?’’ ‘‘ఇంకెవరూ లేరు. ఆ విశ్వంలో నువ్వూ నేనూ అంతే.’’ మరణించిన మనిషికి అర్థం కాలేదు. ‘‘కానీ భూమ్మీద ఇంతమంది మనుషులు ఉన్నారు కదా?’’ ‘‘అందరూ నువ్వే. అన్ని రూపాలూ నీవే.’’ ‘‘ఏమన్నావు? అందరూ నేనేనా? ఈ భూమ్మీద జీవించిన వాళ్లంతా నేనేనా? ప్రతి ఒక్కరూ నేనేనా?’’ ‘‘కాక. నువ్వే. అందరూ నువ్వే.’’ ‘‘అబ్రహం లింకన్ని నేనేనా?’’ ‘‘జాన్ వల్కస్ బూత్వి కూడా నువ్వే’’ (లింకన్‌ను హత్య చేసిన అమెరికా నటుడు. ‘‘హిట్లర్ని కూడా.’’ ‘‘హిట్లర్ చంపిన లక్షలాది మందివి కూడా నువ్వే.’’ ‘‘జీసస్‌ని కూడా నేనేనా?’’ ‘‘ఆయనని అనుసరించిన వాళ్లందరూ నువ్వే.’’ మరణించిన మనిషి మౌనంగా ఉండిపోయాడు. ‘‘జన్మించిన ప్రతిసారీ నువ్వు ఎవరో ఒకరిని బలిపశువుని చేశావు. లేదా నువ్వే బలిపశువువి అయ్యావు. ఏ మనిషి అయినా అనుభవించిన సుఖమూ దుఃఖమూ అనుభవించబోయే ఆనందమూ విషాదమూ నువ్వే అనుభవిస్తావు.’’ ‘‘ఎందుకు? ఎందుకిదంతా?’’ ‘‘ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు నాలా మారిపోవడానికి. నువ్వున్నది నాలా మారడానికే. నువ్వు నా జాతివాడివి. నువ్వు నా సంతానానివి.’’ ‘‘ఏమిటీ విచిత్రం? అంటే నువ్వే కాదు నేను కూడా దేవుడినా?’’ ‘‘కాదు. ఇంకా కాలేదు. నువ్వు పిండానివి. నువ్వు ఇంకా పెరుగుతూనే ఉన్నావు. మళ్లీ మళ్లీ మరణించి మళ్లీ మళ్లీ పుట్టి మానవ జీవితాలన్నీ అనుభవించాక... అప్పుడు దేవుడివవుతావు. ఈ విశ్వమంతా కేవలం ఒక అండం మాత్రమే. నువ్వు మరో జన్మలోకి ప్రయాణం చేయాల్సిన సమయం అయింది’’ అంటూ ఆ ఆకారం మరణించిన మనిషిని మరో జన్మలో ప్రవేశపెట్టింది. -
రెడీ టు ఫైట్
ఫస్ట్ అనేది ఏదైనా సాధారణంగా అది యు.ఎస్.లోనే జరుగుతుంటుంది. అయితే యు.ఎస్.లో స్టేట్ గవర్నర్‌గా ఇంతవరకూ ఒక నల్లజాతి మహిళ ఎన్నిక కాలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్టేసీ అబ్రహాం అనే నల్లజాతి మహిళ ఏడాది జార్జియా మధ్యంతర ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఆమె కనుక గెలిస్తే యు.ఎస్.లో తొలి నల్లజాతి మహిళా గవర్నర్ అవుతారు. స్టేసీ మాజీ న్యాయవాది, డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు. ప్రస్తుతం జార్జియా ప్రైమరీ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కనుక ఆమె తగినంత మెజారిటీ సంపాదిస్తే, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో గవర్నరుగా పోటీ చేయవచ్చు. ఇప్పటికే ఈమెకు హిల్లరీ క్లింటన్, కమలా హ్యారిస్ వంటి మహిళా ఉద్దండులు మద్దతు ప్రకటించారు. యేల్ యూనివర్సిటీలో చదువుకున్న స్టేసీ.. తనకు అవకాశం ఇస్తే జార్జియాలో మంచి ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు, సగటు పౌరులకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యను, శిశు సంరక్షణ అందించేందుకు, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. విశేషం ఏంటంటే స్టేసీకి పోటీగా అదే పేరుగల స్టేసీ ఇవాన్స్ అదే డెమొక్రాటిక్ పార్టీ తరఫున నిలబడటం! ఇవాన్స్ అచ్చమైన అమెరికా అమ్మాయి. స్టేసీ అబ్రహాం ఆఫ్రో–అమెరికన్. చూడాలి జార్జియా ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో. -
11 ఏళ్లకే 'మగాళ్లు' అయ్యారు..!
సాక్షి, ప్రత్యేకం: 'సంపాదించడం పురుష లక్షణం' అనేది సామెత. 11 ఏళ్ల వయసులోనే భారీగా సంపాదిస్తున్న ఇద్దరు పిల్లలు తాము 'మగాళ్ల' అయ్యామని అంటున్నారు. పదకొండేళ్ల ప్రాయంలో సాధారణ పిల్లలు ఏం చేస్తారు?. స్కూల్‌కు వెళ్తారు. ఆడి పాడతారు. కానీ, ఇంగ్లండ్‌లోని ఎసెక్స్ కౌంటీకి చెందిన అబ్రహం, జానీ మాత్రం అందుకు భిన్నం. ఇరువురికీ ఓ లక్ష్యం ఉంది. 'కేజ్ ఫైటర్స్' అవ్వాలనేది వారి ఆశ. అందుకోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ ఆరంభించేశారు. వారి తండ్రి చేసే పనిలో సాయపడుతూ, గుర్రాలు, కార్ల అమ్మక వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. వచ్చిన డబ్బును సొంతగా జిమ్ నిర్మించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ కిడ్స్ గురించి అమెరికాలోని ఓ టీవీ చానెల్ Gypsy Kids అనే ప్రోగ్రామ్‌ను కూడా చేసింది. ఆ చానెల్‌తో మాట్లాడిన అబ్రహం.. తాము 'మగాళ్లు'గా మారామని అనిపిస్తుందని చెప్పాడు. ప్రస్తుతం తాము స్కూల్‌కు వెళ్తూనే సంపాదిస్తున్నామని తెలిపాడు. వాళ్ల తాతయ్య నుంచి గుర్రాలు, కార్ల అమ్మకం ఎలా చేయాలో నేర్చుకున్నామని వెల్లడించాడు. తమకు ఐదేళ్ల వయసున్నప్పుడు ఓ కేజ్ ఫైటర్‌ను చూసి స్ఫూర్తి పొందామని, తాము కూడా కేజ్ ఫైటర్స్‌గా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు అబ్రహం. -
డివీలియర్స్ కొడుకా.. మజాకా!
-
స్లాస్, త్రీఆర్ పరీక్షలను సమర్థంగా నిర్వహించండి
కంబాలచెరువు : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న 'స్లాస్' 'త్రీ ఆర్ 'పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని రాజమహేంద్రవరం ఉపవిద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం తెలిపారు. స్థానిక కోటగుమ్మం వద్ద నున్న మండలవనరుల కేంద్రంలో ఉపాధ్యాయుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు చదవడం, రాయడం, గణితభావనల స్థాయిని అంచనావేసేందుకు ఈ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రాలను పరీక్షకు ఒక గంటముందు ఆయా స్కూల్‌కాంప్లెక్స్‌లనుంచి తీసుకోవాలన్నారు. స్కూలు కాంప్లెక్స్ చైర్మన్లు వారి పరిధిల్లోని అన్ని స్కూల్స్ పరీక్షించి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రశ్నాపత్రాలు తక్కువ అయినచో మండలవిద్యాశాఖాధికారిని సంప్రదించాలని, ఎట్టిపరిస్థితుల్లో జిరాక్స్ తీయరాదన్నారు. కార్యక్రమంలో అర్బన్ స్కూల్స్ డీఐ అయ్యంకి తులసీదాస్, వై.వేణుగోపాలరావు, శ్రీనివాస్, ప్రసాద్, నీలిమ, ఇందిర, కుమారి పాల్గొన్నారు. పరీక్షలు వాయిదా భానుగుడి(కాకినాడ) : జిల్లాలో ప్రాథమిక పాఠశాలల్లో ఈ నెల 14,15 తేదీలలో జరగాల్సిన స్లాష్, త్రీఆర్‌ఎస్ పరీక్షలను ఈనెల 16,17 తేదీలకు వాయిదా వేసినట్టు డీఈఓ ఆర్.నరసింహారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంఈవోలకు పంపామని, ఈనెల 15న ఎంఈవోలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు పరీక్షలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. శాంపిల్ సర్వే పాఠశాలలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు డీసీఈబీల ద్వారా ఎంఈవోలకు పంపనున్నట్టు తెలిపారు. -
రెండు లేవు... ఉన్నది ఒక్కటే మనసు
యువతరానికి నేను చెప్పేదొకటే... చిన్న చిన్న కష్టాలకు విచలితులైపోకండి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడడం, సూక్ష్మ బుద్ధితో వాటినుంచి తప్పుకోవడం అలవాటు చేసుకోండి. ప్రణాళికా బద్ధంగా జీవించండి. ఇటువంటి లక్షణాలుంటే మీరు రాణించగలరు. మీతో ఈ దేశానికి నవశకం ప్రారంభం కావాలి. అబ్రహాం లింకన్ జీవితంలో ఒకానొకసారి ఒక అవమానకర సంఘటన జరిగింది. ఆయన అమెరికా అధ్యక్షుడయిన కొత్తల్లో దేశంలో పెట్టుబడుల్ని పెంచడానికి ధనవంతుల్ని, పారిశ్రామికవేత్తలను సమావేశపరచి అధ్యక్షోపన్యాసం చేయబోతున్నాడు. అసూయ అనే దిక్కుమాలిన గుణం కొందరిలో ఉంటుంది. వారు వృద్ధిలోకి రాలేరు, తెలిసినవారు వస్తే చూసి ఓర్వలేరు. వీలయినప్పుడల్లా వారిని బాధపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అబ్రహాం లింకన్ దేశాధ్యక్షుడయ్యాడని ఓర్వలేని ఓ ఐశ్వర్యవంతుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాలనుకుని లేచి కాలికున్న బూటుతీసి ఎత్తిపట్టుకుని ‘‘లింకన్! నువ్వు చాలా గొప్పవాడిననుకుంటున్నావ్, దేశాధ్యక్షుడినని అనుకుంటున్నావ్. మీ తండ్రి మా ఇంట్లో అందరికీ బూట్లుకుట్టాడు. ఇదిగో ఈ బూటు కూడా మీ నాన్న కుట్టిందే. నాకే కాదు, ఈ సభలో ఉన్న చాలామంది ఐశ్వర్యవంతుల బూట్లు కూడా ఆయనే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకువి. అది గుర్తుపెట్టుకో. అదృష్టం కలిసొచ్చి ఆధ్యక్షుడివయ్యావ్. ఈ వేళ మమ్మల్నే ఉద్దేశించి ప్రసంగిస్తున్నావ్’’ అన్నాడు. లింకన్ ఒక్క క్షణం నిర్లిప్తుడయిపోయాడు. నిజానికి ఆయన ఉన్న పరిస్థితిలో వెంటనే పోలీసుల్ని పిలిచి తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు. కానీ అదీ సంస్కారం అంటే.. అదీ సంక్షోభంలో తట్టుకుని నిలబడడమంటే... అదీ తుఫాన్ అలను చాకచక్యంగా తప్పించుకోవడమంటే... లింకన్ వెంటనే తేరుకుని ఆ వ్యక్తికి శాల్యూట్ చేస్తూ ‘‘ఇంత పవిత్రమైన సభలో నా తండ్రిని గుర్తుచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజమే, నా తండ్రి బూట్లు కుట్టిన మాట వాస్తవమే. మీవి, మీ ఇంట్లోవారి బూట్లను కూడా కుట్టాడు. అలాగే ఈ సభలో కూడా ఎందరివో కుట్టాడు. నా తండ్రి వృత్తిని దైవంగా స్వీకరించి చేసినవాడు. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నా. మా తండ్రి బూట్లు కుడితే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి తప్ప పాదం సైజుకన్నా ఎక్కువ తక్కువలు ఉండవు. ఒకవేళ మా తండ్రి కుట్టిన బూట్లలో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పండి. నా తండ్రి నాకు కూడా బూట్లుకుట్టడం నేర్పాడు. నా తండ్రికి అప్రతిష్ఠ రాకూడదు. అందువల్ల నేను మీ ఇంటికొచ్చి ఆ బూట్లు సరిచేసి వెడతాను. ఈ సభలో మా నాన్నగారిని గుర్తుచేసినందుకు మీకందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఆనందబాష్పాలతో నా ప్రసంగం మొదలుపెడుతున్నా’’ అన్నాడు. అంతే! ఆయన్ని నలుగురిలో నవ్వులపాలు చేద్దామనుకున్న వాళ్ళు సిగ్గుతో తలవంచుకున్నారు. ఇదీ ధైర్యంగా జీవితాన్ని కొనసాగించడమంటే. ఇదీ.. మనల్ని ముంచడానికి వచ్చిన అలమీద స్వారీ చేయడమంటే. పాఠాలతోపాటూ పిల్లలుగా ఇవీ జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన మెళకువలు. ఒక మనిషిలో వచ్చిన ఒక చిన్న ఆలోచన ఆ తరువాత అతని భవిష్యత్తునే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను కూడా ఎలా ప్రభావితం చేస్తుందనేదానికి ఉదాహరణ - మన ధీరూబాయ్ అంబానీనే. ఆయన తండ్రి కేవలం ఒక ఉపాధ్యాయుడు. మొదట్లో బజ్జీలమ్ముకునేవాడు. తరువాత యెమెన్ లాంటి దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేశాడు. ఒక గ్యాస్ ఏజెన్సీలో సహాయకుడిగా చేశాడు. రు.50 వేల పెట్టుబడితో మొదట ఒక కాటన్ ఫ్యాక్టరీని ప్రారంభించాడు. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంబానీకి ఆదర్శం ఎవరో తెలుసా! ఒక చీమ. అది నిరంతరం కష్టపడుతుంది. మనం బాగుపడాలని అనుకోవాలే గానీ మనకు ఆదర్శంగా చాలా కనిపిస్తాయి. కష్టపడి బతకడమంటే ఏమిటో చీమను చూసి నేర్చుకోవాలి. ధీరూబాయి కూడా ఒక్క క్షణం వృథా చేయలేదు. నియమబద్ధమైన జీవితం గడిపారు. అంతదాకా ఎందుకు! మీరు పది గంటలకు ఒక చోటికి వెళ్ళాలి. అరగంట ప్రయాణమని తెలుసు. అటువంటప్పుడు పది నిమిషాలు తక్కువ పదికి ఎందుకు బయల్దేరాలి? బయల్దేరిన దగ్గరినుంచి హారన్ మీద బొటనవేలు ఎందుకు పెట్టి ఉంచాలి? ఎందుకంత స్పీడు? బండి నడుపుతూ ఎందుకా సెల్ఫోన్లో మాటలు? మీకు రెండు మనసులు లేవు. ఉన్నది ఒకటే. ఉన్న ఆ ఒక్క మనసు సెల్‌ఫోన్ వింటూంటే రోడ్డుమీద మీకు ఎదురుగా వచ్చేవారిని గురించి పట్టించుకోవడానికి మరో మనసు లేదు కదా! ప్రమాదం అనేది ఎంతసేపట్లో జరుగుతుంది? ఒక్క క్షణం... మనసు మీ దగ్గరలేని ఆ ఒక్క క్షణం... జీవితాల్ని ఎంత భయంకరం చేసేస్తుందో... క్షణం ఆలోచించండి. -
వర్గీకరణ జరిగితే ఊరికో లింకన్: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ జరిగితే చర్మకారుల కుటుంబాల నుంచి ఊరికో అబ్రహం లింకన్ పుట్టుకొస్తారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన శుక్రవారం 18 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. పాదరక్షలు తరతరాలుగా మాదిగలకు, ఉప కులాలకు జీవనోపాధిగా మారాయని చెప్పారు. చెప్పులు కుట్టే అబ్రహం లింకన్ అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అయ్యారన్నారు. అవకాశం వస్తే చెప్పులు కుట్టే చేతులు చరిత్ర సృష్టిస్తాయని, అవకాశాలు దోపిడీకి గురైన చోట అణిచివేతే తప్ప అభివృద్ధి ఉండదని వ్యాఖ్యానించారు. కాగా, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దళిత్ స్టూడెంట్ యూనియన్ జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ఒక రోజు దీక్ష చేపట్టింది. -
ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ
ముంబయి: ప్రైమరీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. డోనాల్డ్ ట్రంపును తమ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అమెరికా కంపుకంపు అవడం ఖాయమని ప్రత్యక్షంగా ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్.. పరోక్షంగా పలువురు అంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ట్రంప్ ఎన్నిరకాల విమర్శలతో నిండిన వ్యాఖ్యలు చేశాడో.. ఎన్ని వివాదాల్లో కూరుకుపోయాడో తెలిసిందే. అలాంటి వివాదాస్పద అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ఎప్పుడూ వివాదాస్పదంగా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. డోనాల్డ్ ట్రంప్ ఎందుకో అమెరికాలోనే గొప్ప అధ్యక్షుడిగా చరిత్ర లిఖిస్తాడని తనకు అనిపిస్తుందంటూ తన అభిప్రాయం చెప్పాడు. అమెరికా చరిత్రలో గొప్పవారైన జాన్ ఎఫ్ కెన్నడీ, అబ్రహం లింకన్ మాదిరిగా డోనాల్డ్ ట్రంప్ కూడా చరిత్రలో మిగిలిపోతారంటూ ఆయన ట్వీట్ చేశారు. I think Donald J Trump will be the best president ever in US history including John F Kennedy and Abraham Lincoln — Ram Gopal Varma (@RGVzoomin) 5 May 2016 -
స్వేచ్ఛ కోసం.. అమెరికా అంతర్యుద్ధం!
ప్రపంచదేశాల్లో అగ్రరాజ్యం ఏదంటే తడుముకోకుండా వచ్చే సమాధానం అమెరికా. అలాంటి దేశ చరిత్రలో కీలక పరిణామం 1861- 65 అంతర్యుద్ధం. అబ్రహాం లింకన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఈ యుద్ధంతోనే అమెరికాలో బానిసత్వం పూర్తిగా అంతరించిపోయింది. ప్రతి మనిషికీ స్వేచ్ఛ ఉండాలనేదే ఈ యుద్ధ లక్ష్యం. ఈ పోరాటం జరగకపోతే అమెరికాలో బానిసత్వం ఇప్పటికీ అంతమయ్యేది కాదేమో..! అంతటి చారిత్రక నేపథ్యం, ప్రయోజనం ఉన్న యుద్ధం, దాని కథాకమామిషు ఏంటో చూద్దాం..! అమెరికాలో బానిసత్వం 1619లో మొదలైంది. అప్పుడు అమెరికా బ్రిటన్ పరిపాలనలో ఉండేది. ఆఫ్రికా నుంచి తీసుకువచ్చిన బానిసల్ని పొగాకు పండించడానికి ఉపయోగించేవారు. 1860 నాటికి వీరి సంఖ్య 40 లక్షలకు చేరింది. అమెరికా దక్షిణ భాగంలోని జనాభాలో మూడో వంతు బానిసలే ఉండేవారు. దయనీయ పరిస్థితులు... బానిసలందర్నీ ఇరుకు గదుల్లో బంధించేవారు. వారికి సరైన ఆహారం, వసతులు కల్పించేవారు కాదు. ఒక్కో యజమాని దగ్గరా 50 మంది బానిసలు ఉండేవారు. బానిసలు చదువుకోవడంపై నిషేధం ఉండేది. బానిస స్త్రీలపై యజమానులు లైంగిక దాడులు చేసేవారు. ఎదురు తిరిగిన వారికి కఠినమైన శిక్షలుండేవి. బానిస వివాహాలకు చట్టబద్ధత లేదు. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా వారిపై ఒత్తిడి తెచ్చేవారు. ఎంత ఎక్కువ మందిని కంటే యజమానికి అంత ఎక్కువ లాభం. ఇదీ నేపథ్యం... బానిసత్వాన్ని రద్దు చేయాలని 1830 నుంచే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1850 మెక్సికో ఒప్పందంలో బానిసల అంశాన్ని విస్మరించాక ఈ ఉద్యమం మరింత వేడెక్కింది. 1857లో అమెరికా సుప్రీం కోర్టు ఆఫ్రో-అమెరికన్లు అమెరికా దేశ పౌరులు కారని వివాదాస్పద తీర్పునిచ్చింది. 1859లో జాన్ బ్రౌన్ అనే ఉద్యమకారుడు వర్జీనియాలోని హార్పర్ రేవుపై దాడి చేయడంతో అతనికి మరణ శిక్ష విధించారు. ఉద్యమకారులు అతడ్ని జాతి కోసం మరణించిన వీరుడిగా గుర్తిస్తే, దక్షిణ ప్రాంతంవారు అతడిపై కిరాయి హంతకుడిగా ముద్ర వేశారు. రక్త చరిత్ర... 1861 అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగానే బానిసలు అధికంగా ఉన్న ఏడు దక్షిణ రాష్ట్రాలు సమాఖ్యగా ఏర్పడి తమని తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నాయి. అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న జేమ్స్ బుకానన్ దీన్ని చట్ట వ్యతిరేక చర్యగా ప్రకటించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అదే ఏడాది మార్చి 4న అబ్రహాంలింకన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వెనువెంటనే ఈ చర్యని తిరుగుబాటుగా పరిగణించాడు. 75 వేల మంది సైనికులను 90 రోజుల పాటు తాత్కాలికంగా నియమించాలని ఆదేశాలు జారీ చేశాడు. మూడు నెలల్లో అంతర్యుద్ధాన్ని అణచివేయగలనని ఆయన భావించారు. ఇంతలో మరో నాలుగు రాష్ట్రాలు సమాఖ్యలో చేరాయి. పశ్చిమ తీరంలో జరిగిన యుద్ధంలో గెలుపొందటం అమెరికాకు పెద్ద ఊరట. కానీ తూర్పు వైపు వర్జీనియాలో జరిగిన యుద్ధంలో మాత్రం ఓడిపోయింది. సైన్యాన్ని మోహరించినప్పటికీ యుద్ధవ్యూహాల అమలులో వైఫల్యంపై లింకన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పు వైపు దాడుల్లో 23 వేల మంది సైనికులను అమెరికా కోల్పోయింది. 1862 జులై ఒకటిన 17 లక్షల మంది సైనికులు, తిరుగుబాటుదారుల మధ్య నాలుగు రోజుల తీవ్ర యుద్ధం అనంతరం వర్జీనియా అమెరికా సొంతమైంది. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన అంతర్యుద్ధం 1865లో ముగిసింది. ఈ యుద్ధంలో ఇరుపక్షాల నుంచి దాదాపు 6,20,000 మంది మరణించారు. నాలుగు లక్షల మంది పైగా గాయపడ్డారు. యుద్ధ సమయంలో ద్రవ్యోల్బణం ప్రభావంతో ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల ఆకలి కేకలు మిన్నంటాయి. కొత్త చరిత్ర... అమెరికా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ తీర్మానం 1865, జనవరి 31న వెలువడింది. అమెరికా పరిధిలో బానిసత్వాన్ని రద్దు చేస్తూ 13వ రాజ్యాంగ సవరణను లింకన్ అధ్యక్షతలోని ప్రభుత్వం ఆమోదించింది. అంతకు ముందు 1864లో జరిగిన ఎన్నికల్లో లింకన్ ఐదు లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలుపొందాడు. 1868లో జరిగిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో పుట్టిన వారందరికీ సమాన హక్కులుంటాయని ప్రభుత్వం తీర్మానించింది. అలా శ్వేతజాతీయేతరులపై ఏర్పడిన ఆంక్షలు క్రమంగా తొలగిపోయాయి. బరాక్ ఒబామా 2009లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి శ్వేతజాతీయేతరుడిగా చరిత్ర సృష్టించారు. -
నల్లజాతి ‘తెల్ల’గొడుగు
లింకన్ రాజకీయ జీవితం బానిసత్వ వ్యతిరేక చింతనతోనే మొదలైందని విశ్లేషకుల అభిప్రాయం. 1837 నుంచి, తుది శ్వాస విడిచే వరకు ఆయన బానిస వ్యతిరేక ఉద్యమాన్ని, నిజానికి యుద్ధాన్ని నడిపాడు. తన 28 ఏళ్ల వయసులోనే ఇలినాయీస్ జనరల్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా మొట్టమొదటిసారి తన బానిసత్వ వ్యతిరేక విధానాన్ని ప్రకటించాడు. బానిస వ్యవస్థ అన్యాయమే కాక, దుర్మార్గమైన విధానమని, బానిసత్వం పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండడం మరింత అనైతికమని నినదించారు. పరీక్షగా తేరిపార చూసేసరికి దుడ్డుకర్ర పెకైత్తి అతనివైపే దూసుకొచ్చింది ఓ ఆకారం, అది తెల్లోడి ఆకారం. అంతలోనే కుంటా తలమీద దుడ్డుకర్ర విరిగింది. కుంటా మోకాళ్లమీద కూలబడిపోయాడు. కుంటాకి తలపేలిపోతుంది. ఒళ్లు తిరుగుతుంది. తన నిస్సత్తువ మీద తనకే కసి పుట్టింది. కన్నీళ్లు, నెత్తురు, చెమటల మధ్య కళ్లకి మసక కమ్మింది. బయట కొందరు తెల్లవాళ్లు విచిత్రంగా అరుస్తున్నారు. కానీ కుంటాకి అర్థం కాలేదు. ‘మూడువందల యాభై..నాలుగు వందలు, ఐదు.... ఆరువందలు అనండి. ఎట్లా ఉన్నాడో చూడండి. గాడిదలాగా చాకిరీ చేయకపోతే నన్నడగండి’. ఆ కేకలు, వాటి అర్థం తెలియక కుంటా భయంతో గిజగిజలాడిపోయాడు. వెంటనే మరో గొంతు లేచి ‘ఏడు యాభై, ఎనిమిది, ఎనిమిదీ యాభై’ అని మూడుసార్లతో ఆ వేలం పాట ఆగిపోయింది. కుంటా అమ్ముడైపోయాడు. దీని తర్వాత కుంటా వారసులు ఏడు తరాలుగా అమెరికా గడ్డమీద బానిసలుగా బతికారు. అది 1863వ సంవత్సరం. బానిసలందరికీ స్వేచ్ఛను ప్రకటిస్తూ నాటి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ (ఫిబ్రవరి 12,1809 - ఏప్రిల్ 15, 1865) చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బానిసవాడల్లో అంతులేని ఆనం దం. నల్లవాళ్లంతా పాకల్లోంచి బయటకొచ్చి లక్షల సంఖ్యలో గుమిగూడారు. ‘ఇన్నాళ్లకి స్వాతంత్య్రం వచ్చింది. థాంక్ గాడ్’ అని కేకలు పెట్టారు. కానీ కొద్దిరోజులకే పిడుగులాంటి వార్త. అబ్రహాం లింకన్ హత్యకు గురయ్యాడు. బానిసవాడలన్నీ దుఃఖ సాగరంలో మునిగిపోయాయి. తమకు విముక్తి ప్రసాదించిన దేవుడు ఇక లేడన్న వార్త వారిని తీవ్రంగా గాయపరిచింది. ఇవి చీకటిఖండం ఆఫ్రికా నుంచి నల్లజాతి మనుషులను పశువుల్లా కొనుక్కొచ్చి తెల్లవారికి తరతరాల కట్టుబానిసలుగా చేసిన రక్తచరిత్రలోని కొన్ని పంక్తులు. ఆఫ్రికా నుంచి అమెరికాకు బానిసల్ని కొని తేవడం 1619లో ప్రారంభమైంది. ఇరవై మందితో మొదలైన బానిసల సంఖ్య 1810 నాటికి పది లక్షలు దాటింది. నల్ల బానిసలు లేనిదే తెల్లవాళ్లకు తెల్లారని రోజులవి. ఇదే విషయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఇంగ్లిష్ నవల ‘రూట్స్’లో ఎలెక్స్ హెలీ అక్షరీకరించారు (తెలుగు అనువాదం ‘ఏడుతరాలు’). పుస్తకం చివరి భాగంలో బానిసలు విముక్తి సాధించిన ఘట్టాన్ని కూడా హెలీ వివరించారు. బానిసల కట్టుబానిసత్వపు సంకెళ్లను తెగ నరికి స్వేచ్ఛను ప్రసాదించిన అబ్రహాం లింకన్ జయంతిని ఫిబ్రవరి 12వ తేదీన ప్రపంచమంతా జరుపు కుంటుంది. లింకన్ కెంటకీ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి థామస్ లింకన్ వ్యవసాయంతో పాటు వడ్రంగి వృత్తిని కూడా సాగించేవాడు. తల్లి నాన్సీ హంక్స్ లింకన్ చిన్నతనంలోనే మరణించింది. ఆ తరువాత ఆ కుటుంబం కెంటకీ నుంచి ఇండియానా అనే రాష్ట్రానికి జీవనో పాధికై వలస వెళ్లింది. ఆ తరువాత సరా బుష్ జాన్సన్‌ని థామస్ ద్వితీయ వివాహం చేసుకున్నారు. ఆమె తనను కన్న కొడుకులా ప్రేమించే దని లింకన్ చాలాసార్లు ప్రకటించారు. వ్యవసాయం సంక్షోభంలో పడడంతో లింకన్ కుటుంబం మిస్సిసిపి నదిలో పడవ నడిపే వృత్తిలోకి దిగింది. లింకన్ చదువు కొనసాగిస్తూనే పడవ నడిపేవారు. మళ్లీ ఆ కుటుంబం ఇండియానా నుంచి డెక్టోర్ చేరింది. అప్పుడు లింకన్ వయస్సు 21 సంవత్సరాలు. అక్కడ కూడా ఆ కుటుంబం పడవ నడిపేది. 1831లో లింకన్ ఉద్యోగం వెతుక్కుంటూ న్యూసలేం పట్టణానికి వెళ్లారు. అక్కడ ఒక జనరల్ స్టోర్స్‌లో గుమాస్తాగా కుదిరారు. ఉద్యోగం చేస్తూనే ఇతర సామాజిక కార్య క్రమాల్లో పాల్గొంటూ పట్టణ ప్రజల్లో గుర్తింపు పొందాడు. ఆ సమయంలోనే బ్లాక్ హాక్ యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో లింకన్ ఒక స్వచ్ఛంద సైనికుడిగా పాల్గొని కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత మళ్లీ న్యూసలేంకు తిరిగి వచ్చి రాష్ట్ర శాసనసభకు పోటీ చేశారు. కానీ విజయం సాధించలేక పోయారు. మళ్లీ చదువుపై దృష్టి పెట్టి న్యాయ శాస్త్రం చదివారు. ఆ తరువాత న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూ, విగ్ అనే రాజకీయ పార్టీలో చేరి, చురుకైన పాత్ర నిర్వహించారు. 1834లో రాష్ట్ర శాసనసభకు పోటీ చేసి విజ యం సాధించారు. ఆ తరువాత వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1834లో మొదటిసారి ఎన్నికైనప్పుడు మిగతా అందరి సభ్యులకన్నా ఆయన వయసులో చిన్నవాడు. అప్పటినుంచే ఆయన సాధా రణ తెల్లజాతి ప్రతినిధి వలె కాక, మానవతా హృదయంతో స్పందించేవాడు. 1838లో నల్లజాతి ప్రజల హక్కుల కోసం, బానిసత్వ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తున్న పత్రికా సంసాదకులు ఎలిజా పరీష్ లవ్‌జాయ్ హత్య పట్ల లింకన్ తీవ్రంగా స్పందించారు. లింకన్ రాజకీయ జీవితం బానిసత్వ వ్యతిరేక చింతనతోనే మొదలైం దని విశ్లేషకుల అభిప్రాయం. 1837 నుంచి, తుది శ్వాస విడిచే వరకు ఆయన బానిస వ్యతిరేక ఉద్యమాన్ని, నిజానికి యుద్ధాన్ని నడిపాడు. తన 28 ఏళ్ల వయసులోనే ఇలినాయీస్ జనరల్ అసెంబ్లీలో ప్రజాప్రతినిధిగా మొట్ట మొదటిసారి తన బానిసత్వ వ్యతిరేక విధానాన్ని ప్రకటించాడు. బానిస వ్యవస్థ అన్యాయమే కాక, దుర్మార్గమైన విధానమని, బానిసత్వం పట్ల సాను కూల వైఖరి కలిగి ఉండడం మరింత అనైతికమని నినదించారు. ‘‘నేను అనైతి కమైన బానిసత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది అమెరికా ప్రజా స్వామ్య తత్వానికి విరుద్ధమైనది. దీన్ని కొనసాగించడం అంటే మనల్ని మనం వంచన చేసుకోవడం తప్ప మరొకటి కాదు.’’ అని బానిసత్వ అనుకూ లురపై(అక్టోబర్ 16, 1854) ధ్వజమెత్తారు. ఆగస్టు 1, 1858లో ఆయన చెప్పిన మాటలు రాజనీతిశాస్త్రం మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘నేను బాని సగా ఉండడానికి ఎట్లాగైతే అంగీకరించనో, యజమానిగా ఉండడానికి కూడా అంగీకరించను. ఇది నా ప్రజాస్వామ్య భావం. దీన్ని ఏ పద్ధతిలో వ్యతి రేకించినా అది ఎంత మాత్రం ప్రజాస్వామ్యం కాదు.’’ ఆ తర్వాత తన ప్రత్యర్థి స్టీఫెన్ డగ్లస్‌తో జరిపిన వాదోపవాదాలు ప్రజలందరినీ ఆకర్షింప జేశాయి. వీటితో పాటు అక్టోబర్ 18, 1858న జేమ్స్ అండ్ బ్రౌన్కు రాసిన లేఖలో సామాజిక, రాజకీయ సమానత్వం ప్రజలందరికీ అన్ని జాతులకు సమానంగా అందాలనే సూత్రాన్ని గుర్తుచేశారు. మనుషులందరూ సమాన మనే గొప్ప ప్రాథమిక సూత్రాన్ని నేను విశ్వసిస్తానని కూడా ప్రకటించారు. బానిసత్వ నిర్మూలన ప్రకటనకు కొన్ని సంవత్సరాల ముందు అంటే సెప్టెంబర్ 17, 1859 సిన్సినాటాలో చేసిన ప్రసంగంలోనూ బానిసత్వం లోని అనైతికతను ఎత్తిచూపారు. లింకన్ గాఢంగా విశ్వసించే ప్రజాస్వామ్యయుత భావాలే అతనిని 1861లో, 52 ఏళ్ల వయస్సులో అమెరికా అధ్యక్షుడిని చేశాయి. దక్షిణ రాష్ట్రాలన్నీ లింకన్ అధ్యక్షతన కొనసాగలేమని అంతర్యుద్ధాన్ని ప్రకటిం చాయి. అంటే బానిసత్వ వ్యవస్థను రక్షించడానికే ఈ యుద్ధం చేస్తున్నట్టు కూడా ఆయా రాష్ట్రాలు స్పష్టం చేశాయి. అయినా లింకన్ వెనకడుగు వేయ లేదు. సెప్టెంబర్ 22, 1862న బానిస విముక్తి ప్రకటనను చేసి, జనవరి 1,1863 నుంచి అది అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ‘ఎమానిస్పేషన్ ప్రొక్లెమేషన్’గా ప్రసిద్ధి చెందిన ఈ ప్రకటన అమెరికా చరిత్రను తిరగరాసింది. ఈ ప్రకటన యావత్ ప్రపంచానికీ మార్గ నిర్దేశనం చేసింది. ఈ ప్రకటన జరిగి ఇప్పటికి 150 సంవత్సరాలు దాటింది. ఈ ఒకటిన్నర శతాబ్దాలలో అబ్రహాం లింకన్ వేసిన మార్గం అమెరికానే కాకుండా అనేక దేశాలను, ఉద్యమాలను, జాతులను, ప్రభావితం చేసి మానవ హక్కుల ఉద్య మానికి వేగుచుక్కగా నిలిచింది. అటువంటి చరిత్రా త్మకమైన ప్రకటనను స్వీకరించలేని దక్షిణాది శ్వేత జాత్యహంకారులు కుట్రపన్ని జాన్ విల్క్స్బూత్ అనే హంతకుని ద్వారా ఏప్రిల్ 14,1865న వాషింగ్టన్ డీసీలోని ఫోర్డ్స్ థియేటర్లో కాల్చి చంపారు. ‘‘అమెరికా గడ్డను భగవంతుడు తెల్ల జాతీయుల కోసం సృష్టించాడు. మిగతా ఏ జాతికి, ప్రత్యేకించి నల్లవారికి ఇక్కడ స్థానం లేదు. అటువంటి దేవుడి నిర్ణయాన్ని వ్యతిరేకించి మనుషులందరూ సమానం అనే చట్టాన్ని తీసుకొచ్చిన అబ్రహాం లింకన్‌కు కూడా ఇక్కడ బతికే అర్హత లేదు’’ అని జాన్విల్క్స్ బూత్ డైరీలో రాసుకుని నిర్దాక్షిణ్యంగా అమలు చేశాడు. 1982లో ‘చికాగో ట్రిబ్యూన్’ పత్రిక అమెరికా అధ్యక్షుల పనితీరుపైన 49 మంది చరిత్రకారులు, రాజనీతివేత్తల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అందులో నూటికి నూరు శాతం 1982 వరకు ఉన్న అధ్యక్షుల్లో అబ్రహాం లింకన్ అగ్రగణ్యుడుగా తేల్చారు. దీనిలో ఐదు అంశాలపైన వివరాలను సేకరించారు. నాయకత్వ లక్షణాలు, విజయాలు, సంక్షోభ నివారణలు, రాజకీయ మెలకువలు, వ్యక్తిత్వం, నిజాయితీ లాంటి విషయాలపైన ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చారు. ఇందులో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, జార్జ్ వాషింగ్టన్, థియోడర్ రూజ్వెల్ట్, థామస్ జఫర్సన్ అండ్రూ జాక్సన్, ఉడ్రో విల్సన్, హ్యారీ ట్రూమన్లు వరుసగా స్థానాలు దక్కించుకున్నారు. ఏప్రిల్ 11, 1865న, అంటే లింకన్ హత్యకు నాలుగు రోజుల ముందు ఇచ్చిన చివరి ఉపన్యాసాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ‘‘ఈ ఎన్ని కల్లో శ్వేతజాతేతరులు కానీ, నల్లజాతీయులుగానీ ఒక్కరు కూడా గెలవక పోవడం నాకు అసంతృప్తిగా ఉంది. వారి శక్తి సామర్థ్యాలను అమెరికా ప్రగ తికి ఉపయోగించుకోకపోవడం విచారకరం.’’ అని ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆనాడు వేసిన హక్కుల బీజం ఒక మహా వృక్షమై శ్వేతసౌధంలోనే నల్లజాతీయుడు బరాక్ ఒబామా కొలువుదీరే స్థాయికి చేరింది. అది లింకన్ హక్కుల ఉద్యమం ఎగురవేసిన విజయపతాక. అందువల్ల 150 సంవత్సరాల అనంతరం కూడా లింకన్ ఆలోచనలు, ఆకాంక్షలు ఇంకా సజీవంగా ప్రపంచప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. (ఫిబ్రవరి 12న అబ్రహాం లింకన్ జయంతి) వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య -
వీరమాతకు లింకన్ లేఖ
ఆ నేడు 21 నవంబర్ 1864 అమెరికాలో 1861 నుంచి 1865 వరకు అంతర్యుద్ధం జరిగింది. 1861 జనవరిలో అప్పటికి ఉన్న 34 అమెరికన్ రాష్ట్రాలలో ఏడు బానిస రాష్ట్రాలు తమను తాము స్వతంత్రమైనవిగా ప్రకటించుకుని, మిగతా రాష్ట్రాల నుంచి విడిపోయి ‘కాన్ఫెడరసీ’గా ఏర్పడ్డాయి. ఈ గ్రూపును ‘సౌత్’ అని పిలిచేవారు. తక్కిన రాష్ట్రాలు బానిసత్వాన్ని వ్యతిరేకించే ‘యూనియన్’గా ఉండిపోయాయి. వీటిని ‘నార్త్’ అని పిలిచేవారు. బానిసత్వ వ్యవస్థను మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరింపజేయాలన్న ‘సౌత్’ డిమాండుతో మొదలైన అమెరికా అంతర్యుద్ధంలో సౌత్, నార్త్ గ్రూపులకు చెందిన 6 లక్షల మంది సైనికులు మరణించారు. ఆ సమయంలో అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నారు. యుద్ధ మరణాలు ఆయన్ని కలచివేశాయి. ఆ పశ్చాత్తాపంతో ఆయన... అంతర్యుద్ధంలో తన నలుగురు కొడుకులను కోల్పోయిన లిడియా బిక్స్‌బై అనే మహిళకు 1864 నవంబర్ 21న క్షమాపణ లేఖ రాశారు. అబ్రహం లింకన్ సంతకంతో ఉన్న ఆ ఉత్తరం నవంబర్ 25న ‘బోస్టన్ ఈవెనింగ్ ట్రాన్స్క్రిప్ట్’ పత్రికలో అచ్చయింది. అయితే అది నిజంగా లింకన్ రాసిన ఉత్తరమేనా అనే సందేహాలు ఇప్పటికీ ఉన్నాయని చరిత్రకారులు అంటారు. -
అమెరికా అధ్యక్షునిగా అబ్రహాం లింకన్
ఆ నేడు 6 నవంబర్, 1860 అమెరికా 16వ అధ్యక్షునిగా అబ్రహాం లింకన్ ఎన్నికయ్యారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన అబ్రహామ్ లింకన్ తన సమీప ప్రత్యర్థులైన, డెమోక్రాట్స్ పార్టీ అభ్యర్థి స్టీఫెన్ ఎ. డౌగ్లస్ని, సదరన్ డెమోక్రాట్స్ అభ్యర్థి జాన్ సి. బ్రెకిన్రిడ్జ్ని, న్యూ కాన్స్టిట్యూషనల్ యూనియన్ పార్టీ అభ్యర్థి జాన్ బెల్‌ను ఓడించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. లింకన్ గెలుపుతో రిపబ్లికన్ పార్టీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చినట్లయింది. చాలా శక్తిమంతమైన, పాలనాదక్షత గల అధ్యక్షునిగా, గొప్ప రాజనీతిజ్ఞునిగా ప్రజల మనిషిగా అబ్రహాం లింకన్ మంచి పేరు తెచ్చుకున్నారు. -
బానిసత్వపు సంకెళ్లు తెంచిన ధీరుడు..
భగవంతుడు సృష్టించిన మనుషులందరిలోనూ ఒకే రంగు గల రక్తం ప్రవహిస్తోంది. అయితే కొందరు పుట్టుకతో భాగ్యవంతులు, మరి కొందరు నిరుపేదలు. మనిషికి మనిషి గౌరవం ఇవ్వాల్సివస్తే ఎవరిని గౌరవించాలి? ధనవంతుడినా లేక పేదవాడినా?? లింకన్ని ప్రశ్నిస్తే.. ఎగాదిగా చూస్తాడు. ప్రతి ఒక్కరికీ ఆత్మ గౌరవం ఉంటుందంటాడు. ఇదే విషయాన్ని త్రికరణశుద్ధిగా నమ్మినవాడు అబ్రహాం లింకన్! 1861.. అమెరికా గతిని మార్చేసిన సంవత్సరం. మానవతావాది, నిస్వార్థ ప్రజాస్వామ్య నేత అబ్రహాం లింకన్ ఆ దేశ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. ఆయనకు ముందు 15మంది, తర్వాత 28 మంది ఆ పీఠం మీద కూర్చున్నారు. అయితే, ఎవరూ ఆయన స్థాయిని చేరుకోలేకపోయారు. ఇప్పటికీ అమెరికా ప్రజల ఆరాధ్య అధ్యక్షుడు లింకనే అంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆయన అమెరిన్ల మనసులపై ముద్రవేశారు. బాల్యం.. 1809, ఫిబ్రవరి 12న అమెరికాలోని కెంటకీలో జన్మించాడు లింకన్. తండ్రి వడ్రంగి పనులు చేసేవాడు. చిన్నతనంలోనే విషజ్వరాల కారణంగా తల్లిని పోగొట్టుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగా తరచూ వలసలు వెళ్లే కుటుంబంలో పెరగడంతో పెద్దగా చదువుకోలేదు. తల్లి మరణం తర్వాత తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే సవతి తల్లి లింకన్‌పై ఎంతగానో వాత్సల్యం పెంచుకుంది. సొంతబిడ్డలాగా సాకేది. ఆమె పెంపకంలోనే లింకన్ నీతి, నిజాయతీలను బాగా ఒంటబట్టించుకున్నాడు. ‘మనిషికి జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మగౌరవం’ అన్న తన తల్లి మాటలు లింకన్ మనసులో చెరగని ముద్ర వేశాయి. దుఃఖం.. పుట్టుక నుంచీ పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తూ వచ్చిన లింకన్‌ను జీవితకాలం అది వెంటాడుతూనే వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతూ మరణించిన తన పంతొమ్మిదేళ్ల అక్క సారాను తలచుకుంటూ లింకన్ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో అతడి మిత్రులకు బాగా తెలుసు. చదువులేనప్పటికీ వ్యాపారంలో రాణిద్దామనుకొన్నాడు. అదీ తీవ్ర నష్టాల్నే మిగిల్చింది. అప్పుల ఊబిలో ఇరుక్కున్నాడు. సవతి తల్లికి సొంత బిడ్డగా మారినా తండ్రికి మాత్రం క్రమేపీ దూరమవుతూ వచ్చాడు. రాజకీయాలు.. లింకన్ 1832లో ఇల్లినాయిస్ రాష్ట్ర శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. అయితే 1834 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. తర్వాత కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా న్యాయవాద వృత్తిలో గడిపాడు. న్యాయశాస్త్రాన్ని తనంతట తానే అభ్యసించిన లింకన్.. న్యాయవాదిగా ఎంతో ఉన్నతస్థానానికి ఎదిగాడు. అమెరికాలోని తెల్లవారు నల్లవారిని హింసించడం లింకన్‌కు నచ్చలేదు. వారి తరఫున వకాల్తా పుచ్చుకొని ఎన్నో కేసులు వాదించాడు. ఇదే క్రమంలో మరోసారి రాజకీయాల్లోకి రావాలని 1855లో నిర్ణయించుకున్నాడు. వర్ణవివక్షపై సమరం.. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్మినవాడు లింకన్. అందుకే నలుపు, తెలుపు భేదాలను అంగీకరించలేకపోయాడు. దేశంలో నల్లవారు బానిసత్వంలో మగ్గుతుంటే సుస్థిరత ఎక్కడుంటుందని ప్రశ్నించాడు. అందుకే.. దేశంలో బానిసత్వం, వర్ణవివక్షను రూపుమాపుతానని ప్రకటించాడు. ‘ది డివెడైడ్ స్పీచ్’ పేరుతో ఆయన చేసిన ప్రసంగం అమెరికన్ల భవిష్యత్తునే మార్చివేసింది. మనుషులంతా సమానమని, వర్ణభేదం వద్దంటూ లింకన్ ఇచ్చిన పిలుపు చాలామందిని కదిలించింది. లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యేలా చేసింది. వ్యతిరేకత.. అధ్యక్షుడైన తర్వాత లింకన్ తన వాగ్దానాన్ని మర్చిపోలేదు. బానిసత్వాన్ని రూపుమాపాడు. దీంతో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా 11 రాష్ట్రాలు లింకన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. బానిసత్వం చట్టబద్ధంగా ఉన్న ఈ రాష్ట్రాలు ‘కాన్ఫెడరేషన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’గా జట్టుకట్టి అంతర్యుద్ధానికి తెరలేపాయి. 1861 నుంచి 1865 వరకూ అంతర్యుద్ధం కొనసాగింది. ఈ తిరుగుబాటును లింకన్ అణచివేయడంతో 1865 ఏప్రిల్ 10న ముగిసింది. హత్య.. నల్లవారి అభ్యున్నతి కోసం లింకన్ మరింత ముందుకెళ్లాడు. వీరికి ఓటు హక్కు కల్పిస్తానని ప్రకటించాడు. దీంతో కొందరు శ్వేతజాతీయులు లింకన్‌పై కుట్రపన్నారు. అంతమొందించేందుకు ప్రయత్నిం చారు. రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన లింకన్‌ను 1865 ఏప్రిల్ 15న జాన్ విల్కీస్ బూత్ అనే డ్రామా నటుడు తుపాకీతో కాల్చిచంపాడు. అమెరికా అగ్రరాజ్యంగా అవతరించేందుకు పునాదులేసిన లింకన్ మరణంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఆ దేశ చరిత్ర నుంచి ఓ దార్శనికుడు కనుమరుగయ్యాడు. ఆజానుబాహుడు.. అబ్రహాం లింకన్ ఆజానుబాహుడు. ఆరడుగుల నాలుగంగుళాల పొడవుండే ఆయన అత్యంత బలశాలి కూడా. లింకన్ కండబలం గురించి ఎన్నో ఉదాహరణలు చెబుతారు. 1834లో ఎన్నికల ప్రచారంలో లింకన్ ప్రసంగిస్తున్నప్పుడు వేదిక ముందున్న మద్దతుదారుల్లోంచి ఒక వ్యక్తి దూసుకొచ్చాడట. తనపై దాడిచేసేందుకే అని గ్రహించిన లింకన్, ఒంటి చేత్తో ఆ వ్యక్తి మెడను అందుకుని అవతల విసిరేశాడట. దీని గురించి నేటికీ కథలు కథలుగా చెప్పుకొంటారు. గొడ్డలిని ఉపయోగించడంలో లింకన్‌ది అందెవేసిన చెయ్యి. ఆయనకు అతీంద్రియ శక్తులుండేవని అమెరికన్లు విశ్వసిస్తారు. -
వెయ్యి చీకట్ల వాడు... లక్ష వెలుగుల రేడు!
దృశ్యం ప్రముఖ దర్శకుడు హిచ్‌కాక్ డాక్యుమెంటరీల గురించి ఒక ప్రసిద్ధ వాక్యం చెప్పి వాటి గొప్పదనాన్ని చెప్పకనే చెప్పారు. డాక్యుమెంటరీ చూడడం అంటే పరిచితమో, అపరిచితమో... ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ డాక్యుమెంటరీల పరిచయమే... ఈ దృశ్యం. ఫీచర్ ఫిలిమ్స్‌లో డెరైక్టరే దేవుడు. డాక్యుమెంటరీ ఫిలిమ్స్‌లో దేవుడే డెరైక్టర్. - ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అబ్రహం లింకన్ జీవితం ఆయనది మాత్రమే కాదు. సొంతం చేసుకుంటే అందరిదీ. ఆయన జీవితంలోని మేలిమి అంశాలు, సొంతం చేసుకున్నవాళ్లకు సొంతం చేసుకున్నంత. బహుముఖ కోణాల ఆయన జీవితం ఏకైక విశ్లేషణలకు, నిర్వచనాలకు లొంగనిది. ‘అమెరికన్ సివిల్ వార్’ కాలంలో ‘అధ్యక్షుడంటే ఇలా ధైర్యంగా ఉండాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా దూసుకుపోవాలి’, ‘అధ్యక్షుడంటే ఇలా పట్టుదలగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అర్హతలకు తన వ్యక్తిత్వపు వెలుగులో సరికొత్త నిర్వచనాలు ఇవ్వడమే కాదు, నల్లబానిసల జీవితాలకు కొత్త వెలుగు తీసుకువచ్చినవాడు లింకన్. ఆయన ‘అధ్యక్షుడు’ కాకుండా ఉంటే... అమెరికా ఎన్ని అమెరికాలుగా ఉండి ఉండేదో! (కాన్ఫెడరేట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి పేర్లతో!) అబ్రహం లింకన్ గురించి మాట్లాడుకోవడమంటే కెంటకీలోని నాల్గవ తరగతి పట్టణమైన హొడ్జెన్విల్లీలో జన్మించిన వ్యక్తి గురించి, ఆయన గొప్పదనం గురించి మాట్లాడుకోవడం కాదు. దేశాలకు అతీతమై, కాలాతీతమైన ఒక నవ ఉత్తేజం గురించి మాట్లాడుకోవడం. రాజనీతిజ్ఞులకు, ఆర్థిక వేత్తలకు, చరిత్రకారులకు, జీవితచరిత్రకారులకు, పాత్రికేయులకు లింకన్ జీవితంలో నుంచి ఎంత విలువైన ముడిసరుకు లభించిందో... కాల్పనిక రచయితలు, కళాకారులు, మానసిక విశ్లేషకులకు అంతే విలువైన ముడి సరుకు లభించింది. అబ్రహం లింకన్ జీవితం ఆధారంగా ఎన్నో పుస్తకాలు, మరెన్నో సినిమాలు వచ్చాయి కదా... మరి డెరైక్టర్ విక్రమ్ జయంతి తన ‘లింకన్’ అనే డాక్యుమెంటరీలో కొత్తగా ఏం చెప్పాడు? ‘‘కొత్తగా ఏం చెప్పగలను?’’ అని మొదట్లో తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు విక్రమ్. ఎన్నో పుస్తకాలు, ఎన్నో సినిమాలు చూసిన తరువాత ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చాడు. ‘‘డాక్యుమెంటరీ తీయవద్దు’’ - ఇదీ నిర్ణయం. ‘‘ఒకవేళ తీస్తే మాత్రం...లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో కాదు, లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్‌తో తీయాలి’’. ‘లాంగ్వేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’తో రీలు చుట్టేయడం కష్టమైన పనేమీ కాదు... కానీ ‘లాంగ్వేజ్ ఆఫ్ ఎమోషన్స్’తో తీయడమే కష్టాల్లో కెల్లా కష్టం. చిత్రాన్ని కాదు... చిత్రం వెనుక చిత్రాన్ని చూడాలి. వాక్యాన్ని కాదు. వాక్యం వెనుక వాక్యాన్ని చూడాలి. సంతోషాన్ని కాదు... దాని వెనక దుఃఖాన్ని చూడగలగాలి! తాను చదివిన పుస్తకాల్లో నుంచి నోట్స్ రాసుకున్నాడు. శాస్త్రీయంగా విశ్లేషించడానికి లింకన్ బ్రెయిన్ కెమిస్ట్రీ డాటాలాంటిది అందుబాటులో లేదు కాబట్టి ‘డిప్రెషన్’తో సహా లింకన్‌కు సంబంధించిన రకరకాల మనోవైఖరులను సందర్భానుసారంగా ఒడిసి పట్టి వాటికి దృశ్యరూపం ఇచ్చి, ప్రపంచానికి సుపరిచితుడైన ఒక మహానాయకుడి ‘అపరిచిత ప్రపంచాన్ని’ పట్టుకోగలిగాడు విక్రమ్. థామస్ క్రాగ్వెల్ రాసిన పుస్తకం ఆధారంగా వచ్చిన ‘లింకన్ గ్రేవ్ రాబరీ’లాంటి డాక్యుమెంటరీలతో పోల్చితే, వాటిలో కనిపించే సస్పెన్స్, మలుపులు, నాటకీయత ‘లింకన్’లో బొత్తిగా కనిపించకపోవచ్చు. అయినప్పటికీ ‘లింకన్’ అనేది ఏ సస్పెన్స్ థ్రిల్లర్‌కూ తీసిపోని ‘ఆసక్తి’ని ప్రేక్షకులకు కలిగిస్తుంది. పూరి గుడిసెలో కన్న కలల గురించి, వైట్‌హౌజ్‌లో కార్చిన కన్నీళ్ల గురించి గోర్ విడల్ గొంతులో లింకన్ స్వగత కథనం వినిపిస్తుంది. ప్రధాన స్రవంతి సినిమాలలో కనిపించే ఈ టెక్నిక్‌ను వాడుకొని డాక్యుమెంటరీని ఆసక్తికరంగా మలిచే ప్రయత్నం చేశారు విక్రమ్. ‘‘ఎంతోమంది లింకన్ జీవితాన్ని తమ జీవితంతో పోల్చుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని’’ అంటాడు విక్రమ్. ఈయన కూడా డిప్రెషన్ బాధితుడే! లింకన్‌ను వెంటాడిన కుంగుబాటు, చావుపై ప్రధానంగా సాగే ఈ డాక్యుమెంటరీలో లింకన్ జీవితంలోని పలు అంశాలపై జీవితచరిత్రకారులు స్పందించారు. లింకన్ జీవితంలోని భిన్న పార్శ్వాల గురించి విశ్లేషించారు. ‘‘ఆయన విజయాలు, ప్రతిభకు సంబంధించిన విషయాలు మాత్రమే తెలుసుకుంటే... లింకన్ జీవితాన్ని అసంపూర్ణంగా తెలసుకున్నట్లే. నిజానికి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాడు. వాటి గురించి తెలుసుకుంటేగానీ ఆయన గొప్పదనం అర్థం కాదు’’ అంటాడు ‘లింకన్స్ మెలంకలి’ పుస్తకం రాసిన వోల్ఫ్ షెంక్. నిజానికి లింకన్ బాధపడినట్లు, ఏ ప్రసిద్ధ నాయకుడూ ‘డిప్రెషన్’తో బాధ పడి ఉండడు. అయినప్పటికీ ఆయన గత జ్ఞాపకాల భారంతో బాధ పడినట్లు అనిపించదు. ఆయన విజయాలకేమీ అది అడ్డుపడలేదు. ఒకే కోణం అని కాకుండా... లింకన్‌లోని రకరకాల డిప్రెసివ్ టెండెన్సీలను ఈ డాక్యుమెంటరీ స్పృశిస్తుంది. దీనికి సంబంధించి లింకన్ ఉత్తరాల నుంచి కొన్ని వాక్యాలను కూడా ఉదహరించారు. ఈ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీలో ప్రపంచానికి తెలిసిన లింకన్ వెలుగులు లేవు. తెలియని చీకటి ప్రపంచం ఉంది. ఆ చిమ్మ చీకట్లోనే ప్రకాశించే నిలువెత్తు లింకన్ సంతకం ఉంది. -యాకుబ్ పాషా యం.డి డాక్యుమెంటరీ పేరు: లింకన్ డెరైక్టర్: విక్రమ్ జయంతి డెరైక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ఎమ్మా మాథ్యూ -
ఏసీబీ వలలో అవినీతి చేప
ఖాజీపేట: వీఆర్వో అబ్రహం లింకన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నారుు. ఖాజీపేట మండలం నాగసానిపల్లె వీఆర్వోగా ఉంటూ తవ్వారిపల్లెకు ఇన్ఛార్జిగా అబ్రహం లింకన్ పని చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన బి.విశ్వనాథరెడ్డి అనే రైతు పట్టాదారు పాసుపుస్తకం కోసం దాదాపుగా రెండేళ్లుగా తిప్పుకుంటూ రూ.7వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బు ఇవ్వలేక, వీఆర్ఓను పట్టించాలన్న ఉద్ధేశంతో ఆ రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఖాజీపేట బస్టాండు కూడలిలోని వీఆర్వో కార్యాలయంలో రైతు విశ్వనాథరెడ్డి వీఆర్వో అబ్రహం లింకన్‌కు డబ్బులు ఇచ్చాడు. ఆయన తీసుకున్న తక్షణమే ఏసీబీ అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీఆర్వో వద్దనున్న రికార్డులను, పాసు పుస్తకాలను తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ ఎదుట సోదాలు నిర్వహించారు. అబ్రహం లింకన్‌పై కేసు నమోదుచేసి తమ వెంట తీసుకెళ్లారు. -
గత వైభవానికి పునరంకితం
తత్వశాస్త్ర ఆచార్యుడిగా విద్యార్థులను పరవశింపజేసిన అత్యుత్తమ గురువు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయాలి. వృత్తులన్నింటికీ మూలమైనది బోధనావృత్తి, సమాజంలో డాక్టర్లు, ఇంజనీర్లు, పాలనారంగ ప్రముఖులైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, మంత్రులు, ప్రధాన మంత్రులు అందరినీ తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక సందర్భం లో, జాతీయోద్యమ నేత బాలగంగాధర తిలక్ ‘‘నేను ప్రధాని కావాలని కోరుకోవడం లేదు. అవకాశం ఉంటే అధ్యాపకుడిగా కొనసాగాలని అనుకుంటున్నాను. ఎందరో ప్రధానులను తీర్చిదిద్దగల అవకాశం అధ్యాపకుడికి మాత్రమే ఉంటుంది’’ అని చెప్పిన అభిప్రాయం అధ్యాపక వృత్తి ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది. ‘‘ఉపాధ్యాయులు ఉన్నత పదవుల్లో ఉన్న విద్యార్థులను గూర్చి గర్వంతో ఉప్పొంగడం కన్నా తమ నిర్లక్ష్యానికి గురై అగమ్యంగా రోడ్లపై తిరిగే వారిని గూర్చి ఆలోచించి, సంస్కరించే ప్రయత్నం చేయుట కర్తవ్యం’’ అంటారు మదర్ థెరిస్సా. ‘‘ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని గుర్తు చేయవలసిన స్థితి శోచనీయం. వారు తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకొని సమాజానికి న్యాయం చేయాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ ఉపాధ్యాయులు.ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువు. విజ్ఞాన కల్పతరువు. ఆయన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుత్తణిలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన ఏక సంథాగ్రాహి. మైసూర్ విశ్వవిద్యాలయం ప్రధాన ఆచార్యులుగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (1931-36) బెనారస్ విశ్వవిద్యాలయ ఉప కులపతిగా (1936-39) బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విద్యావేత్తల ప్రశంసలందుకున్నారు. యూజీసీ చైర్మన్‌గా భారతదేశంలో ఉన్నత విద్యకు సంబంధించి, ఎన్నో సంస్కరణాత్మక సూచనలు చేశారు. తత్వవేత్తగా ‘భారతీయ తత్వశాస్త్రం’, ‘ఎతిక్స్ ఆఫ్ వేదాంత’, ‘ఈస్ట్రన్ రెలిజియన్’, ‘వెస్ట్రన్ థాట్’ వంటి గ్రంథాలు వ్రాసి, పాశ్చాత్యుల ప్రశంసలు పొందారు. భారత రాజ్యాం గ పరిషత్ సభ్యులుగా, రష్యా రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా గొప్ప రాజ నీతిజ్ఞులు అనిపించుకున్నారు. ఉపాధ్యాయ వృత్తి నుండి అమేయమైన ప్రతిభతో, అపారమైన మేధస్సుతో భారత రాష్ట్రపతి పదవి అలంకరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఉపాధ్యాయ లోకానికే ఆయన గర్వకారణం. అందుకే భారత ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవాన్ని 1962 నుంచి గురుపూజా మహోత్సవంగా నిర్వహిస్తోంది. నేడు విద్యారంగం కలుషితమైపోయిం ది. ఒకనాటి పవిత్రమైన గురుశిష్య సంబంధం విచ్ఛిన్నమైపోయింది. కార్పొరేట్ విద్యా విధానంలో ధనపు గురువులు, మదపు శిష్యులు ఉన్నారు. మనకిప్పుడు గురు బ్రహ్మలు, గురు విష్ణువులు, గురు మహేశ్వరులు లేరు. విద్యాసంస్థల్లో కొట్టే బెల్కు, నెల మొదట్లో వచ్చే జీతపు బిల్లుకు నిరీక్షించే నైజం ఉన్న గురువులే ఉన్నారు. నైతిక విలువలు నశించి, విద్యార్థినులను, సహోపాధ్యాయినులను లైంగిక వేధిం పులకు గురిచేసే కీచకోపాధ్యాయులున్నారు. విద్యార్థుల మనస్తత్వాన్ని అవగాహన చేసుకోలేక అసహనంతో, కోపంతో అమానుషంగా దండించి, భౌతికంగా గాయపరిచే ఉపాధ్యాయులున్నారు. ఇది విద్యారంగం దురదృష్టం. ఈ సందర్భంలో స్వామి వివేకానంద మాట లు స్మరించుకోవడం సముచితంగా ఉంటుం ది. ‘‘ప్రాథమిక దశలో విద్యార్థులు ఉద్యానవనంలో పూలమొక్కల వంటి వారు. ఉపాధ్యాయులు తోటమాలుల్లా ప్రేమతో వారిని పరిరక్షించాలం’’టారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా... ఉపాధ్యాయులు అంకితభావంతో, నైతిక విలువలతో, స్వీయ కర్తవ్యోన్ముఖులై విద్యారంగాన్ని తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు హక్కుల కోసం ఉద్యమించటంతో పాటు ఉపాధ్యాయుల కర్తవ్యాన్ని, బాధ్యతలను గుర్తించి ఆదర్శంగా పనిచేసేట్లు దిశానిర్దేశం చేయాలి. సాధారణ ఉపాధ్యాయులంతా ఉత్తమ ఉపాధ్యాయులుగా రూపొందిన నాడే గురుపూజా మహోత్సవాలు సార్థకమౌతాయి. (వ్యాసకర్త రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత) -
రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు. అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు. కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. -
వెలుగు అప్‌గ్రేడ్ అయ్యింది !
అబ్రహాం లింకన్ వీధి దీపాల కింద చదువుకున్నాడట. కానీ మనం...రకరకాల దీపాల కింద చదువుకున్నాం. స్కూల్లో ఒక లైటు ఉండేది, హైస్కూల్లో ఇంకోలైటు మారింది. కాలేజీలో మరోలైటు వెలుగు చూశాం... ఇపుడు ఎల్ఈడీ వెలుగులు చూస్తున్నాం. మన చిన్నప్పుడు చూసిన ఇన్కాండిసెంట్ బల్బ్ (బల్బు) తర్వాత ఎన్నో వచ్చాయి. అయినా ఇప్పటికీ ఇన్కాండిసెంట్ దొరుకుతోంది? అసలు వీటి మధ్య తేడా ఏమిటి? ఎలా పనిచేస్తాయి? ఎక్కువ నీళ్లు ఎక్కువ మంది దాహాన్ని తీరుస్తాయి. ఇది సాధారణ సూత్రం. కానీ, టెక్నాలజీ చేసే అద్భుతాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. అలాంటి మార్పే బల్బుల్లోనూ వచ్చింది. ఎక్కువ కరెంటు తీసుకునే బల్బు తక్కువ వెలుగునివ్వగా, తక్కువ కరెంటు తీసుకుంటున్న బల్బులు ఎక్కువ వెలుగులు ఇస్తున్నాయి. ఇన్కాండిసెంట్: ఇది మనం మొదట చూసిన బల్బ్. దీనికి ఫిలమెంటు ఉంటుంది. ఆక్సిజన్ చొరబడకుండా అందమైన ఆకారంలోని ఒక గాజు సీసాలో ఫిలమెంటు బిగిస్తారు. ఆ ఫిలమెంటు ద్వారా విద్యుత్తు ప్రవహించడంతో అత్యధిక ఉష్ణోగ్రత రావడం వల్ల ఆ ఫిలమెంటు మండుతూ ఉండి వెలుగులు ఇస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బల్బుల్లో అతిఎక్కువ కరెంటు వాడేది ఇదే. ఇవి 1.5 వోల్టుల నుంచి 300 వోల్టుల వరకు వివిధ సామర్థ్యాల్లో దొరుకుతాయి. బహుశా చాలామందికి దీపం తర్వాత పరిచయం అయిన తొలి విద్యుత్ బల్బు ఇదే. ఇప్పటికీ అలంకరణల్లో వీటికి డిమాండ్ బాగా ఎక్కువ. ఈ బల్బులు వేడిని ఎక్కువ సృష్టిస్తాయి. దీనికి కారణం ఏంటంటే... ఇవి తీసుకునే విద్యుత్తులో ఐదు శాతం వెలుగు ఇవ్వడానికి ఉపయోగపడితే, మిగతా 95 శాతం వేడి రూపంలో వృథా అయిపోతుందట! అందుకే ఈ బల్బుని వెలుగుతున్నపుడు ముట్టుకోలేం. హాలోజెన్ బల్బ్: ఇన్కాండిసెంట్ కంటే కాస్త అడ్వాన్స్డ్. ఇవి దానికంటే రెట్టింపు వెలుగును ఇస్తాయి. ఈ బల్బుల్లోని ఫిలమెంటు కరెంటును పునర్వినియోగం చేయడం వల్ల కొంత తక్కువ విద్యుత్తును వాడుకుంటాయి. ఇవి గృహావసరాలకు ఉపయోగపడలేదు. ఆస్పత్రుల్లో కొన్ని పరిమిత అవసరాల్లో... కమర్షియల్‌గా మాత్రమే పరిమితంగా వాడుకలో ఉన్నాయి. ట్యూబ్‌లైట్: ఇది పొడవైన కాంతి పైపు. దీన్ని ట్యూబ్ ఫ్లోరొసెంట్ అంటారు. దీనివల్ల విద్యుత్‌ను పొడవాటి పైపు మొత్తం ప్రసరింప జేయడం ద్వారా వెలుగు వృథాని అరికట్టడం జరుగుతుంది. ట్యూబ్‌లైట్ పగిలినపుడు మన చేతికి పొడిపొడిగా అంటేది ఫాస్పర్. ట్యూబ్‌లోని వెలుగు దీనిమీద పడటం వల్ల ఉత్పత్తి అయిన వెలుగు మరింత ఎక్కువగా, తేటగా, కాంతివంతంగా వస్తుంది. ట్యూబ్‌కు రెండు వైపుల మాత్రమే వెలుగు ఉత్పత్తి అయినా మొత్తం ట్యూబ్ అంతా ఉత్పత్తి అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఇన్కాండిసెంట్కంటే తక్కువ కరెంటును తీసుకుని ఎక్కువ వెలుగు ఇస్తుంది. ట్యూబ్లైట్లో చోక్, స్టార్టర్ ఎందుకు ఉంటాయంటే ట్యూబ్ ఆన్ చేసినపుడు మాత్రమే పూర్తి కరెంటు తీసుకుంటాయి. ఆ తర్వాత అవసరం ఉండదు. కాబట్టి వేసిన తర్వాత ఇవి ఎనర్జీని నియంత్రిస్తాయి. ఫోర్లొసెంట్ బల్బ్: ఇవి వేడి రహిత కాంతిని ఇస్తాయి. పగటి వెలుతురులా సహజ వెలుగును ఇస్తుంది. ఫ్లోరెసెంట్ బల్బుల్లో పాదరసపు వాయువు వల్ల వెలుగు ఉత్పత్తువుతుంది. వీటిలో చుట్టూ లోపల పూసిన ఫాస్పర్ దానిని మనం చూడదగిన వెలుగుగా మారుస్తుంది. ఇవి అత్యంత విసృ్తతంగా ఉపయోగంలోకి వచ్చాయి. అందంగా ఉండటం, ఆకర్షణీయమైన ఆకారాల్లో ఉండటం కూడా వీటి ఆదరణకు కారణం. ఇందులో మామూలు హోల్డర్‌లో పెట్టుకోవడానికి అనుగుణంగా సీఎఫ్ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరొసెంట్ ల్యాంప్)... బల్బులు వచ్చాయి. ఇవి విద్యుత్తును బాగా ఆదాచేస్తాయి. ట్యూబ్కంటే వేగంగా, తక్కువ విద్యుత్తుతో పనిచేస్తాయివి. ఎల్ఈడీ బల్బు: ఎల్ఈడీ అంటే లైట్ ఎమిటింగ్ డియోడ్. ఇవి అన్నిటికంటే తక్కువ విద్యుత్తును తీసుకుని ఎక్కువ కాంతిని శక్తివంతంగా ప్రసరింపజేస్తాయి. అయితే వీటి ధర సీఎఫ్ఎల్ కంటే చాలా ఎక్కువ. వాటిలా ఎల్ఈడీ కాంతిని ఎక్కువ ప్రదేశానికి విస్తరించదు. ఇటీవలే ఇది గృహావసరాలకు అనుగుణంగా తయారవుతోంది. పూర్తిగా జనాలకు చేరువ కాలేదు. ఇవి కాకుండా ఇపుడు హెచ్ఐడీ (హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ ల్యాంప్స్) వచ్చాయి. ఇవి వాహనాల లైట్లలో బాగా వాడుతున్నారు. ఇందులో గ్యాస్, మెటల్ సాల్ట్స్ నింపుతారు. ఇవి సుదూరంగా కూడా వెలుగును ఇవ్వగలవు. -
అది సరేనయ్యా..!
అమెరికా సంయుక్త రాష్ట్రాల 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్. ఆయన ఎంత రాజనీతిజ్ఞుడో అంతటి దైవభక్తిపరుడు. దేశం రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నప్పుడు, సైనిక సంక్షోభంలో ఉన్నప్పుడు, మానవీయ విలువల సంక్షోభంలో ఉన్నప్పుడు, సంక్షోభాలన్నీ కలిసి అంతర్యుద్ధంగా మారినప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలను ఆయన సమైక్యంగా ఉంచగలిగారు. దైవభక్తి ఆయన ప్రధాన బలం. రోజూ తెల్లవారుజామున నాలుగింటికే లేచి ఐదింటివరకు ఆయన ప్రార్థనలో కూర్చునేవారు. భక్తి వచనాలు పఠించేవారు. ఇది కనిపెట్టి, నాస్తికులైన కొందరు వైట్‌హౌస్ ఉన్నతస్థాయి ఉద్యోగులు ఆయన దృష్టిలో పడడం కోసం సందు దొరికినప్పుడల్లా ఆయన ముందు ఆస్తికత్వాన్ని నటించేవారు. అయిన దానికి కాని దానికీ దేవుడి ప్రస్తావన తెచ్చేవారు . ఓసారి ఇలాగే - అంతర్యుద్ధ సమయంలో - సైనికోద్యోగి ఒకరు వైట్‌హౌస్‌లో లింకన్ దగ్గరికి వచ్చారు. ‘‘ఎలా ఉంది పరిస్థితి?’’ అని అతడిని అడిగారు లింకన్. ‘‘దేవుడు మనవైపు ఉన్నాడు’’ అన్నాడు ఆ వ్యక్తి. ‘‘దక్షిణ ప్రాంత రాష్ట్రాలు మన దారిలోకి వస్తున్నాయా?’’ అని అడిగారు లింకన్. దానికి కూడా ఆ వ్యక్తి ‘‘దేవుడు మనవైపు ఉన్నాడు’’ అని చెప్పాడు. లింకన్ చిరాకు పడ్డారు. ‘‘దేవుడు మన వైపు ఉన్నాడు సరే, మనం దేవుడి వైపు ఉన్నామా? అది చెప్పవయ్యా!’’ అన్నారు లింకన్, కోపాన్ని ఆపుకుంటూ. ఆ వైట్‌హౌస్ ఉద్యోగి మళ్లీ నోరెత్తలేదు. -
పొన్నాల, దామోదర, అరుణ అన్యాయం చేశారు: ఎమ్మెల్యే అబ్రహం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థుల బి.ఫారాలు తనకు ఇవ్వకుండా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య,తీవ్ర అన్యాయం చేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం ఆరోపించారు. దళిత ఎమ్మెల్యేకే న్యాయం చేయలేని కాంగ్రెస్... ప్రజలకు ఏం సామాజిక న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. టీఆర్ఎస్లో చేరే అంశంపై కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానన్నారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధి తన హయాంలో జరిగిందని, నిన్నగాక మొన్న వేరే పార్టీ నుంచి వచ్చిన వెంకట్రామిరెడ్డికి బి.ఫారాలు ఎలా ఇస్తారని ప్రశ్నించార -
పద్యానవనం: పాములూ, నిచ్చెనలూ!
పచ్చిగ పావులం గదిపి పందెములం దలక్రిందు చేసి యీ నిచ్చెన లెక్కినా ననుచు నిక్కకు; పక్కకు జూడు మల్లదే! విచ్చిన నోటితో బుసలు వెట్టెడు ఆ పెనుబాము నోటిలో జొచ్చిన-చచ్చినట్లు తొలిచోటుకు జఱ్ఱున జారకుందువే? మంచి జరిగితే అది తమ వల్లేననీ, చెడు జరిగితే మాత్రం ఇతరుల వల్ల అనీ బల్లగుద్ది చెప్పే వారుంటారు. అందుకోసం, వారు తొలి నుంచి పథకం ప్రకారమే వ్యవహరిస్తారు. అంటే, మాంచి ఫ్లాట్ గీస్తారన్న మాట. ఎందుకైనా మంచిదని కాస్త వ్యూహాత్మకంగా నడుచుకుంటూ అవసరానికి మించి నాలుగు ఎక్కువ మాటలు ముందుగానే చెప్పిపెడతారు. అలా చెప్పే మాటలు రెండు రకాలుగానూ ఉంటాయి. ఎటయినా అన్వయించడానికి వీలుగా, గోడమీద పిల్లి వాటంగా అన్నమాట! అంతా జరిగాక, ‘‘చూశారా! నే ముందే చెప్పాను, నాకెందుకో మొదట్నుంచీ తెలుస్తూనే ఉంది, నే గెలుస్తాను, గెలిచి తీరుతానని’’ అంటారు. ‘‘అబ్బో, ఇలా గెలవడానికి నేనెంతగా కష్టపడ్డానో, ఏమేం చేశానో.....!’’ అంటూ పెద్ద చాంతాడంత జాబితా మీ ముందు పెట్టినా ఆశ్చర్యం లేదు. అదే ఓడిపోతేనో? అమాంతం నింద ఇతరులపై వేసేయడమే! ‘‘నే మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాను, నే గెలవడానికి ఇన్నేసి యత్నాలు చేస్తున్నప్పటికీ, వారంతా కలిసి దెబ్బ కొడతారనీ, నన్ను గెలవనీకుండా మాయోపాయం చేస్తారనీ తెలుసు, కడకు అదే జరిగింది’’ అంటూ, నిష్ఠూరాలాడుతారు. ఇదీ, ద్వంద్వ వైఖరి. నిజానికి అవే కారణాలు కావచ్చు, కాకా పోవచ్చు. జరిగిన పరిణామాల్లో తమ పాత్ర ఉన్నట్టో, లేనట్టో ఆపాదించేందుకు చేసే అనవసర ప్రయాస వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. మన ఎన్నికల తర్వాత ఫలితాలు చూసి గర్వించే-గర్హించే వారి స్పందనలు కూడా, అచ్చు ఇలానే ఉంటాయి. అందుకే గీతాకారుడైన కృష్ణుడు చెబుతాడు, ‘గెలుపు నందు ఉప్పొంగక, ఓటముల యందు కృంగిపోక... గెలుపోటముల యందు సమస్థితి కలిగిన వాడే స్థితప్రజ్ఞుడు’ అని. అంత బరువైన డైలాగుల సంగతెలా ఉన్నా, మనం కొంచెం, వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తే ఎదురయ్యే ఇబ్బంది తక్కువ. గెలుపయితే మన వల్ల, ఓటమైతే ఇతరుల వల్ల అనే ముందస్తు భావన లేకుండా, నిజాయితీగా ఆ గెలుపోటములకు గల కారణాల్ని విశ్లేషించగలిగితే, అవసరానికి మించి ఉప్పొంగడమో, అనవసరంగా కృంగిపోవడమో ఉండదు. ఆ సృ్పహ ఉంటే చాలు, ఫలితమేదయినా మనసుకు హాయిగా ఉంటుంది. ఇది, చెప్పినంత తేలికేం కాదు, కానీ, అసాధ్యం కూడా కాదు. భగవద్గీతలో చెప్పినట్టు, ఫలితమాశించకుండా నిష్కామ కర్మ ఆచరించడం అంటే ఇదేనేమో! అందుకే, ఉమర్ ఖయ్యామ్ చెబుతున్నాడు, వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కి ఎంతో పైకి వచ్చానని నిక్కకు, నీల్గకు, నిగ్రహంతో ఉండూ అని. అది నీ ప్రతిభ వల్లా జరిగి ఉండవచ్చు, లేదా ఇంకోలా ఫక్తు యాదృచ్ఛికమైందీ కావచ్చు. నిజానికి ఈ పచ్చీసు ఆటలో ప్రతిభ కన్నా, అదృష్టంపై ఆధారపడి జరిగేదే ఎక్కువ. అదే ఆట క్రమంలో, అంతే యాదృచ్ఛికంగా ఏ పాము నోటనో పడితే.... మళ్లీ కిందకు దిగి రాక తప్పదు! నీ ప్రతిభాపాటవాలతో నిమిత్తం లేకుండానే అలా జరగొచ్చు! అదీ అట్టడుగున, ఆట ఆరంభించిన తొలి గడిలోకయినా జారవచ్చు! అలా జరిగినందుకు మనమే కారణమని చింతిస్తూ అక్కడే కూర్చుంటే ముందుకు సాగడం కూడా కష్టమౌతుంది. ఆటల్లోనూ, జీవితంలోనూ గెలుపోటములు శీతోష్ణములు. ఒకటి వెనుక ఒకటి. అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్, తన తనయుడికి చదువు చెప్పే ఉపాధ్యాయుడికి రాసిన లేఖలో ఇదే విషయం చెబుతాడు, ‘...గెలుపే కాదు, ఓటమిని జీర్ణించుకోవడమెలాగో నేర్పండి నా కుమారునికి’. మన పాత్ర-ప్రమేయం ఉన్నా లేకున్నా ఓటమి ఎదురయినా, అయితే అవనిగాక! అది ఒక ఆటలోనే కాదు మరెక్కడయినా! ప్రతి ఓటమి, తదుపరి విజయానికి గుణపాఠం కావాలి. కనీసం ఓ చక్కని అనుభవమైనా కావాలి. ఆట మాత్రమే కాదు, జీవితం కూడా ఇంతే అన్న సారాన్ని దట్టించాడీ పద్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి. అలతి అలతి పదాలతో అనంతార్థాన్ని విడమర్చే ఆయన సామర్థ్యానికి మచ్ఛుతునక ‘అమర్ ఖయామ్’ లోని ఈ పద్యం. - దిలీప్‌రెడ్డి -
అదే రోజు... అదే రైలు...
రెండుసార్లు అమెరికా అధ్యక్షునిగా ఎన్నికై, ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు అబ్రహం లింకన్. 1865 ఏప్రిల్ 15న తుపాకీ తూటాలకు బలయ్యారు. లింకన్ దేహాన్ని వాషింగ్టన్ డీసీ నుంచి ఆయన ఇల్లు ఉన్న స్ప్రింగ్ ఫీల్డ్ (ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉంది)కు తరలించడానికి ఓ ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. రైలు వాషింగ్టన్ డీసీకి, స్ప్రింగ్ఫీల్డ్కి మధ్యలో పోకప్సీ రైల్వేస్టేషన్లో ఆగింది. ఆ రోజు ఏప్రిల్ 29. లింకన్ మృతదేహాన్ని స్ప్రింగ్ ఫీల్డ్‌లోని ఓక్రిడ్జ్ శ్మశానంలో అంత్యక్రియలు చేశారు. మరుసటేడు అదే రోజు రాత్రి... అదే రైలు.. పువ్వులతో అలంకరించిన అదే రైలులో.. లింకన్ మృతదేహం... ఇది కలా.. నిజమా! చూస్తుండగానే రైలు వెళ్లిపోయింది. మరుసటి ఉదయం ఈ వార్త అమెరికా అంతటా పాకిపోయింది. మరునాడు చాలా మంది రైలు వస్తుందేమోనని చూశారు. కానీ రాలేదు. కానీ మరుసటి ఏడు ఏప్రిల్ 29న అదే రైలు మళ్లీ వచ్చిందట. ఇప్పటికీ అదే రోజున లింకన్ రైలు వస్తోందట. ఇప్పటికీ ఏప్రిల్ 29 నాటి అర్ధరాత్రి లింకన్ రైలును చూడటానికి వెళ్తున్నవాళ్లూ ఉన్నారు. దాన్ని చూశామని కొందరు నమ్మకంగా చెబుతున్నారు. అది వారి భ్రమో లేక నిజమో! ఈసారి మీరు అదేసమయానికి పోకప్సీ రైల్వేస్టేషన్ వెళితే మాత్రం లింకన్ రైలు గురించి వాకబు చేయడం మర్చిపోకండి. -
మా అన్నకు నేనున్నా..
బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన అబ్రహాం పరిస్థితిపై ఆయన సోదరుడు స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇటీవల అబ్రహాం రెలైక్కుతూ కిందపడి, కాలు విరగడంతో విమ్స్ ఆసుపత్రి ముందు దిక్కులేకుండా పడిఉన్న వైనంపై ‘అందరూ ఉన్న అనాథ!’ శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన అబ్రహాం తమ్ముడు అభిషేకం సోమవారం రాత్రి విమ్స్ ఆసుపత్రికి వచ్చి అబ్రహాంను చికిత్స కోసం వార్డులో చేర్పించాడు. అనంతరం ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయించాడు. అబ్రహాం ప్రస్తుతం ఆర్థోపెడిక్ మేల్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అభిషేకం మాట్లాడుతూ ‘మా అన్న పరిస్థితి సాక్షి పేపర్లో చూసి తెలుసుకున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అన్నకు కాలు ఆపరేషన్ చేయించి, నయం అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఇంటికి తీసుకెళ్తాను’ అని చెప్పారు. -
దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’
దైవం తన ప్రియ ప్రవక్త హ. ఇబ్రాహీం(అ)ను ఒక పరీక్షకు గురి చేశాడు. దైవాదేశ పాలనలో ప్రేమకు, మమకారాలకు, ఆత్మీయతకు ఏమాత్రం చోటు లేదని చాటి చెప్పిన అనుపమానమైన పరీక్ష ఇది. ఒకరోజు హ.ఇబ్రాహీం(అ) ఒక కలగన్నారు. స్వహస్తాలతో తన కొడుకు గొంతు కోస్తున్నట్లు ఆయన ఆ కలలో చూశాడు. దీన్ని దైవాదేశంగా భావించిన ఆయన లేక లేక కలిగిన సంతానాన్ని త్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం అటు భార్యతోనూ, ఇటు కొడుకుతోనూ సంప్రదించగా... వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. తరువాత ఇస్మాయీల్ను నిర్ణీత ప్రదేశానికి తీసుకెళ్లి, దైవనామ స్మరణ చేస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు ఇబ్రాహీం (అ). దీంతో తన ప్రియ ప్రవక్త పట్ల దైవప్రసన్నత పతాకస్థాయిలో ప్రసరించింది. దైవవాణి ‘నా ప్రియ ప్రవక్తా! నువ్వు కేవలం స్వప్నంలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా ఈ పరీక్షలో మీరు సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తమే లేదు. మీరు నా ఆదేశాలను తు.చ. తప్పక పాలించడంలో పరిపూర్ణులయ్యారు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తుగా ఒక స్వర్గ పొట్టేలును పంపుతున్నాను’ అని పలికింది. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో గొర్రెజాతికి చెందిన ఒక పొట్టేలు ప్రత్యక్షమైంది. దాన్ని జిబహ్ చేశారు హ. ఇబ్రాహీం (అ). ఈ తండ్రీ తనయుల దైవాజ్ఞ పాలనాక్రమంలో షైతాన్ వీరికి మూడుసార్లు అడ్డుపడతాడు. ఈ మూడుసార్లూ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు ఆ దుష్ట షైతాన్పై రాళ్లు విసిరి తరిమి కొడతారు. వీరిద్దరినీ షైతాన్ లోబరచుకోవడానికి ప్రయత్నించిన మూడుచోట్లా మూడు స్తంభాలున్నాయి. ఈ షైతాన్ స్తంభాలపై హాజీలు చిన్న చిన్న రాళ్లు విసిరి దుష్టశక్తులపై ధార్మిక చింతనాపరుల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తారు. దుష్టశక్తులు, ధర్మ విరోధులు ఎప్పుడు ఎక్కడ ఎదురైనా వారిని ఎదిరించడంలో ఎప్పుడూ ముందుంటామని ప్రకటించడమే ఈ రాళ్లు విసరడంలోని ముఖ్యోద్దేశం. ‘హజ్’ ఒక విశ్వజనీన, విశ్వ వ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకైనా ఉండదు. మానవులంతా ఒక్కటే అన్న భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. పవిత్ర హజ్ ఆరాధన జరిగే మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ, కోనల మధ్య నిర్మానుష్యంగా ఎలాంటి వనరులూ లేక నిర్జీవంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ హ. ఇబ్రహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హ.హాజిరా(అ)తోపాటు పాలబుగ్గల పసికందు, ఆ పుణ్యదంపతుల ఏకైక సంతానమైన హ. ఇస్మాయీల్ను వదిలేసి వెళ్లిపోతారు. అప్పుడు ‘నన్నూ, నా బిడ్డనూ ఈ జన సంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోతున్నారేమిటి? అని హ. హాజిరా ( అ) అడిగితే, ‘ఇది దైవాజ్ఞ. అందుకే వదిలి వెళుతున్నాను. అని చెప్పి, దైవంపై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్లిపోతారు హ. ఇబ్రాహీం. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం చుక్కనీరులేని ఆ ప్రదేశంలో చిన్నారి పసికందు ఇస్మాయీల్ గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో, ఆయన కాలి మడిమెలు రాసుకుపోయిన చోట దేవుని ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట వెలిసింది. ‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్ర జలంలో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆనాడు కేవలం రెండు ప్రాణాలకోసం వెలసిన ఆ నీరు ఈనాడు ‘హజ్’ యాత్రకోసం మక్కా వెళ్లే లక్షలాదిమంది ప్రజలకు సమృద్ధిగా సరఫరా అవుతూ, యాత్రికులు తమ స్వస్థలాలకు తెచ్చుకున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని మహిమకు నిదర్శనం. ఆనాడు నిర్జన ఎడారి ప్రాంతంగా ఉన్న కీకారణ్యమే ఈనాడు సుందర మక్కానగరంగా రూపుదిద్దుకుని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి దైవాదేశం మేరకు హ. ఇబ్రాహీం (అ)మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకుని, తనయుడు ఇస్మాయీల్ సాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతి కట్టడాన్ని హ.ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు దైవానికి సమర్పించుకోవడంతో, అది ‘కాబా’ దైవగృహంగా పేరు పొందింది. కాబాగృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర సాధువస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ట, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. అందుకని, కాబా గృహ సందర్శనార్థం చేసుకునే ‘హజ్’ వల్ల ఉపాసనా రీతులన్నింటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఇందుకోసమే దైవవిశ్వాసులైన వారందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా ‘హజ్’ చేయాలని... ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్లూరుతుంటారు. హజ్ నియమాలు సాధారణంగా హజ్ చేయాలనుకునేవారు ఒక నాయకుని ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడతారు. హజ్ సంకల్పంతోనే మనస్సునూ, దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మనోవాంఛలను వదులుకుని, అసభ్య ప్రసంగాలకు దూరంగా ఉంటారు. కొంతకాలం వరకు దాంపత్య సంబంధాలను సైతం త్యజించి, నిరంతర దైవధ్యానంతో జీవితం గడుపుతారు. ఈ విధంగా హజ్ ఆరాధన మనిషిని అన్ని రకాల దుర్గుణాలకూ దూరంగా ఉంచి, పరమ పునీతుల్ని చేస్తుంది. హజ్ కోసం వచ్చే యాత్రికులంతా మక్కా మరికొన్ని మైళ్ల దూరం ఉండగానే నిరాడంబర వస్త్రధారణ చేయాలి. ధార్మిక పరిభాషలో దీన్ని ‘ఇహ్రాం’ అంటారు. అంతకుముందు రకరకాల వస్త్రధారణల్లో ఉన్న వివిధ దేశాలకు చెందిన వారంతా ‘ఇహ్రామ్’తో ఒక్కటై పోతారు. ధనికులు, పేదలు, అధికులు అధములు అన్న తేడాలేకుండా అందరూ కలసిపోతారు. ‘ఇహ్రామ్’ అంటే ఒక లుంగీ, ఒక దుప్పటి, పాదరక్షలు మాత్రమే ధరించడం. ఇహ్రాం ధరించిన తరువాత అన్ని ఆడంబరాలూ త్యజించాలి. అలంకారాలు మానుకోవాలి. కేశసంస్కారంతోపాటు కనీసం గోళ్లు కూడా కత్తిరించుకోకూడదు. ‘తఖ్వా’ అంటే దైవ భీతిని అలవరచుకుని నమాజు, జిక్ ్రతప్ప మరో ప్రాపంచిక విషయంవైపు మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి. నియమ నిష్ఠలతో చేసిన హజ్ యాత్ర దైవం మెచ్చే ఆరాధన. - యండీ ఉస్మాన్‌ఖాన్