బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన అబ్రహాం పరిస్థితిపై ఆయన సోదరుడు స్పందించి ఆస్పత్రిలో చేర్పించారు. ఇటీవల అబ్రహాం రెలైక్కుతూ కిందపడి, కాలు విరగడంతో విమ్స్ ఆసుపత్రి ముందు దిక్కులేకుండా పడిఉన్న వైనంపై ‘అందరూ ఉన్న అనాథ!’ శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన అబ్రహాం తమ్ముడు అభిషేకం సోమవారం రాత్రి విమ్స్ ఆసుపత్రికి వచ్చి అబ్రహాంను చికిత్స కోసం వార్డులో చేర్పించాడు. అనంతరం ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయించాడు.
అబ్రహాం ప్రస్తుతం ఆర్థోపెడిక్ మేల్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అభిషేకం మాట్లాడుతూ ‘మా అన్న పరిస్థితి సాక్షి పేపర్‌లో చూసి తెలుసుకున్నాను. నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అన్నకు కాలు ఆపరేషన్ చేయించి, నయం అయ్యేంత వరకు ఇక్కడే ఉండి ఇంటికి తీసుకెళ్తాను’ అని చెప్పారు.
మా అన్నకు నేనున్నా..
Published Wed, Dec 11 2013 3:07 AM | Last Updated on Sat, Aug 18 2018 9:28 PM
Advertisement
Advertisement