John F Kennedy
-
మేఘాలయలో హిట్లర్‌ను అరెస్టు చేసిన కెన్నెడీ?
ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలలో భారతదేశం ఒకటి. మన దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా కొన్ని వింతలు కనిపిస్తూ ఉంటాయి. 2008 మేఘాలయ ఎన్నికల్లో ఇలాంటి ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది. నాడు కెన్నెడీతో పాటు హిట్లర్ పేరు వార్తాపత్రికల ముఖ్యాంశాల్లో కనిపించాయి. 2024 లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం ఈ ఘటనను ‘ఎన్నికల కథనాలు’లో పంచుకుంది.2008లో మేఘాలయలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్రికల్లో ఒక షాకింగ్ న్యూస్ ప్రచురితమైంది. ‘జాన్ ఎఫ్ కెన్నెడీ స్వయంగా అడాల్ఫ్ హిట్లర్‌ను అరెస్టు చేశారు’ అనేది దాని హెడ్డింగ్. ఆ రెండు పేర్లకు చారిత్రక ప్రాధాన్యత ఉండటంతో ఈ వార్త దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నఅప్పటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి అడాల్ఫ్ లూ హిట్లర్ మారక్‌ను ఏదో కేసులో అక్కడి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జాన్ ఎఫ్ కెన్నెడీ అరెస్టు చేశారు. మరుసటి రోజు వార్తాపత్రికల్లో ‘జాన్ ఎఫ్ కెన్నెడీ చేతుల మీదుగా అడాల్ఫ్ లూ హిట్లర్ అరెస్ట్’ అనే శీర్షికతో ఈ వార్తను ప్రచురించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. నాటి ఎన్నికల ఫలితాల్లో హిట్లర్ విజయం సాధించారు.లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ కథనాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లొ పోస్ట్ చేసింది. గత ఏడాది అడాల్ఫ్ హిట్లర్ మారక్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కాగా జాన్ ఎఫ్ కెన్నెడీ అమెరికా 35వ అధ్యక్షుడు. అతను 1961 నుండి నవంబర్ 1963లో హత్యకు గురయ్యే వరకు ఈ పదవిలో కొనసాగారు. అదేవిధంగా అడాల్ఫ్ హిట్లర్ ఒకప్పటి జర్మనీ నియంత. ఆయన 1945లో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. #Chunaviकिस्सेभारतीय चुनावों से जुड़े रोचक किस्से 🙌#ECI #ChunavKaParv #DeshKaGarv #Elections2024 pic.twitter.com/1o88yQB3B2— Election Commission of India (@ECISVEEP) March 18, 2024 -
ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న శాపం!
కొందరిని బాధలు, కష్టాలు అప్పుడప్పుడు పలకరిస్తాయి. కానీ కొందరు మాత్రం నిరంతరం వాటిమధ్యే ఉంటారు. ఒకదాని తర్వాత మరొకటి వారిని చుట్టుముడతూనే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్.కెనెడీ కుటుంబం పరిస్థితి అదే. తరాలు మారుతున్నా వారి తలరాతలు మారడం లేదు. జాన్ కెనెడీ, ఆయన సోదరుడు సెనెటర్ రాబర్ట్ కెనెడీలను దుండగులు కాల్చి చంపారు. వారి సోదరుడు జోసెఫ్ కెనడీ రెండు ప్రపంచ యుద్ధంలో మరణించాడు. వారి సోదరి కథ్లీన్ కెవెన్‌డిష్ విమాన ప్రమాదంలో కన్నుమూశాడు. జాన్ కెనెడీ కుమారుడు 1999లో తాను నడుపుతున్న విమానం కూలి మరణించాడు. అతనితో పాటు భార్య, ఆమె సోదరి కూడా చనిపోయారు. ఇప్పుడు రాబర్ట్ కెనెడీ మనవరాలు 22ఏళ్ల సీర్సా కెనడీ హిల్ అతిగా మందులు వాడి గురువారం రాత్రి చనిపోయింది. కెనెడీ హిల్ తాను మానసిక ఒత్తిళ్లతో ఎలా కుంగిపోయానో వివరిస్తూ రాసిన వ్యాసం 2016లో అమెరికాలో ఆమెకు పేరు తెచ్చింది. కెనెడీ హిల్ తండ్రి పాల్ మైకేల్ హిల్ ఐర్లాండ్ వాసి. ఐరిష్ రిపబ్లిక్ (ఐఆర్ఏ) జరిపిన బాంబు దాడుల్లో ఆయన పాత్రపై బ్రిటన్ ప్రభుత్వం పెట్టిన కేసులో ఆయన దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష విధించారు. అయితే 15 ఏళ్ల తర్వాత 1993లో ఉన్నత న్యాయస్థానం ఆయన్ని నిర్దోషిగా విడుదల చేసింది. -
అనిశ్చితికి తెరదించేందుకే!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్యకు సంబంధించి ప్రజల్లో ఉన్న అనిశ్చితికి తెరదించేందుకు అన్ని వివరాలను వెల్లడిస్తామని అమెరికా స్పష్టం చేసింది. ‘హత్యకు సంబంధించిన ప్రతి వివరాన్ని పూర్తిగా వెల్లడిస్తాం. కేసుకు సంబంధించి బతికున్న వ్యక్తుల వివరాలను మాత్రం తెలపబోం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం ట్వీట్ చేశారు. సీఐఏ, ఇతర ఏజెన్సీలతో మాట్లాడిన తర్వాత మిగిలిన వివరాలూ వెల్లడించాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు. ‘మిలటరీ, భద్రత, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్, చట్టబద్ధ సంస్థల గౌరవాన్ని కాపాడటంతోపాటు, విదేశీ సంబంధాలకు విఘాతం కలగకుండా తాత్కాలికంగా పలు పత్రాల విడుదలను నిలిపివేయాల్సి వచ్చింది. 180 రోజుల సమీక్ష తర్వాత వాటినీ విడుదల చేస్తాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ విడుదల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నామని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పేర్కొన్నారు. ‘కేసుకు సంబంధించి మా దగ్గరున్న అన్ని వివరాలనూ వెల్లడిచేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. మీడియా మీతో ఎలా వ్యవహరిస్తుంది? హాలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ రిపోర్టర్ల పిల్లలతో ట్రంప్ సరదాగా సంభాషించారు. చిన్నారులకు కానుకలు అందించిన ట్రంప్.. మీడియాపై తనదైన శైలిలో జోకులు వేశారు. పిల్లలతో వారి తల్లిదండ్రుల ఉద్యోగం గురించి సరదాగా మాట్లాడారు. వారందరితో కలసి గ్రూప్ ఫొటో దిగారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ట్రంప్ మీడియాపై తరచూ తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ‘మీరు మీ తల్లిదండ్రుల్లాగే ఉండాలనుకుంటున్నారా? జవాబు చెప్పొద్దు. చెబితే నాకు సమస్యలొస్తాయి. ప్రెస్ మీతో ఎలా వ్యవహరిస్తుంది? ప్రపంచంలో అందరికన్నా మిమ్మల్నే మీడియా జాగ్రత్తగా చూసుకుంటుందని అనుకుంటున్నా’ అని ట్రంప్ సరదాగా అన్నారు. పిల్లలతో ఉల్లాసంగా గడిపిన ట్రంప్ వారికి చాక్లెట్లు ఇచ్చారు. -
కెనడీ హత్య ఫైల్స్ విడుదల
వాషింగ్టన్ డీసీ : అమెరికానేకాక మొత్తం ప్రపంచాన్నే కుదిపేసిన అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యోదంతం ఫైళ్లను అమెరికా తొలిసారి బహిర్గం చేసింది. జాతీయ భద్రతా ఏజెన్సీల సూచనల మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రత్యేక ఫైళ్లను మాత్రం విడుదల చేయలేదు. మొత్తం 3,191 పైళ్లలో 2,891 ఫైళ్లను అధికారులు విడుదల చేశారు. కెనడీ హత్యకు సంబంధించిన ముఖ్యమైన 300 ఫైళ్లను మాత్రం ట్రంప్ విడుదల చేయలేదు. అమెరికా అధ్యక్ష పదవిలో ఉండగా జాన్ ఎఫ్ కెనడీని 1963, నవంబర్ 22న హత్య చేశారు. అప్పటినుంచి ఈ హత్యపై ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ హత్య ఒక మిస్టరీగా ప్రజలు భావిస్తారు. లీ హర్వీఏ ఓస్వాల్డ్ అనే హంతకుడు అధ్యక్షుడు కెనడీని హత్య చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. కెనడీ హత్య జరిగిన మూడు దశాబ్దాల తరువాత.. రికార్డ్ కలెక్షన్ యాక్ట్ -1992 ప్రకారం.. హత్య సంబంధించిన అన్ని ఫైళ్లను ఒకే చోటకు చేర్చాలని నాటి ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ ప్రకారం హత్యకు సంబంధించిన అన్ని ఫైళ్లను సేకరించి నేషలన్ ఆర్చీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఏఆర్ఏ)లో భద్రపరిచారు. ఆ సమయంలో ఈ ఫైళ్లను 2017 అక్టోబర్ 26న ప్రజల ముందుంచాలని నిర్ణయించారు. కీలకమైన ఫైళ్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో హత్యకు సంబంధించిన కుట్రపై ప్రజలకున్న అనుమానాలు అలాగే మిగిలిపోతాయని చరిత్రకారులు అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. కెనడీ హత్యకు ముందు ఓస్వాల్డ్ మెక్సికో పర్యటన కూడా రహస్యంగానే మిగిలిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. -
ట్రంప్ జాతకం చెప్పిన రామ్ గోపాల్ వర్మ
ముంబయి: ప్రైమరీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. డోనాల్డ్ ట్రంపును తమ దేశ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే అమెరికా కంపుకంపు అవడం ఖాయమని ప్రత్యక్షంగా ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్.. పరోక్షంగా పలువురు అంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచి ట్రంప్ ఎన్నిరకాల విమర్శలతో నిండిన వ్యాఖ్యలు చేశాడో.. ఎన్ని వివాదాల్లో కూరుకుపోయాడో తెలిసిందే. అలాంటి వివాదాస్పద అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ఎప్పుడూ వివాదాస్పదంగా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏకంగా ఆకాశానికి ఎత్తేశాడు. డోనాల్డ్ ట్రంప్ ఎందుకో అమెరికాలోనే గొప్ప అధ్యక్షుడిగా చరిత్ర లిఖిస్తాడని తనకు అనిపిస్తుందంటూ తన అభిప్రాయం చెప్పాడు. అమెరికా చరిత్రలో గొప్పవారైన జాన్ ఎఫ్ కెన్నడీ, అబ్రహం లింకన్ మాదిరిగా డోనాల్డ్ ట్రంప్ కూడా చరిత్రలో మిగిలిపోతారంటూ ఆయన ట్వీట్ చేశారు. I think Donald J Trump will be the best president ever in US history including John F Kennedy and Abraham Lincoln — Ram Gopal Varma (@RGVzoomin) 5 May 2016 -
‘కెనడీ హత్యకేసు పునర్విచారణ!’
సీమా అజరుద్దీన్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదివిన వ్యక్తి. వృత్తిరీత్యా హైద్రాబాద్‌లో కార్పొరేట్ సంస్థలకు మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పుతున్నారు. ప్రవృ త్తిరీత్యా థియేటర్‌పై మక్కువ. చిన్నతనంలో చదివిన రెండు కథల (స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్, హు ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ విర్జీనియా ఉల్ఫ్) హక్కులు కొని వాటినే భారతీ య బృందంతో అమెరికాలోని బ్రాడ్వేలో వరుసగా కొన్ని నెలలు నాటకాలుగా ప్రదర్శించారు. థియేటర్ ద్వారా ప్రపంచ సాహిత్యానికి నీరాజనాలు పలకాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల ‘షేక్స్పియర్కు నివాళి’ పలికారు. మార్తగా, మర్చంట్ ఆఫ్ వెనిస్ పాత్రధారి ణిగా విమర్శకుల ప్రశంసలు పొందారు. సురభి సంస్థలో నాలుగేళ్ల కళాకారిణి ‘అమ్మలు’పై అంతర్జాతీయ స్థాయిలో డాక్యుమెంటరీ తీశారు. తాజాగా: జాన్ ఎఫ్ కెనడీహత్య జరిగి 50 ఏళ్ల యిన సందర్భంగా ఈరోజు సాయంత్రం హైద్రాబాద్ లోని నాసర్ బాలికోన్నత పాఠశాలలో ‘జెకెఎఫ్ యూలజీ’ని (ప్లే) ప్రదర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో కర్తాల్ ప్రొడక్షన్స్ అధినేత్రి సీమా అజరుద్దీన్, రచయిత-దర్శ కుడు డా. కృష్ణకాంత్ అయ్యంగార్ (కె.ఎస్.ఐ)లతో ఇంటర్వ్యూ. కెనడీ గుణగానానికి కారణాలేమిటి? సీమా అజరుద్దీన్: ‘విలువలు పాటించని ఇంటిని కాప లాదారుడు కాపాడలేడు’ అని విశ్వసించాడు కెనడీ. విలువలు పాటించాలంటే శక్తి కలిగి ఉండాలని, అమె రికా తాను సంతరించుకున్న శక్తిద్వారా బలహీన రాజ్యా లను భయపెట్టరాదని, దేశాల మధ్య, దేశంలోనూ విద్వేషాలను తొలగించాలని తపించాడు. కెనడీ హత్య గురించి ఐదవ ఏట విన్నాను. లక్షలాది కుటుంబాల్లా మా కుటుంబమూ ఆ వార్త విని వణికిపోయింది. కెనడీ అందగాడు. దాపరికం లేనివాడు. ప్యారిస్‌లో అడుగు పెడుతూ ‘ ప్చ్, భార్య బాడీగార్డ్‌గా ప్యారిస్కువచ్చాను’ అన్న చతురుడు! చరిత్ర విద్యార్ధిగా కూడా నేను కెనడీ అభిమానిని. ఆయన సమాధిని అనేకసార్లు సందర్శిం చాను. మసాచుసెట్స్‌లోని ఆయన కుటుంబసభ్యులను కలుసుకున్నాను. కెనడీ కుమారుడు జాన్ జూనియర్, తండ్రి గురించి తల్లి జాక్విలిన్ గురించి పారవశ్యంగా చెప్పేవాడు. కెనడీ కుమార్తె కెరొలిన్ సిగ్గరి. ప్రస్తుతం జపాన్ దేశానికి అమెరికన్ దౌత్యవేత్త. కెనడీ తలకు రెండు బుల్లెట్లు తగిలిన తరువాత, ఆయన్ను భార్య జాక్విలిన్ సమీపిస్తుండగా తీసిన ఫొటో ఈ మధ్యనే చూశాను. ఆ వేదనను మాటల్లో చెప్పగలమా?! కెనడీ హత్యకు కారకులెవరో ఇంతవరకూ ‘అఫీషియల్ వెర్షన్’ లేకపోవడం చోద్యం కాదా! ‘యూలజీ’ ద్వారా ఏమి చెప్పబోతున్నారు! సీమా అజరుద్దీన్ - కె.ఎస్.ఐ: ‘చనిపోబోతోన్న రాజును అధికార యంత్రాంగం మరచిపోతుంది’ అనే టెనిసన్ వాక్యం హత్యకు గురైన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ హత్యోదంతానికి వర్తిస్తుందన్నారు విచారణా ధికారి జిమ్ గ్యారిసన్. 1963, నవంబర్ 22వ తేదీన అమెరికాలోని డలాస్ నగరంలో అంతా చూస్తోండగా పట్టపగలు కెనడీని హత్యచేశారు. ఈ కేసును న్యూ ఆర్లి యన్స్ జిల్లా అటార్నీ జిమ్ గ్యారిసన్ ఆరేళ్లు దర్యాప్తు చేశారు. ప్రత్యక్ష సాక్షులు తొమ్మిది మందిలో ఎనిమిది మంది మరణించగా, మిగిలిన ఒక్కరిని గంటసేపు విచారించి, నిస్సహాయ పరిస్థితుల్లో కేసును మూసేయా ల్సివచ్చింది. అడుగడుగునా ప్రభుత్వ సంస్థల సహాయ నిరాకరణ లేదా తిరస్కరణలను ఉదహరిస్తూ ప్రభు త్వం సత్యాన్ని హత్య చేస్తోంది కాబట్టే తమ దేశంలో దుర్మార్గమైన నేరాలు జరుగుతున్నాయని గ్యారిసన్ వ్యాఖ్యానించాడు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వారు అధికారయంత్రాంగంతో పోరాడాల్సిన ఆవశ్య కత ఉందని గ్యారిసన్ నొక్కిచెప్పారు. సత్యానికి కాపలా దారులు చైతన్యవంతులైన ప్రజలే అన్నారు. గ్యారీసన్ చనిపోయినా అతడి స్ఫూర్తి కొడిగట్టలేదు. 30 లక్షల పేజీలు లాకర్లలో దాచిపెట్టినా సత్యం ఏమిటో వెలుగు చూడలేదు. వ్యక్తులుగా, బృందాలుగా, కెనడీ అభిమా నులు ‘సత్యంవధ’కు కారణాలను శోధిస్తున్నారు. కెన డీని చంపింది కేవలం తుపాకి పేల్చిన వ్యక్తి మాత్రమే కాదని ఇతరేతర శక్తులు కుట్రపన్నారని ‘మేము సైతం’ విశ్వసిస్తున్నాం. ‘జె.కె.ఎఫ్ యూలజీ’ కొత్తకోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తుంది. మంచి ప్రపంచం కోసం కృషిచేస్తూ, కుట్రలకు బలైన వివిధ దేశాల, సమాజాల నాయకులను ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది! బలమైన వ్యక్తులు నెట్‌వర్క్‌గా ఏర్పడి కెనడీని హత్య చేశారని తగిన ఆధారాలు ప్రతిపాదిస్తూ కెనడీ హత్యపై విచార ణను పునఃప్రారంభిస్తుంది! - పున్నా కృష్ణమూర్తి