‘కెనడీ హత్యకేసు పునర్విచారణ!’
‘కెనడీ హత్యకేసు పునర్విచారణ!’
Published Fri, Nov 22 2013 12:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
సీమా అజరుద్దీన్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో చదివిన వ్యక్తి. వృత్తిరీత్యా హైద్రాబాద్‌లో కార్పొరేట్ సంస్థలకు మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్పుతున్నారు. ప్రవృ త్తిరీత్యా థియేటర్‌పై మక్కువ. చిన్నతనంలో చదివిన రెండు కథల (స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్, హు ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ విర్జీనియా ఉల్ఫ్) హక్కులు కొని వాటినే భారతీ య బృందంతో అమెరికాలోని బ్రాడ్వేలో వరుసగా కొన్ని నెలలు నాటకాలుగా ప్రదర్శించారు. థియేటర్ ద్వారా ప్రపంచ సాహిత్యానికి నీరాజనాలు పలకాలనే లక్ష్యంలో భాగంగా ఇటీవల ‘షేక్‌స్పియర్‌కు నివాళి’ పలికారు. మార్తగా, మర్చంట్ ఆఫ్ వెనిస్ పాత్రధారి ణిగా విమర్శకుల ప్రశంసలు పొందారు. సురభి సంస్థలో నాలుగేళ్ల కళాకారిణి ‘అమ్మలు’పై అంతర్జాతీయ స్థాయిలో డాక్యుమెంటరీ తీశారు.
తాజాగా: జాన్ ఎఫ్ కెనడీహత్య జరిగి 50 ఏళ్ల యిన సందర్భంగా ఈరోజు సాయంత్రం హైద్రాబాద్ లోని నాసర్ బాలికోన్నత పాఠశాలలో ‘జెకెఎఫ్ యూలజీ’ని (ప్లే) ప్రదర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో కర్తాల్ ప్రొడక్షన్స్ అధినేత్రి సీమా అజరుద్దీన్, రచయిత-దర్శ కుడు డా. కృష్ణకాంత్ అయ్యంగార్ (కె.ఎస్.ఐ)లతో ఇంటర్వ్యూ.
కెనడీ గుణగానానికి కారణాలేమిటి?
సీమా అజరుద్దీన్: ‘విలువలు పాటించని ఇంటిని కాప లాదారుడు కాపాడలేడు’ అని విశ్వసించాడు కెనడీ. విలువలు పాటించాలంటే శక్తి కలిగి ఉండాలని, అమె రికా తాను సంతరించుకున్న శక్తిద్వారా బలహీన రాజ్యా లను భయపెట్టరాదని, దేశాల మధ్య, దేశంలోనూ విద్వేషాలను తొలగించాలని తపించాడు. కెనడీ హత్య గురించి ఐదవ ఏట విన్నాను. లక్షలాది కుటుంబాల్లా మా కుటుంబమూ ఆ వార్త విని వణికిపోయింది. కెనడీ అందగాడు. దాపరికం లేనివాడు. ప్యారిస్‌లో అడుగు పెడుతూ ‘ ప్చ్, భార్య బాడీగార్డ్‌గా ప్యారిస్‌కువచ్చాను’ అన్న చతురుడు! చరిత్ర విద్యార్ధిగా కూడా నేను కెనడీ అభిమానిని. ఆయన సమాధిని అనేకసార్లు సందర్శిం చాను. మసాచుసెట్స్‌లోని ఆయన కుటుంబసభ్యులను కలుసుకున్నాను. కెనడీ కుమారుడు జాన్ జూనియర్, తండ్రి గురించి తల్లి జాక్విలిన్ గురించి పారవశ్యంగా చెప్పేవాడు. కెనడీ కుమార్తె కెరొలిన్ సిగ్గరి. ప్రస్తుతం జపాన్ దేశానికి అమెరికన్ దౌత్యవేత్త. కెనడీ తలకు రెండు బుల్లెట్లు తగిలిన తరువాత, ఆయన్ను భార్య జాక్విలిన్ సమీపిస్తుండగా తీసిన ఫొటో ఈ మధ్యనే చూశాను. ఆ వేదనను మాటల్లో చెప్పగలమా?! కెనడీ హత్యకు కారకులెవరో ఇంతవరకూ ‘అఫీషియల్ వెర్షన్’ లేకపోవడం చోద్యం కాదా!
‘యూలజీ’ ద్వారా ఏమి చెప్పబోతున్నారు!
సీమా అజరుద్దీన్ - కె.ఎస్.ఐ: ‘చనిపోబోతోన్న రాజును అధికార యంత్రాంగం మరచిపోతుంది’ అనే టెనిసన్ వాక్యం హత్యకు గురైన అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెనడీ హత్యోదంతానికి వర్తిస్తుందన్నారు విచారణా ధికారి జిమ్ గ్యారిసన్. 1963, నవంబర్ 22వ తేదీన అమెరికాలోని డలాస్ నగరంలో అంతా చూస్తోండగా పట్టపగలు కెనడీని హత్యచేశారు. ఈ కేసును న్యూ ఆర్లి యన్స్ జిల్లా అటార్నీ జిమ్ గ్యారిసన్ ఆరేళ్లు దర్యాప్తు చేశారు. ప్రత్యక్ష సాక్షులు తొమ్మిది మందిలో ఎనిమిది మంది మరణించగా, మిగిలిన ఒక్కరిని గంటసేపు విచారించి, నిస్సహాయ పరిస్థితుల్లో కేసును మూసేయా ల్సివచ్చింది. అడుగడుగునా ప్రభుత్వ సంస్థల సహాయ నిరాకరణ లేదా తిరస్కరణలను ఉదహరిస్తూ ప్రభు త్వం సత్యాన్ని హత్య చేస్తోంది కాబట్టే తమ దేశంలో దుర్మార్గమైన నేరాలు జరుగుతున్నాయని గ్యారిసన్ వ్యాఖ్యానించాడు. సత్యాన్ని తెలుసుకోవాలనుకునే వారు అధికారయంత్రాంగంతో పోరాడాల్సిన ఆవశ్య కత ఉందని గ్యారిసన్ నొక్కిచెప్పారు. సత్యానికి కాపలా దారులు చైతన్యవంతులైన ప్రజలే అన్నారు. గ్యారీసన్ చనిపోయినా అతడి స్ఫూర్తి కొడిగట్టలేదు. 30 లక్షల పేజీలు లాకర్లలో దాచిపెట్టినా సత్యం ఏమిటో వెలుగు చూడలేదు.
వ్యక్తులుగా, బృందాలుగా, కెనడీ అభిమా నులు ‘సత్యంవధ’కు కారణాలను శోధిస్తున్నారు. కెన డీని చంపింది కేవలం తుపాకి పేల్చిన వ్యక్తి మాత్రమే కాదని ఇతరేతర శక్తులు కుట్రపన్నారని ‘మేము సైతం’ విశ్వసిస్తున్నాం. ‘జె.కె.ఎఫ్ యూలజీ’ కొత్తకోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరిస్తుంది. మంచి ప్రపంచం కోసం కృషిచేస్తూ, కుట్రలకు బలైన వివిధ దేశాల, సమాజాల నాయకులను ప్రేక్షకులకు గుర్తుచేస్తుంది! బలమైన వ్యక్తులు నెట్‌వర్క్‌గా ఏర్పడి కెనడీని హత్య చేశారని తగిన ఆధారాలు ప్రతిపాదిస్తూ కెనడీ హత్యపై విచార ణను పునఃప్రారంభిస్తుంది!
- పున్నా కృష్ణమూర్తి
Advertisement
Advertisement